HMD Asha 305 Leak : నోకియా లవర్స్‌కు పండగే.. 14 ఏళ్ల తర్వాత ఆశా 305 ఫోన్ రీఎంట్రీ.. HMD కొత్త స్టైల్ అదిరిందిగా..!
HMD Asha 305 Leak : హెచ్ఎండీ ఆశా 305గా నోకియా రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ హెచ్ఎండీ ఫోన్ 14 ఏళ్ల తర్వాత భారత మార్కెట్లోకి వస్తోంది. చౌకైన ఈ ఫీచర్ ఫోన్ ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..
HMD Asha 305 Leak
- మళ్లీ మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న నోకియా ఆశా 305 ఫోన్
- ఈ ఫోన్ కాంపాక్ట్‌గా దృఢంగా సరసమైన ధరలో లభించనుంది
- మోడల్ నంబర్ HMD TA-1779 పేరుతో లాంచ్ అంచనా
- స్టోరేజీ కోసం మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా అందించే ఛాన్స్
HMD Asha 305 Leak : నోకియా పేరు గుర్తుందా? అప్పట్లో ఈ నోకియా క్రేజే వేరు.. కానీ, ఆ తర్వాత నోకియా కనుమరుగైపోయింది. చాలా ఏళ్ల తర్వాత నోకియా లవర్స్ కోసం మళ్లీ మార్కెట్లోకి సరికొత్తగా రాబోతుంది. ఈసారి కొత్త అవతార్ లుక్‌తో నోకియా ఆశా 305 రీఎంట్రీ ఇవ్వనుంది. హెచ్ఎమ్డీ ఈ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. అయితే, లాంచ్‌కు ముందే కీలక సమాచారం లీక్ అయింది.
హెచ్ఎమ్డీ ఆశా 305గా లాంచ్ కానుంది. ఈ ఫోన్ 14 ఏళ్ల తర్వాత మార్కెట్లోకి రానుంది. గతంలో మాదిరిగా కంపెనీ పేరును, క్వాలిటీతో నిలబెట్టుకుంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ కాంపాక్ట్‌గా, స్ట్రాంగ్, సరసమైన ధరలో లభించనుంది. హెచ్ఎమ్డీ ఆశా 305 ఇతర ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి..
సరికొత్త అవతార్‌లో రీఎంట్రీ :
హెచ్ఎమ్డీ పాత నోకియా ఫోన్ ఆశా 305 మళ్లీ మార్కెట్లోకి రాబోతుంది. గతంలో నోకియా ఆశా 305 పేరుతో లాంచ్ అయింది. కంపెనీ జూలై 2012లో ఈ ఫోన్ రిలీజ్ చేసింది. కానీ, ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత అంటే 2026లో సరికొత్త అవతార్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.
Read Also : Vivo Y6a Launch : వావ్.. మిడిల్ క్లాసు వాళ్లకు పర్ఫెక్ట్ ఫోన్ మావా.. వివో Y6a ఫీచర్లు చూస్తే నమ్మలేరు!
ఈ ఫోన్లో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయని అంటున్నారు. హెచ్ఎమ్డీ గ్లోబల్ లాంచ్ చేయనున్న ఈ ఫోన్ మోడల్ నంబర్ హెచ్ఎమ్డీ టీఎ-1779గా అంచనా. నోకియా ఆశాలో S40 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఆండ్రాయిడ్‌కు బదులుగా కంపెనీ సొంత ఓఎస్‌పైనే రన్ అవుతుంది అనమాట.
ఫీచర్లు, కెమెరా అదుర్స్ :
హెచ్ఎండీ ఆశా 305లో ఇంటర్నల్ ఎల్టీఈ మోడెమ్ ఉంటుందని అంచనా. ఈ ఫోన్ HMD టచ్ 4జీ టెక్నాలజీతో వస్తుందని భావిస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కాదు.. ఫీచర్ ఫోన్ అంతకన్నా కాదు.. మిక్స్డ్ ఫీచర్లతో వస్తున్న సింగిల్ ఫీచర్ ఫోన్ అని చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ టచ్ చాలా అద్భతంగా ఉంటుంది. ఈ ఫోన్లో లిమిటెడ్ యాప్‌లు, సింగిల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ సరసమైన ధరలో సబ్-ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
నోకియా ఆశా 305 ఫోన్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఈ కొత్త ఫోన్లో 400×240 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 3-అంగుళాల టచ్ డిస్ప్లే ఉండవచ్చు. ఈ ఫోన్లో 5MP మెయిన్ కెమెరాతో పాటు, 2MP సెల్ఫీ కెమెరా కూడా ఉండొచ్చు. 1GB లేదా 2GB ర్యామ్ కూడా ఉండొచ్చు. ఈ నోకియా ఫోన్లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉండే అవకాశం ఉంది. స్టోరేజ్ పరంగా కంపెనీ మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్‌ను కూడా అందించే ఛాన్స్ ఉంది.
