Best AC Prices : అసలే సమ్మర్.. కొత్త ఏసీ కొంటున్నారా? రూ. 30వేల లోపు ధరలో టాప్ 3 బెస్ట్ ఏసీలు ఇవే.. ఓసారి లుక్కేయండి..!
Best AC Prices : వేసవిలో కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్‌లో రూ. 30వేల లోపు టాప్ 3 బెస్ట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఏసీని వెంటనే కొని ఇంటికి తెచ్చుకోండి.

Best AC Prices
Best AC Prices : వేసవి వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు తగ్గట్టుగానే మార్కెట్లో ఏసీలకు కూడా ఫుల్ డిమాండ్ పెరిగింది. తక్కువ ధరలో ఏసీలను కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే అద్భుతమైన అవకాశం.. కేవలం రూ. 30వేల లోపు ధరలో ఆకర్షణీయమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఏసీలు అందుబాటులో ఉన్నాయి.
మీ బడ్జెట్ రూ. 30వేలు అయితే ఇప్పుడే మీకు నచ్చిన ఏసీని కొనేసుకోండి. అద్భుతమైన పర్ఫార్మెన్ మాత్రమే కాదు.. మంచి కూలింగ్ కెపాసిటీ, పవర్ కూడా సేవింగ్ చేసుకోవచ్చు. అలాగే ఏసీలలో క్వాలిటీ, ధర పరంగా కూడా అద్భుతమైన మోడల్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం మీ బడ్జెట్‌లో రూ. 30వేల లోపు లభ్యమయ్యే టాప్ 3 బెస్ట్ ఎయిర కండిషనర్లను ఓసారి లుక్కేయండి.
1. పానాసోనిక్ 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC (CS/CU-KU12ZKYF) :
ఈ ఏసీ కూలింగ్ కెపాసిటీ 1 టన్.. చిన్న గదుల నుంచి మధ్య తరహా గదులకు బెస్ట్ ఏసీ. 3 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. పవర్ కూడా సేవ్ చేస్తుంది. ఇన్వర్టర్ టెక్నాలజీని కలిగి ఉంది. ఎక్కువకాలం పాటు మన్నికను అందిస్తుంది. ఇందులో PM 2.5 ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంది.
ఈ ఏసీ ఎయిర్ శుభ్రంగా ఉంచుతుంది. త్వరగా గది కూల్ అయ్యేలా చేస్తుంది. స్మార్ట్ డయాగ్నసిస్ ఫీచర్‌తో వస్తుంది. ఏసీ మెయింట్‌నెన్స్ కూడా చాలా ఈజీ. పానాసోనిక్ ఏసీ ఫీచర్లతో పవర్ ఆదా చేయొచ్చు. ఈ ఏసీ ధర దాదాపు రూ. 29,999కు అందుబాటులో ఉంది.
2. వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ ఫిక్స్‌డ్ స్పీడ్ స్ప్లిట్ AC (183 DZZ) :
మీ ఇంట్లో పెద్ద రూమ్ ఉంటే.. ఈ 1.5 టన్ AC బెస్ట్ ఆప్షన్. 3 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. పవర్ సేవింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ వోల్టాస్ మోడల్ వేగంగా గదులను కూలింగ్ చేస్తుంది. అంటే.. బయటి ఉష్ణోగ్రత ఎంత ఎక్కువగా ఉన్నా గది మాత్రం త్వరగా కూలింగ్ అవుతుంది.
యాంటీ-డస్ట్ ఫిల్టర్‌ను కూడా కలిగి ఉంది. గదిలో ఎయిర్ ఎప్పటికప్పుడూ క్లీన్ చేస్తుంది. అలెర్జీల నుంచి రక్షిస్తుంది. స్లీప్ మోడ్ ఫీచర్ రాత్రిపూట ఉష్ణోగ్రతను ఆటోమాటిక్‌గా అడ్జెస్ట్ చేస్తుంది. దాంతో మీ నిద్రకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఈ ఏసీ ధర దాదాపు రూ. 29,490 ఉండగా, 1.5 టన్ కేటగిరీలో బెస్ట్ మోడల్.
3. బ్లూ స్టార్ 0.8 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC (IC309RBTU) :
మీ గది చిన్నగా ఉందా? అయితే, 0.8 టన్ ఏసీ సరిగ్గా సరిపోతుంది. ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది. 3 స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉంది. పవర్ కూడా ఆదా అవుతుంది. ఏదైనా లోపాన్ని వెంటనే గుర్తించే స్మార్ట్ డిటెక్షన్ టెక్నాలజీ కూడా ఉంది.
సెల్ఫ్ డైగోనిసిస్ ఫీచర్ ఎక్కువకాలం మన్నికతో పాటు లైఫ్ లాంగ్ మెయింట్‌నెన్స్ అందిస్తుంది. ఈ ఏసీ ధర సుమారు రూ. 27,999కు అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో లభించే స్మార్ట్ ఏసీ అని చెప్పవచ్చు.