Andhrapradesh : ఏపీలో దారుణం.. పెళ్లైన కొన్ని గంటల్లోనే వరుడి దారుణ హత్య..
Andhrapradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలంలో పరువు హత్య జరిగింది. సోదరిని ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తిని ఆమె సోదరులు హతమార్చారు.
Andhrapradesh
Andhrapradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలంలో పరువు హత్య జరిగింది. సోదరిని ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తిని ఆమె సోదరులు హతమార్చారు. శుక్రవారం రాత్రి ద్వారపూడి శివారు వేములపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన అనంతరం స్థానికులు నిందితులకు దేహశుద్ది చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలికి చేరుకొని నిందితులు చంద్రపాల్, గిరిబాబులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకున్న కోపంతో యువతి కుటుంబ సభ్యులు హత్యకు పాల్పడ్డారు.
Also Read: మార్చి 3న ఖగోళంలో వింత.. ‘రక్త చంద్రుడి’ దర్శనం.. ఇది దైవ సందేశమేనా.. సృష్టి అంతానికి సంకేతమా?
ములపల్లికి చెందిన పీవీవీ సూర్యప్రకాశరావు (41) స్థానికంగా వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మేడపాడు గ్రామానికి చెందిన అయినవిల్లి సంధ్య రాయవరంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ క్లాస్మేట్స్. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వేరువేరు కులాలు కావడంతో సూర్యప్రకాశరావుతో వివాహంకు సంధ్య ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. కొంతకాలంగా ఈ వివాదం నడుస్తోంది.
గురువారం ఉదయం అన్నవరంలో సంధ్య, సూర్యప్రకాశరావు పెండ్లి చేసుకున్నారు. ఆ తరువాత సూర్యప్రకాశరావు ఇంటికి వెళ్లారు. ఈ విషయం సంధ్య సోదరులు చంద్రపాల్, గిరిబాబుకు తెలియడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గురువారం అర్థరాత్రి సమయంలో సూర్యప్రకాశ్ ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో సూర్యప్రకాశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడి నుంచి నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికిచేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
