IPL 2025 : క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘జియోహాట్‌స్టార్‌’లో IPL మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు.. Vi లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..!

IPL 2025 : వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లతో IPL 2025 లైవ్ స్ట్రీమింగ్‌ను ఉచితంగా పొందవచ్చు. రోజువారీ డేటా లేదా OTT సబ్‌స్క్రిప్షన్ కోసం నచ్చిన ప్లాన్లను తీసుకోవచ్చు.

IPL 2025 : క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘జియోహాట్‌స్టార్‌’లో IPL మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు.. Vi లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..!

Watch IPL 2025

Updated On : March 22, 2025 / 5:04 PM IST

IPL 2025 : ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ లైవ్ మ్యాచ్‌లు చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదిలో ఐపీఎల్ మ్యాచ్‌లు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానున్నాయి. క్రికెట్ ఔత్సాహికుల కోసం టెలికాం కంపెనీలు ఫ్రీ OTT సబ్‌స్క్రిప్షన్‌లతో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.

ఇప్పటికే రిలయన్స్ జియో ఐపీఎల్ కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుండగా.. టెలికాం రేసులో వోడాఫోన్ ఐడియా (Vi) కూడా చేరింది. జియోకు పోటీగా ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో 3 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. మీరు ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు ఓటీటీ కోసం అదనంగా చెల్లించాల్సిన పనిలేదు. మీ మొబైల్ ఫోన్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించాలనుకుంటే ఈ Vi రీఛార్జ్ ప్లాన్‌లలో ఏదైనా ఒక ప్లాన్ తీసుకోండి.

Read Also : Tech Tips in Telugu : వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కడానికి అసలు కారణాలివే.. ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. బ్యాటరీ సేవింగ్ స్మార్ట్ టిప్స్..!

జియోహాట్‌స్టార్‌ ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్.. వోడాఫోన్ ఐడియా 3 కొత్త ప్లాన్‌లు :
వోడాఫోన్ ఐడియా రూ.239, రూ.399, రూ.101 ధరలతో మూడు రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఒక్కో ప్లాన్ ద్వారా ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. ఈ ప్లాన్‌లు ఏయే బెనిఫిట్స్ అందిస్తున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వోడాఫోన్ ఐడియా రూ. 239 రీఛార్జ్ ప్లాన్ :

  • ఈ ప్లాన్ 28 రోజులు వ్యాలిడిటీ
  • రోజుకు 2GB హై-స్పీడ్ డేటా
  • అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్‌
  • 28 రోజుల వ్యాలిడిటీకి 300 SMS బెనిఫిట్స్
  • OTT బెనిఫిట్స్ IPL స్ట్రీమింగ్ కోసం ఫ్రీ JioHotstar సబ్‌స్ర్కిప్షన్
  • బ్రౌజింగ్, స్ట్రీమింగ్, రోజువారీ డేటా అవసరయ్యే వారికి ఈ ప్లాన్ బెస్ట్

వోడాఫోన్ ఐడియా రూ. 399 రీఛార్జ్ ప్లాన్ :

  • ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు
  • రోజుకు 2GB హై-స్పీడ్ డేటా
  • అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాలింగ్స్
  • రోజుకు 100 ఫ్రీ SMS పొందవచ్చు
  • ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, IPL ఉచితంగా చూడొచ్చు.
  • బోనస్ ఫీచర్.. వారాంతపు డేటా రోల్‌ఓవర్ (వాడని డేటా ఫార్వార్డ్ ) చేయొచ్చు.

Read Also : Apple iPhone 16 : ఫ్లిప్‌కార్ట్‌‌లో చౌకైన ధరకే ఆపిల్ ఐఫోన్ 16.. ఏకంగా రూ.22,800 డిస్కౌంట్.. డోంట్ మిస్..!

వోడాఫోన్ ఐడియా రూ. 101 రీఛార్జ్ ప్లాన్ :

  • ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు
  • ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్
  • ఈ ప్లాన్‌లో వాయిస్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ ఉండవు.

జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మాత్రమే కోరుకునే కస్టమర్లకు ఈ సరసమైన ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు.