Lado Lakshmi Yojana : మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతినెలా రూ. 2,100 మీ ఖాతాలోకి.. ఈ పథకం ఎలా పొందాలంటే?

Lado Lakshmi Yojana : 2025-26 సంవత్సరానికి లాడో లక్ష్మీ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 సహాయాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది.

Lado Lakshmi Yojana : మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతినెలా రూ. 2,100 మీ ఖాతాలోకి.. ఈ పథకం ఎలా పొందాలంటే?

Lado Lakshmi Yojana Scheme

Updated On : March 21, 2025 / 10:36 AM IST

Lado Lakshmi Yojana : మహిళలకు గుడ్ న్యూస్.. ఇకపై రాష్ట్ర మహిళలకు ప్రతి నెలా రూ.2100 ఆర్థిక సాయం అందనుంది. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ 2025-26 సంవత్సరానికి రూ.2.05 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ సందర్భంగా సైనీ మాట్లాడుతూ.. ‘లాడో లక్ష్మీ యోజన’ కోసం ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించిందని చెప్పారు.

Read Also : LIC Bima Sakhi : గుడ్ న్యూస్.. మహిళల కోసం LIC అద్భుతమైన స్కీమ్.. టెన్త్ పాసైతే చాలు.. పైసా కట్టకుండా నెలకు రూ.7వేలు సంపాదించుకోవచ్చు!

లాడో లక్ష్మీ యోజన పథకం ఏంటి?
2025-26 సంవత్సరానికి లాడో లక్ష్మీ యోజన పథకం కింద రాష్ట్ర మహిళలకు నెలకు రూ.2,100 సహాయం అందించాలని హర్యానా ప్రభుత్వం ప్రతిపాదించింది. 2024 అక్టోబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ మహిళలకు ప్రతి నెలా ఆర్థిక సాయం అందుతుందని వాగ్దానం చేసింది.

బడ్జెట్‌ సందర్భంగా రాష్ట్ర సీఎం మాట్లాడుతూ.. ఈ పథకానికి బడ్జెట్ కేటాయింపులు జరిగాయని, త్వరలోనే తుది రూపం దాల్చుతోందని అన్నారు. ఈ పథకానికి సంబంధించి అన్ని పూర్తి అయిన తర్వాత మంత్రివర్గం ముందు ఉంచుతామని ఆయన అన్నారు. లాడో లక్ష్మి యోజన దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

లాడో లక్ష్మీ యోజన పథకం ప్రయోజనాలివే.. :
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే.. మీరు వెంటనే అంత్యోదయ-సరల్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ పోర్టల్‌లో మీ పేరు, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి వివరాలను సమర్పించాలి.

Read Also : Apple iPhone 16 : అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 16పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకు కావాలంటే?

మహిళలు రూ. 1,80,000 కన్నా తక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉంటే.. దారిద్య్రరేఖకు దిగువన (BPL) ఉంటారు. BPL కార్డు లేని వారు ఈ పథకం ప్రయోజనాలను పొందలేరని గమనించాలి. లాడో లక్ష్మీ యోజన ప్రయోజనాలను పొందాలంటే ముందుగా మహిళలు పరివార్ పెహచన్ పత్ర (PPP)ని సమర్పించాల్సి రావచ్చు. అయితే, కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా సరళ్ సెంటర్ లేదా (PPP) ఆపరేటర్ వద్ద పూర్తి చేయవచ్చు.

  • కుటుంబంలోని అర్హత కలిగిన మహిళ బ్యాంకు అకౌంట్ తమ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి.
  • మహిళల ఖాతాలోకి నేరుగా రూ. 2100 జమ అవుతుంది.
  • మీ ఆధార్‌ను బ్యాంకు అకౌంటుతో లింక్ చేయడం చాలా ముఖ్యం.
  • బ్యాంకు సమీప బ్రాంచ్‌కు వెళ్లి మీ బ్యాంకు అకౌంటుతో ఆధార్ లింక్ చేసుకోవచ్చు.