Tech Tips in Telugu : వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కడానికి అసలు కారణాలివే.. ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. బ్యాటరీ సేవింగ్ స్మార్ట్ టిప్స్..!
Tech Tips in Telugu : మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పదేపదే వేడుక్కుతుందా? వేసవి కాలంలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంటుంది. బ్యాటరీ వేడెక్కకుండా ఈ పవర్‌ఫుల్ టిప్స్ ఓసారి ప్రయత్నించండి..

Tech Tips in Telugu
Tech Tips in Telugu : అసలే సమ్మర్ సీజన్.. ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల ప్రభావం స్మార్ట్‌ఫోన్లపై కూడా పడుతుందని మీకు తెలుసా? ముఖ్యంగా మీ ఫోన్ బ్యాటరీపై తీవ్ర ప్రభావం ఉంటుంది. వేసవి కాలంలో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలు వేడెక్కడం కామన్.
సాధారణంగా మీ ఫోన్ కొద్దిసేపు వాడిన వెంటనే ఒక్కసారిగా వేడక్కుతుంటాయి. దీనికి ప్రధాన కారణం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటమే. దీనికి తోడు మీరు అదేపనిగా స్మార్ట్‌ఫోన్ వాడేస్తుంటే.. బ్యాటరీ వేగంగా వేడుక్కుతుంది.
అందులో మీ ఫోన్ రన్ అయ్యే కొన్ని అప్లికేషన్లు కూడా బ్యాటరీ వేడెక్కడానికి కారణమవుతాయని గమనించాలి. ఇది ఇలానే కొనసాగితే మీ ఫోన్ బ్యాటరీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. చాలామంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి పరిస్థితిలో మీ ఫోన్ బ్యాటరీని ఎలా సేవ్ చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
బ్లూటూత్, Wi-Fi ఆఫ్ చేయండి :
మీరు మీ ఫోన్‌లో బ్లూటూత్ లేదా Wi-Fi వాడకపోతే.. వెంటనే ఆఫ్ చేయాలి. మీరు ఆపిల్ యూజర్ అయితే, మీరు ఎయిర్‌డ్రాప్‌ను ఆఫ్‌లో ఉంచుకోండి.
స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించండి :
బ్యాటరీని సేవ్ చేసేందుకు ఒకటే ఈజీ వే.. మీ ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించడమే. స్ర్కీన్ బ్రైట్‌నెస్ ఎక్కువగా ఉంటే.. ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తుంది. ఫలితంగా, మీ ఫోన్ బ్యాటరీ వేడెక్కే అవకాశం ఉంది.
ఒరిజినల్ ఛార్జర్‌ని వాడండి :
మీరు ఫేక్ ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తే.. బ్యాటరీ త్వరగా వేడెక్కి అతిపెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో, మీరు ఫోన్‌ను ఛార్జ్ చేసేందుకు ఎల్లప్పుడూ కంపెనీ ఛార్జర్‌ను మాత్రమే ఉపయోగించాలి.
Read Also : Affordable SUV Cars : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.10లక్షల లోపు SUV కార్లు.. టాప్ 5 మోడల్స్ ఇవే..!
ఛార్జింగ్ ఇలా పెట్టండి :
మీ ఫోన్ బ్యాటరీని సేవ్ చేసుకోవాలంటే.. మీ ఫోన్‌ను 80 శాతం వరకు మాత్రమే ఛార్జ్ చేయాలి. పొరపాటున కూడా 100 శాతం వరకు ఛార్జ్ చేయరాదు. మీ ఫోన్ లొకేషన్ ఆన్‌లో ఉంటే.. వెంటనే అది ఆఫ్ చేయండి. ఎందుకంటే.. అది కూడా మీ బ్యాటరీ ఛార్జింగ్ వినియోగిస్తుంది.