Cashless Facility : ఈ బీమా కంపెనీల్లో హెల్త్ పాలసీ తీసుకున్నారా? సెప్టెంబర్ 1 నుంచి క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ బంద్.. ఎందుకంటే?

Cashless Facility : ఈ 2 ఇన్సూరెన్స్ కంపెనీల్లో సెప్టెంబర్ 1 నుంచి క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ నిలిపివేయనున్నాయి. పాలసీ తీసుకుంటే చెక్ చేసుకోండి.

Cashless Facility : ఈ బీమా కంపెనీల్లో హెల్త్ పాలసీ తీసుకున్నారా? సెప్టెంబర్ 1 నుంచి క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ బంద్.. ఎందుకంటే?

Cashless Facility

Updated On : August 25, 2025 / 8:37 PM IST

Cashless Facility : ప్రస్తుత రోజుల్లో ఆస్పత్రుల్లో వైద్య ఖర్చులను భరించడం చాలా కష్టం. అందుకే చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటారు. తద్వారా ఆస్పత్రి బిల్లలు చెల్లింపులను క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ పొందవచ్చు. అయితే ఇప్పుడు ఈ 2 ఇన్సూరెన్స్ కంపెనీల్లో సెప్టెంబర్ 1 నుంచి క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ నిలిపివేయనున్నాయి. మీరు కూడా ఈ రెండింటిలో పాలసీ తీసుకుంటే ముందుగా చెక్ చేసుకోండి.

15వేలకు పైగా ఆస్పత్రులపై ప్రభావం :
క్యాష్ లెస్ పాలసీపై ఈ బీమా కంపెనీలు, ఆసుపత్రుల మధ్య వివాదం తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా ఆస్పత్రుల్లో సెప్టెంబర్ 1 నుంచి రెండు బీమా కంపెనీల క్యాష్ లెస్ ఫెసిలిటీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కంపెనీలలో బజాజ్ అలియాంజ్, కేర్ హెల్త్ ఉన్నాయి. దీని కారణంగా రోగులు సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఎదురుకానుంది.

ఇదే విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండియా (AHPI) పేర్కొంది. ట్రీట్ మెంట్ ఖర్చు నిరంతరం పెరుగుతున్నా సంబంధిత బీమా కంపెనీలు చికిత్స ఖర్చుల రేట్లు మార్చలేదని చెబుతోంది. అంతేకాదు.. బీమా కంపెనీలు పేమెంట్లు త్వరగా చెల్లించవు. అనవసరమైన డాక్యుమెంట్లు కూడా అడుగుతున్నాయి. పాలసీ సంబంధిత చెల్లింపులలో చాలా సమస్యలు ఉన్నాయి. దీని కారణంగా రోగులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

AHPI పిలుపు మేరకు.. దేశవ్యాప్తంగా దాదాపు 15వేల ఆసుపత్రులు సెప్టెంబర్ 1 నుంచి క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ అందించేందుకు నిరాకరించాయి. మరోవైపు, పేషెంట్స్ క్యాష్ లెస్ బిల్లు చెల్లింపునకు సంబంధించిన సమస్యలను చర్చించేందుకు AHPI కేర్ హెల్త్‌కు నోటీసు కూడా జారీ చేసింది.

Cashless Facility : వివాదానికి అసలు కారణమేంటి? :

బజాజ్ అలియాంజ్ పాత కాంట్రాక్టు రేట్లను పెంచడానికి నిరాకరించిందని ఆస్పత్రులు ఆరోపిస్తున్నాయి. నిబంధనల ప్రకారమే ప్రతి రెండు ఏళ్లకు చికిత్స ఖర్చుల రేట్లు సవరిస్తాయి. కానీ, కంపెనీ దీనికి సిద్ధంగా లేదు. ఇప్పుడు ఎలాంటి కారణం చెప్పకుండానే పేషెంట్ అడ్మిషన్‌పై మెడిషన్స్, టెస్టులు, హాస్పటిల్ రూం ఛార్జీలను తగ్గిస్తోంది.

ఇది మాత్రమే కాదు, పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఫైనల్ బిల్లును ఆమోదించే సమయాన్ని కూడా పెంచారు. దీని కారణంగా రోగులు డిశ్చార్జ్ అయిన తర్వాత ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుంది. అయితే, ఈ ఆరోపణలపై రెండు బీమా కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Read Also : Starlink Launch : గుడ్ న్యూస్.. భారత్‌లో ఆ ప్రాంతాలే లక్ష్యంగా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసులు.. ధర, స్పీడ్ ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్..!

పాలసీదారులపై ప్రభావం పడుతుందా? :
ఇలాంటి పరిస్థితిలో ఈ కంపెనీల నుంచి ఆరోగ్య బీమా తీసుకున్న పాలసీదారులు ఆస్పత్రి బిల్లును వారే చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు బీమా కంపెనీ ద్వారా క్లెయిమ్ చేసుకోవాలి.

కారణం లేకుండానే బిల్లు ఖర్చుల తగ్గింపు :
“రెండు బీమా కంపెనీలు ఎలాంటి కారణం లేకుండా చికిత్స ఖర్చులకు సంబంధించిన బిల్లులను తగ్గిస్తున్నాయి. పేషెంట్ డిశ్చార్జ్ అయిన 6 నుంచి 7 గంటల తర్వాత బిల్లులను అప్రూవ్ చేస్తారు. చర్చల కోసం మా వైపు నుంచి రెండు బీమా కంపెనీలకు ఇమెయిల్ పంపుతున్నాం. ఈ అంశంపై కేర్ హెల్త్ ప్రతినిధులతో బజాజ్ అలియాంజ్ ప్రతినిధులతో సమావేశం జరగనుంది. పరిష్కారం లభించకపోతే వారి క్యాష్ లెస్ సౌకర్యం నిలివేస్తారు” అని AHPI డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిర్ధర్ జ్ఞానిపేర్కొన్నారు.

మొదట చౌకైన పాలసీ.. ఆపై ప్రీమియం పెంపు :
చాలా కంపెనీలు తమ పాలసీలను విక్రయించేందుకు చౌకగా ప్రీమియం ఆప్షన్ అందిస్తాయి. ప్రారంభంలో తక్కువ ప్రీమియంతో పాలసీని అందించి అందులో పరిమిత వ్యాధులకు కవరేజ్ అందిస్తాయి. ఆ తరువాత కస్టమర్‌కు మరుసటి సంవత్సరం తీవ్రమైన వ్యాధులు కూడా కవర్ అవుతాయని ప్రీమియం పెంచుతాయి. అప్పుడు కేవలం ప్రీమియం మాత్రమే రెండు నుంచి 3 వేలు పెరుగుతుంది.

పాలసీదారుడు కూడా ఇందుకు అంగీకరిస్తాడు. ఆ తరువాత రెండో సంవత్సరంలో సగటు పాలసీ ప్రీమియం 10 శాతం పెరుగుతుంది. మొదటి సంవత్సరంలో రూ. 20 వేలకు పాలసీ తీసుకుంటే.. ఆ పాలసీ రాబోయే రెండేళ్లలో 25 వేల నుంచి 27 వేల ప్రీమియంకు చేరుతుంది.