Affordable SUV Cars : కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.10లక్షల లోపు SUV కార్లు.. టాప్ 5 మోడల్స్ ఇవే..!
Affordable SUV Cars : టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, స్కోడా కైలాక్, కియా సైరోస్ మోడల్ కార్లు రూ. 10 లక్షల లోపు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు మీకోసం..

Affordable SUV Car
Affordable SUV Cars : కొత్త కారు కొంటున్నారా? ఏ కారు కొంటే బెటర్ అని ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో అద్భుతమైన కార్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రత్యేకించి SUV సెగ్మెంట్‌లో ప్రస్తుతం దాదాపు 55శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. మాస్, ప్రీమియం ప్రాంతాల్లో అన్ని సైజుల SUV కార్లను కొనుగోలుదారులు ఎంచుకుంటున్నారు. అయితే, ప్రధానంగా రూ. 10 లక్షల లోపు (ఎక్స్-షోరూమ్) మోడళ్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది.
భారతీయ మార్కెట్లో ఏదైనా కొత్త మోడల్ కారును వినియోగదారుల స్థోమత ఆధారంగా కొనుగోలు చేస్తుంటారు. అంటే.. డబ్బుకు ఎక్కువ విలువ ఇస్తారు. అందుకే ధరకు తగ్గట్టుగానే ధరకు తగ్గ ప్యాకేజీలుగా ఉన్న టాప్ 5 SUV మోడళ్లను ఓసారి పరిశీలిద్దాం.. మీరు ఈ కార్లను రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు కొనుగోలు చేయవచ్చు.
టాటా పంచ్ :
ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE), ఎలక్ట్రిక్ వెహికల్ (EV) అవతార్‌లలో టాటా పంచ్ రేంజ్ ధర రూ. 6.20 లక్షల నుంచి రూ. 14.44 లక్షల మధ్య ఉంటుంది. ఈ ఎంట్రీ-లెవల్ SUV సీఎన్‌జీ ఆప్షన్‌తో కూడా వస్తుంది. భారత మార్కెట్లో NCAP, గ్లోబల్ NCAP వద్ద 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. కాంపాక్ట్ సైజు, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, సరసమైన ధర ట్యాగ్‌తో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.

Affordable SUV Cars : Tata Punch
హ్యుందాయ్ ఎక్స్టర్ :
హ్యుందాయ్ ఎంట్రీ లెవల్ SUV ఎక్స్‌టర్ అత్యంత సరసమైనది. అనేక ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. మీరు పెట్రోల్ MT, పెట్రోల్ AMT, CNG MT పవర్‌ట్రెయిన్‌ల మధ్య కారును ఎంచుకోవచ్చు. అన్నీ వేరియంట్లు కేవలం రూ. 6.21 లక్షల నుంచి రూ. 10.51 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల రేంజ్ ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి మొత్తం రేంజ్‌లో స్టాండర్డ్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.

Hyundai Exter
మారుతి సుజుకి ఫ్రాంక్స్ :
ఫిబ్రవరి 2025లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కారు మారుతి సుజుకి ఫ్రాంక్స్. 2023లో ఎంట్రీ నుంచి గట్టి పోటీనిస్తోంది. అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఈ కారు ధర రూ. 7.52 లక్షల నుంచి రూ. 13.04 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది.

Maruti Suzuki Fronx
మల్టీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు, ఆకర్షణీయమైన ఫీచర్లు, వైడ్ క్యాబిన్, మారుతి బ్రాండ్ వాల్యూను అందిస్తుంది. మీరు టర్బో పెట్రోల్ వేరియంట్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదని భావిస్తే.. మీరు అద్భుతమైన ఫీచర్లతో రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు పెట్రోల్ మోడల్‌ను కొనుగోలు చేయొచ్చు.
స్కోడా కైలాక్ :
కొత్తగా ఎంట్రీ ఇచ్చిన స్కోడా కైలాక్ కారు ధర రూ.7.89 లక్షల నుంచి రూ.14.40 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. 1.0-లీటర్ (TSI) పెట్రోల్ అనే సింగిల్ ఇంజిన్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఇది ఎంట్రీ-లెవల్ వేరియంట్ నుంచి పొందవచ్చు.

Skoda Kylaq
ఎల్ఈడీ డీఆర్ఎల్‌లతో LED హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌ల్యాంప్‌లు, డ్రైవర్ సీటు కోసం మాన్యువల్ హైట్ అడ్జెస్ట్, అన్ని సీట్లకు అడ్జెస్ట్ హెడ్‌రెస్ట్‌లు, ఎల్ఈడీ రీడింగ్ లాంప్, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసేలా ఔట్ గ్లాసెస్, టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, 6 ఎయిర్‌బ్యాగులు, ESC వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ SUV కారు భారత మార్కెట్లో NCAP వద్ద 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.
కియా సైరోస్ :
సోనెట్ తర్వాత సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV విభాగంలో కియా సైరోస్ ఒకటి. ఈ కారు ధర రూ. 9 లక్షల నుంచి రూ. 17.80 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కియా సైరోస్ బేస్ వేరియంట్ మాదిరిగా ఫీచర్ లోడ్ అయింది. 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కూడా కలిగి ఉంది.

Kia Syros
బేస్ వేరియంట్‌లో 4.2-అంగుళాల కలర్ (TFT MID), 12.3-అంగుళాల HD టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డైనమిక్ గైడ్‌లైన్స్‌తో రియర్‌వ్యూ కెమెరా, టిల్ట్ స్టీరింగ్, ఆర్మ్‌రెస్ట్, కప్ హోల్డర్‌లతో సెంటర్ కన్సోల్, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసేలా ఔట్ సైడ్ గ్లాస్, 6 ఎయిర్‌బ్యాగులు, ESC వంటి ఫీచర్లు ఉన్నాయి.