iPhone 16e Price : కొత్త ఐఫోన్ 16eపై అద్భుతమైన ఆఫర్.. కేవలం రూ.55వేల లోపు ధరలో.. ఇంకా తగ్గాలంటే ఇలా చేయండి!
iPhone 16e Price : అతి తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 16e ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఇంకా ధర తగ్గాలంటే బ్యాంకు ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

iPhone 16e
iPhone 16e Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 16e భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ లైనప్‌లో ఇదే బెస్ట్ డీల్. ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కొనుగోలుదారులు రూ. 54,400 కన్నా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
తక్కువ ధరకు ప్రీమియం ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ చేసేవారికి అద్భుతమైన ఆప్షన్. అయితే, ఈ డీల్‌కు ఒక కండిషన్ కూడా ఉంది. ఐఫోన్ 16eపై భారీ తగ్గింపు పొందాలంటే బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లతో కొనుగోలు చేయాలి. ఈ అద్భుతమైన ఆఫర్ ముగియకముందే వెంటనే కొనేసుకోండి.
ఐఫోన్ 16e ప్రాసెసర్ :
ఐఫోన్ 16e ఆపిల్ బయోనిక్ A18 చిప్‌సెట్ ఉంది. 4.04GHz హెక్సా-కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో డెయిలీ టాస్కులు, డిమాండ్ ఉన్న అప్లికేషన్లు వేగంగా రన్ అవుతాయి. స్టోరేజీ విస్తరణ ఆప్షనల్ కాదు. అందుకే సరైన వేరియంట్‌ను ఎంచుకోవడమే చాలా ముఖ్యం.
డిస్‌ప్లే, బ్యాటరీ :
6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ కలర్స్, HDR, ట్రూ టోన్, హాప్టిక్ టచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సిరామిక్ షీల్డ్ గ్లాస్ మరింత ప్రొటెక్షన్ అందిస్తుంది. 2025లో 60Hz రిఫ్రెష్ రేట్ పాతది అయినప్పటికీ HDR కంటెంట్ 1200 నిట్‌లకు మారుతుంది. 4005mAh బ్యాటరీ మరింత పవర్ అందిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W Qi వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు ఇస్తుంది. అతిపెద్ద బ్యాటరీ కానప్పటికీ కూడా ఆపిల్ ఆప్టిమైజేషన్ ద్వారా అంతే పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
ఐఫోన్ 16e కెమెరా :
ఆపిల్ ఐఫోన్ 16e ఫోన్ 48MP ప్రైమరీ కెమెరాతో అద్భుతమైన ఫొటోలను తీయొచ్చు. వీడియో రికార్డింగ్ గరిష్టంగా 4K 60fps వద్ద ఉంటుంది. క్వాలిటీ ఫుటేజ్ కోసం ఆపిల్ ఇదే ఫీచర్లను అప్‌గ్రేడ్
చేస్తోంది. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఫేస్ ఐడీకి సపోర్టు ఇస్తుంది. సెకండరీ రియర్ సెన్సార్ లేనప్పటికీ, ఆపిల్ సాఫ్ట్‌వేర్ ప్రాసెసింగ్ ద్వారా అంతే స్థాయిలో రిజల్ట్స్ అందిస్తుంది.
ఐఫోన్ 16e ధర :
ఐఫోన్ 16e 128GB మోడల్ అసలు ధర రూ. 59,900 నుంచి 3శాతం తగ్గింది. ఆ తర్వాత రూ. 58,400 వద్ద అందుబాటులో ఉంది. ఈఎంఐ ఆప్షన్లలో రూ. 2,831 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు :
ఐఫోన్ 16e కొనుగోలుపై ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.4వేల వరకు తగ్గింపు పొందవచ్చు. క్రెడిట్ కార్డులతో కస్టమర్‌లు ఈఎంఐ వడ్డీపై రూ. 2,631.28 వరకు సేవ్ చేసుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు రూ.1,752 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదనంగా, ఇతర కమర్షియల్ యూజర్లు కొనుగోళ్లపై 28శాతం వరకు ఆదా కోసం జీఎస్టీ ఇన్‌వాయిస్‌లను క్లెయిమ్ చేయవచ్చు.
ఐఫోన్ 16e కొనాలా వద్దా? :
ఆపిల్ ఐఫోన్ 16e ఫ్లాగ్‌షిప్ మోడల్స్ కన్నా తక్కువ ధరకే అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మీరు కాంపాక్ట్ అయినప్పటికీ పవర్‌ఫుల్ ఫోన్ కావాలనుకుంటే.. ఇదే బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. అయితే, హై-రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లే బిగ్ స్టోరేజ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి.