Apple iPhone 16 : ఫ్లిప్‌కార్ట్‌లో చౌకైన ధరకే ఆపిల్ ఐఫోన్ 16.. ఏకంగా రూ.22,800 డిస్కౌంట్.. డోంట్ మిస్..!
Apple iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 22,800 డిస్కౌంట్ వరకు ఆఫర్ చేస్తోంది. బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లతో మరింత తగ్గింపు పొందవచ్చు.

Apple iPhone 16
Apple iPhone 16 : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన హై-ఎండ్ ఐఫోన్ 16 మోడల్ ప్రస్తుతం అత్యంత చౌకైన ధరకే అందుబాటులో ఉంది.
మార్కెట్లో ఐఫోన్ 16e కన్నా ఐఫోన్ 16 అతి తక్కువ ధరలో లభిస్తోంది. సరికొత్త ఏఐ ఫీచర్‌లు, కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌తో ఫ్లాగ్‌షిప్ పర్ఫార్మెన్స్ అందిస్తోంది. తక్కువ ధరలో ఐఫోన్ కోసం చూసే కస్టమర్లు ఐఫోన్ 16 మోడల్‌ను కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16 మోడల్‌పై మరిన్ని బ్యాంకు డిస్కౌంట్లు, ఆఫర్ల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 డిస్కౌంట్ :
ఐఫోన్ 16 మోడల్ 128GB స్టోరేజ్ వెర్షన్ అసలు ధర రూ. 79900. అయితే, ఫ్లిప్‌కార్ట్ 6శాతం తగ్గింపును అందిస్తోంది. వినియోగదారులు కేవలం రూ. 74,900కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ డీల్స్ ద్వారా ఐఫోన్ ధరను మరింత తగ్గించుకోవచ్చు. తద్వారా ఐఫోన్ 16 ధరపై అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్ :
ఆపిల్ కస్టమర్లు SBI, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ. 47,940 కనీస కొనుగోలు మొత్తంపై రూ. 4వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదేవిధంగా, ఐసీఐసీఐ, క్రెడిట్ సీబీసీసీ క్రెడిట్ కార్డ్‌పై రూ. 2500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ :
ఆపిల్ కస్టమర్లు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఐఫోన్ 16తో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. రూ. 22,800 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, స్మార్ట్‌ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ ఆధారంగా మాత్రమే ఎక్స్చేంజ్ వాల్యూను పొందవచ్చు. ఉదాహరణకు.. మీ ఐఫోన్ 13 మోడల్ వర్కింగ్ కండిషన్ బాగుంటే.. మొత్తం ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు.
Read Also : iPhone 16e Price : కొత్త ఐఫోన్ 16eపై అద్భుతమైన ఆఫర్.. కేవలం రూ.55వేల లోపు ధరలో.. ఇంకా తగ్గాలంటే ఇలా చేయండి!
ఐఫోన్ 16 ఎందుకు కొనాలంటే? :
ఆపిల్ ఐఫోన్ 16 కొత్త A18 CPU, 8GB ర్యామ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టు ఇస్తుంది. యాప్ అన్ని ఫీచర్లను యాక్సెస్ చేయొచ్చు. విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను ఆన్ చేయొచ్చు. కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌ను కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 కొనేందుకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.