iPhone 15 Price Cut : అబ్బబ్బా భలే ఆఫర్.. చౌకైన ధరకే ఆపిల్ ఐఫోన్ 15.. ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా చాలా చీప్ గురూ..!
iPhone 15 Price Cut : ఆపిల్ ఐఫోన్ 15 భారీ డిస్కౌంటుతో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా చాలా తక్కువ ధరకు ఐఫోన్ 15 కొనుగోలు చేయొచ్చు. పూర్తి వివరాల కోసం ఓసారి లుక్కేయండి.

iPhone 15 Price Cut
iPhone 15 Price Cut : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అత్యంత సరసమైన ధరకే ఐఫోన్ 15 కొనేసుకోవచ్చు. ఆపిల్ ఐఫోన్ 15 డిజైన్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, హై లెవల్ కెమెరా సామర్థ్యాలను కలిగి ఉంది. లేటెస్ట్ iOS ఫీచర్లు, ప్రీమియం ఫోన్ కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఐఫోన్ 15 తగ్గడంతో మరింత ఆకర్షణీయంగా మారింది. 2025లో ఐఫోన్ 15 ధరను ఇంకా తగ్గించుకోవచ్చు. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
Read Also : Affordable SUV Cars : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.10లక్షల లోపు SUV కార్లు.. టాప్ 5 మోడల్స్ ఇవే..!
ఆపిల్ ఐఫోన్ 15 ప్రాసెసర్ :
ఆపిల్ ఐఫోన్ 15 పవర్‌ఫుల్ A16 బయోనిక్ చిప్‌సెట్. 3.46GHz వద్ద హెక్సా-కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. కెపాసిటీ, స్పీడ్‌తో ఈ ప్రాసెసర్ స్మూత్ మల్టీ టాస్కింగ్, గేమింగ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 6GB ర్యామ్, iOS ఆప్టిమైజేషన్‌లతో యాప్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అయితే, లిమిటెడ్ ర్యామ్, స్టోరేజీ ఆప్షన్లు కూడా లోపంగా చెప్పవచ్చు.
ఐఫోన్ 15 డిస్‌ప్లే, బ్యాటరీ :
6.1-అంగుళాల సూపర్ రెటినా XDR ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐఫోన్ 15 మోడల్ 1179×2556 పిక్సెల్ రిజల్యూషన్, 460ppiతో అద్భుతమైన విజువల్స్‌ను అందిస్తుంది. హెచ్‌డీఆర్ సపోర్ట్, డాల్బీ విజన్, ట్రూ టోన్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. అయితే, స్ర్కీన్ బ్రైట్‌నెస్ బయట 2000 నిట్స్ వరకు చేరుకుంటుంది.
అయితే, పోటీదారులు 120Hz లేదా అంతకంటే ఎక్కువ అందించవచ్చు. 60Hz రిఫ్రెష్ రేట్ అనేది పాతదిగా అనిపించవచ్చు. బ్యాటరీ లైఫ్ 3349mAh యూనిట్‌పై ఆధారపడి ఉంటుంది. రోజువారీ పనులకు మంచిదే. అద్భుతమైనది మాత్రం కాదని చెప్పాలి. ఫాస్ట్ ఛార్జింగ్, 15W మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ స్మాల్ బ్యాటరీని కలిగి ఉంది.
ఐఫోన్ 15 కెమెరా ఫీచర్లు :
డ్యూయల్-కెమెరా సెటప్‌లో 48MP మెయిన్ సెన్సార్, 12MP సెకండరీ లెన్స్ ఉన్నాయి. అద్భుతమైన కలర్ క్వాలిటీతో అద్భుతమైన షాట్‌లను క్యాప్చర్ చేయొచ్చు. వీడియో రికార్డింగ్ స్మూత్‌గా ఉంటుంది. 60fps వద్ద 1080pకి సపోర్టు ఇస్తుంది. 12MP ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు షార్ప్‌గా వస్తాయి. ఐఫోన్ ఇమేజ్ ప్రాసెసింగ్, టెలిఫోటో లెన్స్ లేకపోవడం అనేది జూమింగ్ కెపాసిటీ కోసం చూస్తున్న కొనుగోలుదారులకు నిరాశనే చెప్పాలి.
ఆపిల్ ఐఫోన్ 15 ధర :
ఆపిల్ ఐఫోన్ 15 అసలు ధర రూ. 79,900గా ఉంది. ఐఫోన్ 15 ఇప్పుడు అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 ధర 23 శాతం తగ్గింపుతో రూ. 61,900కి లభ్యమవుతుంది. కొనుగోలుదారులకు ఇది ఆకర్షణీయమైన డీల్ అని చెప్పవచ్చు. ప్రతి నెలా రూ. 3,001 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
బ్యాంక్ ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లు :
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ. 2,787.26 వరకు ఈఎంఐ వడ్డీ సేవ్ చేయొచ్చు. బిజినెస్ కస్టమర్లు జీఎస్టీ ఇన్‌వాయిస్‌లతో 28శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లతో, తక్కువ ధరకు ప్రీమియం ఫీచర్ల కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ఐఫోన్ 15 అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది.
ఐఫోన్ కొనాలా వద్దా? :
ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లతో ఐఫోన్ 15 కొనేందుకు ఇదే సరైన సమయం. హై రిఫ్రెష్ రేట్, పెద్ద బ్యాటరీ లేకపోయినా కెమెరా క్వాలిటీ పరంగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మీరు ఐఫోన్ కొనాలనుకుంటే.. నెక్స్ట్ జనరేషన్ మోడల్ కోసం వేచి చూడాల్సిందే. అడ్వాన్స్ ఫీచర్లు అందులో రావచ్చు. కానీ, ఈ ధర కన్నా చాలా ఎక్కువ ఉంటుందని గమనించాలి.