Nubia Neo 5 Max : భారీ బ్యాటరీ.. బిగ్ డిస్ప్లే.. నూబియా నియో 5 మ్యాక్స్ ఫోన్ అదుర్స్.. గేమర్లకు పండగే!
Nubia Neo 5 Max : నుబియా నియో 5 మ్యాక్స్‌లో 7.5-అంగుళాల LCD డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పటివరకు చూడని అతిపెద్ద డిస్ప్లేను కంపెనీ అందిస్తోంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..
Nubia Neo 5 Max
- నూబియా నియో 5 మ్యాక్స్‌లో 7.5-అంగుళాల LCD డిస్ప్లే
- ప్రాసెసింగ్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్ సెటప్
- ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో రన్ అవుతుంది
Nubia Neo 5 Max : సూపర్ ఫోన్ భయ్యా.. టాబ్లెట్‌కు ఏమాత్రం తీసిపోని రేంజ్లో భారీ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌ను నుబియా లాంచ్ చేసింది. ఈ కంపెనీ 7.5-అంగుళాల బిగ్ డిస్ప్లేతో నుబియా నియో 5 మ్యాక్స్‌ను గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ లార్జ్ ఫోన్ 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎల్సీడీ ప్యానెల్ కూడా ఉంది.
మోడ్రాన్ స్మార్ట్ఫోన్లలో అతిపెద్ద స్క్రీన్ ఫోన్ ఉందంటే ఇదే మోడల్ అని చెప్పొచ్చు. కేవలం డిస్ప్లే సైజ్ చూస్తేనే తెలుస్తుంది.. గేమింగ్, మూవీలు, మల్టీమీడియాకు అద్భుతంగా ఉంటుంది. బిగ్ స్క్రీన్ కోరుకునే యూజర్ల కోసం కంపెనీ ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా తయారుచేసింది. రాబోయే ఈ నూబియా ఫోన్ ఫీచర్లు, ధర వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
ధర, లభ్యత :
నుబియా నియో 5 మ్యాక్స్ ధర ఇంకా వెల్లడి కాలేదు. ఈ బ్రాండ్ చైనాలోని MWC షాంఘై 2026లో ఆవిష్కరించింది. కంపెనీ నియో 5 సిరీస్, గేమింగ్ మల్టీమీడియా ఎక్స్ పీరియన్స్ కోసం కంపెనీ తీసుకొస్తోంది.
నుబియా నియో 5 మాక్స్ స్పెసిఫికేషన్లు :
నూబియా నియో 5 మ్యాక్స్‌లో 7.5-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఈ కంపెనీ ఫోన్లలో ఇదే అతిపెద్ద డిస్ప్లే. 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసింగ్ కోసం కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్ అందిస్తోంది. గేమింగ్ కోసం మిడ్-రేంజ్ చిప్సెట్ కూడా ఉంది. ఈ ఫోన్లో 7000mAh బ్యాటరీని అమర్చగా ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. గతంలో మాదిరిగా కంపెనీ ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా గేమర్ల కోసం అందిస్తోంది. అందుకే ఇందులో షోల్డర్ ట్రిగ్గర్లు ఉన్నాయి. మొత్తం మీద, గేమింగ్ ఫోన్ కోరుకునే యువ యూజర్ల కోసం కంపెనీ ఈ ఫోన్ అందిస్తోంది. ఆసక్తికరంగా, ఈ ఫోన్ చైనాలో లాంచ్ కాకుండా ఇతర మార్కెట్లలోనూ లాంచ్ కానుంది.
