కడిగిన ముత్యంలా బయటికొచ్చా.. క్లీన్ చిట్ రాగానే కవిత ఫస్ట్ ఫోన్ కాల్..
Kavitha : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై కవిత స్పందించారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పా.. నేను చెప్పిందే జరిగిందని అన్నారు.
Kavitha
- ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు తీర్పుపై స్పందించిన కవిత
- ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు
- న్యాయ వ్యవస్థపై మేం పెట్టుకున్న నమ్మకం గెలిచింది
- క్లీన్చిట్ రాగానే మా అమ్మతో ఫోన్లో మాట్లాడా..
Kavitha : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాతోపాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవితలకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కేజ్రీవాల్, కవితతో పాటు మొత్తం 23మందికి కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. అయితే, తాజా కోర్టు తీర్పుపై కవిత మీడియాతో మాట్లాడారు.
నేను పదేపదే చెప్పిందే ఇప్పుడు నిజమైంది. లిక్కర్ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పాను.. అలాగే వచ్చాను. న్యాయ వ్యవస్థపై మేం పెట్టుకున్న నమ్మకం గెలిచిందని కవిత అన్నారు. ఈ కేసు రాజకీయ కక్షలో భాగమే. కేసులో క్లీన్చిట్ రావడం సంతోషంగా ఉంది. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పాను. అదే నిజమైంది. దీంతో నేను, నా కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించామని కవిత అన్నారు. కష్ట సమయంలో నాకు అండగా నిలిచిన వారందిరికీ ధన్యవాదాలు.. మరింత ఉత్సాహంతో ప్రజలకోసం పనిచేస్తానని కవిత పేర్కొన్నారు.
క్లీన్చిట్ రాగానే మా అమ్మతో ఫోన్లో మాట్లాడా..
కోర్టు తీర్పు తరువాత కవిత మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. రాజకీయ కుట్రతోనే ఈ కేసు పెట్టారని నిరూపితమైంది. దాదాపు ఐదు నెలలకుపైగా జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారు. నిజం నిరూపితమైంది. నాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు. అండగా నిలిచిన వారిని జీవితాంతం మర్చిపోను. నా తల్లిదండ్రులు, అత్త మామలు అండగా నిలిచారు. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసేందుకే ఈ కేసు పెట్టారు. ఈ కేసులో క్లీన్చిట్ రాగానే మా అమ్మతో ఫోన్లో మాట్లాడాను. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పాను. ఈ కేసు వల్ల నేను, నా కుటుంబం ఐదున్నర నెలలపాటు క్షోభ అనుభవించాము అని కవిత అన్నారు. కష్ట సమయంలో నాకు అండగా ఉన్న అందరికీ ధన్యవాదాలు. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తాను. కోర్టు తీర్పు రాకుండానే కొందరు నాపైన అనుచితంగా మాట్లాడారు. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని గతంలోనే చెప్పాను. అదేవిధంగా ఈరోజు బయటకు వచ్చాను. తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి ఈ కేసులో నా పాత్ర లేదని చెప్పాను. న్యాయవ్యవస్థపైన నేను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని కవిత అన్నారు.
