Vivo T3 5G Sale : వావ్.. ఆఫర్ అదిరింది.. అతి తక్కువ ధరకే వివో T3 5G ఫోన్.. రూ.22,999 ఫోన్ జస్ట్..
Vivo T3 5G Sale : అత్యంత సరసమైన ధరకే వివో T3 5G ఫోన్ అందుబాటులో ఉంది. బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లతో ఈ ఫోన్ పై అద్భుతమైన డీల్స్ పొందవచ్చు. ఇంకా తక్కువ ధరకు ఎలా పొందాలో చూద్దాం..

Vivo T3 5G Sale
Vivo T3 5G Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అతి తక్కువ ధరకే వివో T3 5G ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అడ్వాన్స్ ప్రాసెసర్, అద్భుతమైన డిస్‌ప్లే, హై-రిజల్యూషన్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎక్కువ ఖర్చు పెట్టకుండా హై-ఎండ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మీరు బడ్జెట్-ఫ్రెండ్లీ ధరలో ప్రీమియం స్పెసిఫికేషన్లు కలిగిన వివో T3 5G ఫోన్ కొనేసుకోండి.
Read Also : Lado Lakshmi Yojana : మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతినెలా రూ. 2,100 మీ ఖాతాలోకి.. ఈ పథకం ఎలా పొందాలంటే?
వివో T3 5G డిస్‌ప్లే :
వివో T3 5G ఫోన్ 6.67-అంగుళాల Full HD+ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. అద్భుతమైన కలర్లు, డీప్ కాంట్రాస్ట్‌ను అందిస్తుంది. 2400 x 1080 పిక్సెల్ డిస్‌ప్లే క్వాలిటీని అందిస్తుంది. వీడియో చూడటం, గేమింగ్, వెబ్ బ్రౌజింగ్‌కు బెస్ట్ మోడల్. 120Hz రిఫ్రెష్ రేట్‌తో, డిస్‌ప్లే స్క్రోలింగ్ ఆకర్షణీయమైన వ్యూను అందిస్తుంది.
వివో T3 5G ప్రాసెసర్ :
వివో T3 5G ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7200 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. తక్కువ విద్యుత్ వినియోగంతో హై పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 2.8 GHz వరకు స్పీడ్ ఆక్టా-కోర్ చిప్‌సెట్, మల్టీ టాస్కింగ్, గేమింగ్‌ను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 5G కనెక్టివిటీని కూడా కలిగి ఉంది. వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు సపోర్టు చేస్తుంది.
వివో T3 5G కెమెరా :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా ఉన్నాయి. మెయిన్ లెన్స్‌తో పాటు OIS(ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఉంటుంది. డార్క్ లైటింగ్‌లో కూడా స్పష్టమైన ఫోటోలను తీయొచ్చు. కెమెరాలో నైట్, పోర్ట్రెయిట్, స్లో-మో, ప్రో మోడ్ వంటి అనేక మోడ్‌లు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ రికార్డు చేయొచ్చు.
బ్యాటరీ, ఇతర స్పెసిఫికేషన్లు :
వివో T3 5G ఫోన్ లాంగ్ టైమ్ పర్ఫార్మెన్స్ కోసం 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్‌ను తక్కువ సమయంలో ఛార్జ్ చేసేందుకు 44W వద్ద ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ (FuntouchOS 14) ఆధారితమైన Android 14తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్లకు సపోర్టు ఇస్తుంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీని ప్యాక్ చేస్తుంది. హైబ్రిడ్ స్లాట్ మెమరీని 1TB వరకు విస్తరించవచ్చు.
వేరియంట్, ధరలివే :
వివో T3 5G (8GB ర్యామ్ + 128GB స్టోరేజ్) ధర రూ. 18,499కు సొంతం చేసుకోవచ్చు. గత మోడల్ ధర ₹22,999 కన్నా చాలా తక్కువ. ఈ ఫోన్ క్రిస్టల్ ఫ్లేక్ కలర్ వేరియంట్‌లో వస్తుంది.
వివో T3 5G ఫోన్‌పై ఆఫర్లు :
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు తమ లావాదేవీపై రూ. 165 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. బ్యాంక్ ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 2వేలు డిస్కౌంట్ పొందండి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు ఎలాంటి పరిమితులు లేకుండా 5శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.
ధర మాత్రమే కాదు.. ప్రత్యేక ఆఫర్‌గా రూ. 1,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ వివో ఫోన్ కొనుగోలుపై నెలకు రూ.6,166కు నో-కాస్ట్ ఈఎంఐగా పొందవచ్చు. రెగ్యులర్ ఈఎంఐ ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.