Summer AC Sales : కొత్త AC కావాలా? ఫ్లిప్ కార్ట్ లో 5 స్టార్ స్ప్లిట్ ఏసీలపై భారీ డిస్కౌంట్లు.. రూ.76,500 ఏసీ కేవలం..

Summer AC Sales : వేసవిలో కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఫైవ్ స్టార్ రేటెడ్ స్ప్లిట్ ఏసీలపై 50 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. పూర్తి వివరాలు మీకోసం..

Summer AC Sales

Summer AC Sales : వేసవి కాలం వచ్చేసింది. ఎయిర్ కండిషనర్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఈ వేసవిలో మీరు కొత్త ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బ్లూ స్టార్, LG, వోల్టాస్, హైయర్, రియల్‌మి, శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల ఎయిర్ కండిషనర్లపై ధరలను భారీగా తగ్గించాయి.

Read Also : Google Pixel 8a Price : గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ భారీగా తగ్గిందోచ్.. ఫీచర్ల కోసమేనా కొనేసుకోవచ్చు.. ఇంకా చౌకైన ధరకు ఎలా పొందాలంటే?

అద్భుతమైన తగ్గింపుతో స్ప్లిట్ ఏసీ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. ఫ్లిప్‌కార్ట్ స్ప్లిట్ ఏసీలపై ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు ఆకర్షణీయమైన బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. మీరు ఇంకా తక్కువ ధరకే ఏసీలను ఇంటికి తెచ్చుకోవచ్చు. ప్రస్తుతం ఎంపిక చేసిన మోడళ్లపై కొన్ని అద్భుతమైన డీల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఓసారి పరిశీలిద్దాం..

బ్లూ స్టార్ 1 టన్ 5 స్టార్ ఏసీ :
బ్లూ స్టార్ (IC512YNUR) మోడల్ నంబర్ ఏసీ అందిస్తోంది. సాధారణంగా ఈ 1 టన్ 5 స్టార్ ఏసీ ధర రూ. 63వేలు ఉంటుంది. కానీ, ప్రస్తుతం మీరు 42 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. దాంతో ఈ ఏసీ ధర కేవలం రూ. 36,490కి తగ్గింది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ద్వారా మీ పాత ఏసీని ట్రేడింగ్ చేసి రూ. 5,600 వరకు తగ్గింపు పొందవచ్చు.

హైయర్ 1.6 టన్ 5 స్టార్ ఏసీ :
హైయర్ స్ప్లిట్ ఏసీ అనేది (HS19E-TXG5BN) అనే ఇన్వర్టర్ మోడల్. ఈ ఏసీ ధర రూ. 76,500కు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఏసీ ధర రూ. 43,490కి తగ్గింది. అంటే.. 43 శాతం భారీ తగ్గింపును అందిస్తోంది. ఏసీని మరింత సరసమైన ధరకే కొనాలంటే రూ. 5,600 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఈ ఏసీని అతి తక్కువ ధరకే పొందవచ్చు.

రియల్‌మి 1.5 టన్ 5 స్టార్ ఏసీ :
రియల్‌మి కూడా అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. రియల్‌మి స్ప్లిట్ ఏసీ మోడల్ (155IPG24WRS) రూ. 65,999కు లిస్టు అయింది. కానీ, 50 శాతం డిస్కౌంట్‌ కలిగి ఉంది. ఈ ఏసీని కేవలం రూ. 32,999కు ఇంటికి తెచ్చుకోవచ్చు. అంతేకాదు.. ఈ ఎయిర్ కండిషనర్ 5-స్టార్ రేటింగ్‌తో వచ్చింది. మీ విద్యుత్ బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుంది.

ఎల్‌జీ 1 టన్ 5 స్టార్ ఏసీ :
ఎల్‌జీ ఎయిర్ కండిషనర్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఎల్‌జీకి చెందిన కొత్త మోడల్ (TS-Q14YNZE) తీసుకోవచ్చు. ఈ ఏసీలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి. LG ఏసీ ధర రూ. 75,990గా ఉంటే.. ప్రస్తుతం 48 శాతం తగ్గింపు కలిగి ఉంది. దాంతో LG ఏసీ ధర రూ. 39,490కి తగ్గింది. ఈ AC 4 వే ఎయిర్ స్వింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. గది అంతటా గాలి వ్యాపించి కూల్ అయ్యేలా చేస్తుంది.

Read Also : Lado Lakshmi Yojana : మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతినెలా రూ. 2,100 మీ ఖాతాలోకి.. ఈ పథకం ఎలా పొందాలంటే?

వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ :
మీరు వోల్టాస్ 1.5 టన్ స్ప్లిట్ AC కోసం చూస్తున్నారా? 185V వెక్ట్రా ఎలిగెంట్ మోడల్‌ను తీసుకోండి. ఈ ఇన్వర్టర్ మోడల్ ధర రూ. 75,990గా ఉంది. కానీ, ఈ ఏసీ కొనుగోలుపై 46 శాతం తగ్గింపు పొందవచ్చు. దాంతో ఏసీ కేవలం రూ. 40,900కే లభిస్తుంది. మీ పాత ఎయిర్ కండిషనర్‌కు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ద్వారా అదనంగా రూ. 5,600 ఆదా చేసుకోవచ్చు.