IND W vs AUS W : ప్రతీకా రావల్, హర్మన్ ప్రీత్ కౌర్ అర్థశతకాలు.. ఆసీస్ లక్ష్యం 252
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య (IND W vs AUS W ) హోబర్ట్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది
IND W vs AUS W 2nd ODI Australia Women Target is 252
- భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండో వన్డే
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- ఆస్ట్రేలియా లక్ష్యం 252 పరుగులు
IND W vs AUS W : మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య హోబర్ట్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ముందు 252 పరుగుల లక్ష్యం నిలిచింది.
Innings Break!
Vital half-centuries from Pratika Rawal and skipper Harmanpreet Kaur take #TeamIndia to 2️⃣5️⃣1️⃣
Over to the bowlers now 👊
Scorecard ▶️ https://t.co/2h7AVOuGrA#AUSvIND pic.twitter.com/RVkZyU1p8S
— BCCI Women (@BCCIWomen) February 27, 2026
భారత బ్యాటర్లలో ప్రతీకా రావల్ (52; 81 బంతుల్లో 6 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (54; 70 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేశారు. స్మృతి మంధాన (31 ;37 బంతుల్లో 4 ఫోర్లు) రాణించగా, రిచా ఘోష్ (22), కాశ్వీ గౌతమ్ (25)లు పర్వాలేదనిపించారు. జెమీమా రోడ్రిగ్స్ (11), దీప్తి శర్మ (1)లు విఫలం అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అలానా కింగ్ లు తలా రెండు వికెట్లు తీశారు. మేగాన్ షుట్, నికోలా కారీ చెరో వికెట్ పడగొట్టారు.
