Best 5 SUV Cars : రూ. 20 లక్షల లోపు 5 బెస్ట్ SUV ఫ్యామిలీ కార్లు.. ఒక్కో కారు రేంజే వేరబ్బా.. ఎగబడి కొనేస్తున్నారు..!

Best 5 SUV Cars : మీరు SUV కారు కొనాలని అనుకుంటున్నారా? ఈ ఫీచర్లు అన్ని సరసమైన ధరలో అందిస్తే అందరూ ఈ SUV మోడల్స్ కొనేందుకు ఎగబడతారు..

Best 5 SUV Cars

  • కొత్త ఫ్యామిలీ SUV కారు కొంటున్నారా?
  • రూ. 20 లక్షల లోపు ధరలో 5 బెస్ట్ SUV కార్లు ఇవే
  • టాటా హారియర్ నుంచి మహీంద్రా స్కార్పియో ఎన్ వరకు ధరలివే

Best 5 SUV Cars : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారతీయ కొనుగోలుదారులు తక్కువ ధరలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించే SUV కార్లనే ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కారు సైజ్, స్టైల్, పవర్ ఫుల్ లుక్, రోడ్డుపై వేగంగా దూసుకెళ్లే కార్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది.

ఈ ఫీచర్లు అన్ని ఒక SUVలో ఉండి అది కూడా సరసమైన బడ్జెట్‌లో (Best 5 SUV Cars) ధరలో లభిస్తే ఎవరు కొనకుండా ఉంటారు. ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్ముడయ్యే ఐదు అదిరిపోయే ఎస్‌యూవీ కార్లను ఇప్పుడు చూద్దాం. ఇందులో మీకు నచ్చిన కారును కొనేసుకోవచ్చు.

టాటా హారియర్ :
టాటా హారియర్ లాంగ్ వెడల్పాటి సెగ్మెంట్‌లో ప్రీమియం లుక్ అందిస్తుంది. ఎత్తైన బెల్ట్‌లైన్ మస్కులర్ వీల్ ఆర్చ్‌ల కారణంగా రోడ్డుపై వేగంగా దూసుకెళ్లొచ్చు. కొన్నిసార్లు డీ-సెగ్మెంట్ SUV మాదిరిగా అనిపించవచ్చు.

టాటా అధికారిక వెబ్‌సైట్‌లో ధరలు రూ. 12.89 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. హారియర్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 2.0-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ రెండూ 6-స్పీడ్ మాన్యువల్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తాయి.

టాటా సఫారీ :
హ్యారియర్ మాదిరిగానే అదే ప్లాట్‌ఫామ్‌పై టాటా సఫారీ, లాంగ్ వీల్‌బేస్ మూడు వరుస సీట్లతో వస్తుంది. ఫ్రంట్ సైడ్, బిగ్ గ్రిల్ ఫుల్-LED లైటింగ్, హైవేపై నగరంలో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. టాటా సఫారీ ధర రూ. 13.29 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ హ్యారియర్‌లో ఉన్నటువంటి 2.0-లీటర్ టర్బో-డీజిల్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో సఫారీ లభిస్తోంది.

Read Also : Apple Days Sale : పండగ చేస్కోండి.. ఆపిల్ డేస్ సేల్ ఆఫర్లు.. ఈ ఐఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఏ మోడల్ ధర ఎంతంటే?

ఎంజి హెక్టర్ :
ఎంజీ హెక్టర్ బోల్డ్ క్రోమ్ గ్రిల్, వైడ్ స్టాన్స్ లాంగ్ బోనెట్‌తో వస్తుంది. అదే సైజులో అనేక ఇతర ఎస్‌యూవీల కన్నా పెద్దదిగా కనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీ బేస్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

హెక్టర్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో రన్ అవుతుంది. మాన్యువల్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. టాప్-స్పెక్ వేరియంట్లు 141bhp, 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

మహీంద్రా థార్ రాక్స్ :
మహీంద్రా థార్ రాక్స్ క్లాసిక్ థార్ బాక్సీ డిజైన్‌, 5-డోర్ల కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. వైడ్ ప్రాక్టికల్ లుక్‌ను అందిస్తుంది. బేస్ వేరియంట్ ధరలు రూ. 12.39 కోట్ల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతాయి.

ఈ ఎస్‌యూవీ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ రెండూ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి. ఎంపిక చేసిన ట్రిమ్స్‌లో డీజిల్ వేరియంట్ 4×4 డ్రైవ్ సిస్టమ్‌తో కూడా అందుబాటులో ఉంది.

మహీంద్రా స్కార్పియో ఎన్ :
మహీంద్రా స్కార్పియో ఎన్ అత్యంత ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. హై గ్రౌండ్ క్లియరెన్స్, మస్కులర్ బాడీతో పవర్ ఫుల్ ఆఫ్-రోడ్ SUVగా మార్చాయి. నగర రోడ్లకు కూడా అద్భుతంగా సరిపోతుంది. ఈ SUV ధర రూ. 13.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

స్కార్పియో ఎన్ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఈ రెండూ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో డీజిల్ ఇంజన్ 4×4 వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది.