Most Affordable Cars : ఫ్యామిలీ సేఫ్టీకి ఫుల్ గ్యారెంటీ! భారత్‌లో 5 స్టార్ రేటింగ్‌తో టాప్ 5 చీపెస్ట్ కార్లు.. మీ ఫేవరెట్ ఏది?
Most Affordable Cars : ఒకప్పుడు సేఫ్టీ ఫీచర్ల కారు కొనడం అంటే చాలా కాస్ట్ లీ.. కానీ, భారత మార్కెట్లో అదే 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌లతో అత్యంత సరసమైన కార్లు లభిస్తున్నాయి. ఇందులో మీకు ఏ కారు కావాలో ఎంచుకుని కొనేసుకోండి.
- Sreehari A
- Published on- June 27, 2026 / 06:44 PM IST
Most Affordable Cars
- కొత్త కారు కొంటే సేఫ్టీ రేటింగ్ మోడల్స్ కొనాలి
- 5 స్టార్ రేటింగ్ తో లభించే టాప్ 5 SUV కార్లు
- పిల్లలు, పెద్దల సేఫ్టీతో సరసమైన ధరలో లభ్యం
Most Affordable Cars : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో అత్యంత సరసమైన కార్లు లభ్యమవుతున్నాయి. బడ్జెట్ కార్ల విషయంలో ట్రెండ్ మారిపోయింది. అందరూ డిజైన్, స్టయిల్, మైలేజీ కన్నా సేఫ్టీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంతో కారు తయారీదారులు కూడా సరసమైన మోడళ్లలో కూడా సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నాయి.
ప్రస్తుత రోజుల్లో అనేక ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, ఎస్‌యూవీలు, పెద్దలు, పిల్లలందరికి అద్భుతమైన క్రాష్ ప్రొటెక్షన్‌తో సరసమైన ధరకే లభిస్తున్నాయి. భారత మార్కెట్లో మీరు కొనుగోలు చేసే 5 అత్యంత సరసమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్లను మీకోసం అందిస్తున్నాం.. ఇందులో మీకు నచ్చిన కారు ఏదైనా కొనేసుకోవచ్చు.
టాటా పంచ్ :
ఈ టాటా పంచ్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.64 లక్షల నుంచి లభ్యమవుతోంది. BNCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ప్రస్తుతం అత్యంత సరసమైన SUVలలో ఒకటి. గత మోడల్ మాదిరిగా కాకుండా 2026 వెర్షన్‌ను గ్లోబల్ NCAP టెస్టింగ్ చేయలేదు. ఈ కాంపాక్ట్ SUV పెద్దల సేఫ్టీ కోసం (AOP)లో 32 పాయింట్లకు 30.58 పాయింట్లు, పిల్లల ప్రయాణీకుల సేఫ్టీ (COP)లో 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించింది.
సేఫ్టీ పరంగా చూస్తే.. ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ వ్యూ మానిటర్‌తో 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు ఉన్నాయి.
నిస్సాన్ మాగ్నైట్ :
నిస్సాన్ మాగ్నైట్ కారు ఇంకా భారత్ NCAP ఆధ్వర్యంలో క్రాష్ టెస్టింగ్ జరగాలేదు. కానీ, ఈ SUV ఇప్పటికే గ్లోబల్ NCAP ద్వారా టెస్టింగ్ జరిగింది. ఈ ఫేస్‌లిఫ్టెడ్ SUV మోడల్ పెద్దల సేఫ్టీ విషయంలో 34 పాయింట్లకు 32.31 స్కోరుతో 5-స్టార్ రేటింగ్ సాధించింది.
పిల్లల సేఫ్టీ స్కోరు 49 పాయింట్లకు 33.64గా ఉంది. 3-స్టార్ రేటింగ్ పొందింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), EBDతో ఏబీఎస్, టీపీఎమ్ఎస్, పటిష్టమైన బాడీ నిర్మాణంతో నిస్సాన్ కారు స్టాండర్డ్ సేఫ్టీ డివైజ్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
టాటా ఆల్ట్రోజ్ :
ఈ ఫేస్‌లిఫ్ట్ కారు టాటా ఆల్ట్రోజ్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్టింగ్ జరగలేదు. కానీ, భారత్ NCAP (BNCAP) ప్రోగ్రామ్ కింద టెస్టింగ్ జరిగింది. ఈ హ్యాచ్ అన్ని సెగ్మెంట్లలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఈ టాటా హ్యాచ్‌బ్యాక్ పెద్దల సేఫ్టీకి 32 పాయింట్లకు 29.65 పాయింట్లు సాధించగా పిల్లల కోసం 49 పాయింట్లకు 44.90 పాయింట్లు సాధించింది.
Read Also : Nubia Neo 5 Max : భారీ బ్యాటరీ.. బిగ్ డిస్‌ప్లే.. నూబియా నియో 5 మ్యాక్స్ ఫోన్ అదుర్స్.. గేమర్లకు పండగే!
ఈ SUV అప్‌గ్రేడ్ కారు సేఫ్టీ ప్యాకేజీలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రతి ప్రయాణీకుడికి త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) ఉన్నాయి. ఈ కారు ధర మార్కెట్లో రూ. 5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి డిజైర్ :
భారత మార్కెట్లో మారుతి డిజైర్ అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ సెడాన్‌లలో ఒకటి. గ్లోబల్ NCAP (GNCAP), భారత్ NCAP (BNCAP) నుంచి 5-స్టార్ క్రాష్ సేఫ్టీ రేటింగ్ పొందింది. అయితే, గ్లోబల్ NCAP నుంచి మొత్తం 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఫస్ట్ మారుతి కారు కూడా ఇదే. GNCAP టెస్టింగ్‌లో డిజైర్ పెద్దవారికి 34 పాయింట్లకు 31.24 పాయింట్లు రాగా, పిల్లల కోసం 49 పాయింట్లకు 39.20 పాయింట్లు (4-స్టార్ రేటింగ్) సాధించింది.
అదే సమయంలో భారత్ NCAP ఈ సెడాన్‌కు పెద్దల సేఫ్టీకి 32 పాయింట్లకు 29.46 పాయింట్లు రాగా, పిల్లల భద్రతకు 49 పాయింట్లకు 41.57 పాయింట్లు వచ్చాయి. ఈ సెడాన్‌లో కీలక సేఫ్టీ ఫీచర్లలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో ABS, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) ఉన్నాయి.మారుతి సుజుకి డిజైర్ ధరలు భారత మార్కెట్లో ధర రూ. 6.26 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) లభ్యమవుతుంది.
టాటా నెక్సాన్ :
గ్లోబల్ NCAP , భారత్ NCAP నుంచి 5-స్టార్ రేటింగ్ పొందిన ఎస్‌యూవీ కార్లలో టాటా నెక్సాన్ ఒకటి. గ్లోబల్ ఎన్‌సీఏపీ పరీక్షలలో పెద్దవారి ప్రొటెక్షన్ కోసం 34 పాయింట్లకు 32.22 పాయింట్లు, పిల్లల కోసం 49 పాయింట్లకు 44.52 పాయింట్లు సాధించింది.
అదే భారత్ ఎన్‌సీఏపీ పరీక్షలో ఈ టాటా SUV 32 పాయింట్లకు 29.41, 49 పాయింట్లకు 43.83 పాయింట్లు సాధించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, రిమైండర్‌లతో త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్‌లు ఉన్నాయి. భారత మార్కెట్లో ఈ SUV ధర రూ. 7.37 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉంది.
