Poco F7 Series : కొత్త పోకో F7 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్.. ఈ నెల 27నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చంటే..

Poco F7 Series : మార్చి 27న పోకో F7 సిరీస్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కానుంది. ముందుగానే ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

Poco F7 Series : కొత్త పోకో F7 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్.. ఈ నెల 27నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చంటే..

Poco F7 Series

Updated On : March 21, 2025 / 1:54 PM IST

Poco F7 Series Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం పోకో నుంచి నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు వచ్చేస్తున్నాయి. పోకో F7 ప్రో, పోకో F7 అల్ట్రా మార్చి 27న సింగపూర్‌లో ఈవెంట్లో లాంచ్ కానున్నాయి. గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ చేయనున్నట్టు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

పోకో F-సిరీస్ లైనప్‌లో కొత్తగా చేరిన F7 అల్ట్రా ఫస్ట్ షోకేజ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ రెండు పోకో F7 ఫోన్లు గత ఏడాది చైనాలో లాంచ్ అయిన రెడ్‌మి K80 సిరీస్ గ్లోబల్ వేరియంట్లు కావచ్చని పుకార్లు సూచిస్తున్నాయి. అధికారిక ప్రకటనకు ముందే ఈ పోకో F7 సిరీస్ స్పెసిఫికేషన్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.

Read Also : Vivo T3 5G Sale : వావ్.. ఆఫర్ అదిరింది.. అతి తక్కువ ధరకే వివో T3 5G ఫోన్.. రూ.22,999 ఫోన్ జస్ట్..

పోకో F7 ప్రో, F7 అల్ట్రా : స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా) :
పోకో F7 ప్రో, పోకో F7 అల్ట్రా రెండూ 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 x 1,440 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ఈ స్క్రీన్‌లు 526PPI పిక్సెల్ సాంద్రతను అందిస్తాయి. ఈ డిజైన్‌లో సెల్ఫీ కెమెరాకు సెంటర్-అలైన్డ్ హోల్-పంచ్ కటౌట్, క్వాడ్-కర్వ్డ్ ఎడ్జ్, ఆకర్షణీయమైన మోడ్రాన్ లుక్ కోసం నారో బెజెల్స్ ఉన్నాయని చెబుతున్నారు. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ రైట్ ఎడ్జ్ ఉంటాయి.

బాటమ్ ఎడ్జ్‌లో USB టైప్-C పోర్ట్, స్పీకర్ గ్రిల్, సిమ్ ట్రే, మైక్రోఫోన్ ఉంటాయి. బ్యాక్ సైడ్ రెండు ఫోన్లలో లెఫ్ట్ సైడ్ సర్కిల్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటాయి. రియర్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్‌ను కలిగి ఉంటాయి. పోకో F7 ప్రో ఫోన్ బ్లాక్, సిల్వర్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుందని పుకార్లు ఉన్నాయి. అయితే, పోకో F7 అల్ట్రా ఫోన్ బ్లాక్, ఎల్లో కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండవచ్చు.

పోకో F7 ప్రో మోడల్ గత వెర్షన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 కన్నా అప్ గ్రేడ్ వెర్షన్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. 12జీబీ ర్యామ్, రెండు స్టోరేజీ (256GB, 512GB) ఆప్షన్లలో వస్తుంది.

మరోవైపు, పోకో F7 అల్ట్రా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుందని పుకార్లు వస్తున్నాయి. గేమింగ్, మల్టీ టాస్కింగ్‌ కోసం 16GB ర్యామ్, 512GB స్టోరేజీతో రానున్నాయి. టాప్ రేంజ్ పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లకు బెస్ట్ ఫోన్లుగా చెప్పవచ్చు

పోకో F7 ప్రో డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP సెకండరీ లెన్స్ ఉండవచ్చు. సెల్ఫీల విషయానికి వస్తే.. 20MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. అయితే, పోకో F7 అల్ట్రా అడ్వాన్స్‌డ్ ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో 50MP ప్రైమరీ సెన్సార్, OISతో 50MP టెలిఫోటో లెన్స్, 32MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి.

సెల్ఫీల విషయానికి వస్తే.. :
32MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉండవచ్చు. పోకో F7 ప్రోలో 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉంటుందని భావిస్తున్నారు. అంతకంటే ముందు వెర్షన్ 5,000mAh బ్యాటరీ సామర్థ్యం ఫాస్ట్ ఛార్జింగ్‌ను 120వాట్ల నుంచి తగ్గించింది.

మరోవైపు, పోకో F7 అల్ట్రా 120 వాట్ల వైర్డు, 50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,300mAh బ్యాటరీతో రానుంది. మల్టీఫేస్ ఛార్జింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15-ఆధారిత HyperOS2పై రన్ అవుతాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తాయని భావిస్తున్నారు.

పోకో F7 ప్రో, F7 అల్ట్రా ధర ఎంతంటే? :
లీక్‌ల ప్రకారం.. పోకో F7 ప్రో ధర యూరో 599 (సుమారు రూ. 57వేలు) నుంచి ప్రారంభం కానుంది. పోకో F7 అల్ట్రా ధర యూరో 749 (సుమారు రూ. 71వేల) వరకు ఉండవచ్చు. పోకో F6 ప్రో ధర యూరో 499 (సుమారు రూ. 47వేలు) వద్ద లాంచ్ అయింది. కానీ, భారత మార్కెట్లో లాంచ్ కాలేదు.

Read Also : Reliance Jio Offers : జియో యూజర్లకు పండగే.. 5 అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే..

పోకో F6 అనేది F-సిరీస్ నుంచి భారత మార్కెట్లోకి వచ్చిన ఏకైక మోడల్. ఈ పోకో F6 ఫోన్ ధర రూ. 29,999కు అందుబాటులో ఉంది. పోకో ఇండియా అధిపతి హిమాన్షు టాండన్ ప్రకారం.. రాబోయే పోకో F7 సిరీస్ మోడల్‌లలో కనీసం ఒకటి త్వరలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.