MG Comet EV 2025 : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రేంజే వేరబ్బా.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్తుంది..!

MG Comet EV 2025 : కొత్త ఎలక్ట్రిక్ కారు కావాలా? అత్యాధునిక ఫీచర్లతో ఎంజీ కామెట్ ఈవీ కారు భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. సింగిల్ ఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 230 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

MG Comet EV 2025 : కొంటే ఇలాంటి కారు కొనాలి.. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు రేంజే వేరబ్బా.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్తుంది..!

MG Comet EV 2025

Updated On : March 21, 2025 / 2:22 PM IST

MG Comet EV 2025 : కొత్త కారు కొంటున్నారా? భారత మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. జేఎస్‌డబ్ల్యూ (JSW) ఎంజీ మోటార్ ఇండియా ఎంజీ కామెట్ EV 2025 కారును లాంచ్ చేసింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ ఎలక్ట్రిక్ కారును రూ. 7 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు సొంతం చేసుకోవచ్చు. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్ కేవలం రూ. 4.99 లక్షలు + రూ. 2.5/కిమీ ధరకే పొందవచ్చు. అప్‌డేట్ ఫీచర్లతో కూడిన బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ రూ. 11వేలకు బుక్ చేసుకోవచ్చు.

Read Also : Poco F7 Series : కొత్త పోకో F7 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్.. ఈ నెల 27నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చంటే..

ఎంజీ కామెట్ EV 2025 కారు మోత్తం 5 విభిన్న వేరియంట్లలో వస్తుంది. అందులో ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్సైట్ FC, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ FC ఉన్నాయి. ఎక్సైట్, ఎక్సైట్ FC వేరియంట్లలో ఇప్పుడు బ్యాక్ పార్కింగ్ కెమెరా, పవర్-ఫోల్డింగ్ (ORVM) ఉన్నాయి.

ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ FC వేరియంట్లలో లెథరెట్ సీట్లు, 4-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో అప్‌గ్రేడ్ అయ్యాయి. ఎంజీ కామెట్ EV FC (ఫాస్ట్ ఛార్జ్) వేరియంట్‌లు 17.4kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 230కిలోమీటర్ల వరకు దూసుకెళ్తాయి. వేరియంట్ వారీగా ఎంజీ కామెట్ EV 2025 ధరలు (ఎక్స్-షోరూమ్) ఇలా ఉన్నాయి.

  • ఎగ్జిక్యూటివ్ : రూ. 7 లక్షలు
  • ఎక్సైట్ : రూ. 8.20 లక్షలు
  • ఎక్సైట్ FC : రూ. 8.73 లక్షలు
  • ఎక్స్‌క్లూజివ్ : రూ. 9.26 లక్షలు
  • ఎక్స్‌క్లూజివ్ FC : రూ. 9.68 లక్షలు
  • ఎక్స్‌క్లూజివ్ FC 100-ఇయర్ ఎడిషన్ : రూ. 9.84 లక్షలు

ఫిబ్రవరి 2025లో JSW ఎంజీ కామెట్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కామెట్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ (BaaS)తో రూ. 7.80 లక్షల (రూ. 2.5/కి.మీ) ధరతో అందుబాటులో ఉంది. ఈ ఎంజీ కామెంట్ ‘స్టారీ బ్లాక్’ ఎక్స్‌ట్రనల్ పార్ట్ డార్క్ క్రోమ్, బ్లాక్ బ్యాడ్జ్‌, రెడ్ కలర్ యాక్సెంట్లతో ఉంటుంది.

లోపల సైడ్ ‘బ్లాక్‌స్టార్మ్’ ఎంబ్రాయిడరీతో లెథరెట్ సీట్లు, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 4-స్పీకర్ ఆడియో సిస్టమ్‌ను కలిగి ఉంది.

Read Also : వార్నీ.. భలే ఉందిగా ఫోన్.. భారీ బ్యాటరీతో కొత్త ఐక్యూ 5G ఫోన్ వస్తోంది.. కీలక ఫీచర్లు లీక్.. ధర..

అదేవిధంగా, కామెట్ కారు రిపేర్లు, సర్వీసు ఛార్జులు ఎంజీ e-షీల్డ్ కింద కవర్ అవుతాయి. 3-3-3-8 సర్వీస్ ప్యాకేజీ 3 ఏళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ, 3 ఏళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA), 3 ఫ్రీ లేబర్ సర్వీసులు (మొదటి 3షెడ్యూల్డ్ సర్వీసులు ), 8 ఏళ్లు లేదా 1,20,000 కి.మీ వారంటీని అందిస్తుంది.