Airtel IPL Offer : ఐపీఎల్ ఫ్యాన్స్‌కు పండగే.. ఎయిర్‌టెల్ సూపర్ IPL ఆఫర్లు.. కేవలం రూ. 100కే జియో హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్..!
Airtel IPL Offer : ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం అద్భుతమైన ఐపీఎల్ ప్లాన్లను తీసుకొచ్చింది. కేవలం రూ. 100కే జియోహాట్‌స్టార్ ఉచితంగా సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..

Airtel IPL Offer
Airtel IPL Offers : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేకించి ఐపీఎల్ అభిమానులకు బంపర్ ఆఫర్.. ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఎయిర్‌టెల్ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో సహా రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.
ఈ ప్లాన్‌ల ధర రూ. 100 నుంచి రూ. 195 అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌లను ప్రత్యేకంగా ఐపీఎల్ అభిమానుల కోసం తీసుకొచ్చింది. ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత కూడా ఈ రీఛార్జ్ ఓచర్లు అందుబాటులో ఉంటాయి.
Read Also : Apple iPhone 16 : ఫ్లిప్‌కార్ట్‌లో చౌకైన ధరకే ఆపిల్ ఐఫోన్ 16.. ఏకంగా రూ.22,800 డిస్కౌంట్.. డోంట్ మిస్..!
రూ.100, రూ.195 జియో హాట్‌స్టార్ ప్లాన్‌లు :
ఎయిర్‌టెల్ అందించే కొత్త జియో హాట్‌స్టార్ ప్లాన్లు ధర రూ.100, రూ.195 మధ్య ఉన్నాయి. ఈ రెండూ డేటా వోచర్లు. ప్రీపెయిడ్ ప్లాన్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఈ డేటా వోచర్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. తద్వారా డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.
రూ.100కే ఎయిర్‌టెల్ ఓటీటీ ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.100 జియోహాట్‌స్టార్ డేటా ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మీరు 5GB డేటా బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌లో 30 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.
రూ. 195కే జియో హాట్‌స్టార్ ప్యాకేజీ :
ఎయిర్‌టెల్ అందించే మరో రూ.195 రీఛార్జ్ ప్లాన్.. జియోహాట్‌స్టార్ కోసం స్పీడ్ డేటాను అందిస్తుంది. జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లను 90 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చు. ఈ ప్యాకేజీలో 3 నెలల పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు అనమాట. ఈ రీఛార్జ్ కూపన్ వినియోగదారులకు 15GB డేటాను కూడా అందిస్తుంది. రూ.100 వోచర్‌తో కాకుండా రూ.195 రీఛార్జ్ కూపన్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే మరిన్ని డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.
ఎయిర్‌టెల్ జియోహాట్‌స్టార్ ఫ్రీ ప్లాన్లు ఇవే :
ఎయిర్‌టెల్ జియో హాట్‌స్టార్ బండిల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. వినియోగదారులు తమకు నచ్చిన ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ల ధర వరుసగా రూ.3999, రూ.549, రూ.1029, రూ.398 అందుబాటులో ఉన్నాయి.
జియో రూ.100 ప్లాన్ :
జియో మరో డేటా ప్లాన్ కేవలం రూ.100కే ఆఫర్ చేస్తోంది. ఈ జియో ప్యాకేజీని కొనుగోలు చేసే కస్టమర్లు 5GB డేటా, 90 రోజుల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు. ఈ ప్యాకేజీతో అన్‌లిమిటెడ్ కాల్స్ లేదా SMS పొందలేరు. ఈ ప్యాకేజీతో టీవీ, మొబైల్ డివైజ్‌లో జియోహాట్‌స్టార్‌ను చూడవచ్చు.
జియో రూ.195 ప్లాన్ బెనిఫిట్స్ :
జియో ఎయిర్‌టెల్ మాదిరిగానే రూ.195కి జియో హాట్‌స్టార్ డేటా ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ 90 రోజుల వ్యాలిడిటీతో 15GB డేటాను అందిస్తుంది. ఈ జియో ప్యాకేజీలో 3 నెలల జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. ఈ ప్యాక్‌తో మీ మొబైల్ డివైజ్‌లో మాత్రమే జియో హాట్‌స్టార్‌ను చూడగలరు.