Apple iPhone 16 : అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 16పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకు కావాలంటే?
Apple iPhone 16 : కొత్త ఐఫోన్ కావాలా? అమెజాన్‌లో ఐఫోన్ 16పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. బ్యాంకు ఆఫర్లతో పాటు మరెన్నో డిస్కౌంట్ బెనిఫిట్స్ ఇలా పొందవచ్చు.

Apple iPhone 16
Apple iPhone 16 Launch : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ ఐఫోన్ 16పై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 16 అధికారికంగా అమెజాన్‌లో చౌకైన ధరకు అందుబాటులో ఉంది. కొన్ని అదనపు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత సరసమైన ధరకు సొంతం చేసుకోవచ్చు. మీరు ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకుంటే.. ప్రస్తుత డీల్స్, డిస్కౌంట్స్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ధర, వేరియంట్ :
ఐఫోన్ 16 (128GB) ప్రారంభ లాంచ్ ధర రూ.79,900కు అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు కస్టమర్లు అమెజాన్‌లో 8శాతం తగ్గింపు తర్వాత కేవలం రూ.73,400కు సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధరకు ఖరీదైన ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌ను పొందాలనుకునే కస్టమర్లకు ఇది అద్భుతమైన అవకాశమని చెప్పవచ్చు.
ఐఫోన్ 16పై డిస్కౌంట్లు :
SBI, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఐఫోన్ 16 కొనుగోలుపై కనీసం రూ.47,940 రూ.4వేలు ఫ్లాట్ ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఐసీఐసీఐ క్రెడిట్ (CBCC) క్రెడిట్ కార్డ్ యూజర్లు అదే కనీస కొనుగోలు మొత్తంతో రూ.2,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ :
కొనుగోలుదారులు పాత ఫోన్‌ను ట్రేడ్ చేయడం ద్వారా ఐఫోన్ 16పై రూ.22,800 వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే, పాత ఫోన్ మోడల్, కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ వాల్యూ మారుతుంది. ఉదాహరణకు.. అద్భుతమైన కండిషన్‌లో ఉన్న ఐఫోన్ 13 హై ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందుతుంది. దాంతో మొత్తం ఐఫోన్ ధర భారీగా తగ్గుతుంది.
ఐఫోన్ 16 ఎందుకు కొనాలి? :
ఆపిల్ ఐఫోన్ 16 మోడల్ 8GB ర్యామ్, A18 చిప్ వంటి ముఖ్యమైన హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్ కలిగి ఉంది. ఏఐ ఆధారిత ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వచ్చింది. ఫ్యూచర్-ప్రూఫ్ ఆపరేషన్‌కు సపోర్టు ఇస్తుంది. అంతేకాకుండా, కొత్త కెమెరా కంట్రోల్ బటన్ అనేక ఫంక్షన్‌లకు స్పీడ్ యాక్సెస్‌ను అందిస్తుంది. తద్వారా ఆపిల్ ప్రియులకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.