Croma Smart TVs Offer : వారెవ్వా.. క్రోమాలో భారీ సేల్.. 55-అంగుళాల LED స్మార్ట్ టీవీలు సగం ధరకే..

Croma Smart TVs Offer : శాంసంగ్, ఎల్‌జీ, టీసీఎల్, షావోమీ వంటి బ్రాండ్‌ల 55-అంగుళాల స్మార్ట్ టీవీల ధరలను 50శాతం వరకు భారీగా తగ్గించాయి. పూర్తి వివరాలివే

Croma Smart TVs Offer ( Image Credit : AI )

  • క్రోమాలో స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్లు
  • 55-అంగుళాల స్మార్ట్ టీవీలపై 50శాతం వరకు తగ్గింపు
  • బిగ్ స్క్రీన్ స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు

Croma Smart TVs Offer : కొత్త స్మార్ట్‌టీవీ కొనేందుకు చూస్తున్నారా? 55-అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ అతి చౌకైన ధరకే లభిస్తోంది. అసలు ధరలో సగం కన్నా తక్కువకే ఇంటికి తెచ్చుకోవచ్చు. క్రోమాలో స్మార్ట్ టీవీలు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి.

శాంసంగ్, ఎల్‌జీ, షావోమీ, టీసీఎల్ వంటి బ్రాండ్‌ల పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీలను చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. క్రోమాలో స్మార్ట్ టీవీ కొనుగోళ్లపై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం…

శాంసంగ్ క్యూఎల్ఈడీ టీవీ :
సౌత్ కొరియా బ్రాండ్ Q8F సిరీస్ QLED స్మార్ట్ టీవీల ధరలో 30శాతం తగ్గింపు లభిస్తోంది. వాస్తవానికి ఈ స్మార్ట్ టీవీలు రూ. 86,100 ధర ఉండగా ప్రస్తుతం రూ. 60,490కే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుపై క్రోమా రూ. 2,500 బ్యాంక్ డిస్కౌంట్‌ కూడా ఆఫర్ చేస్తోంది.

Read Also : Jio Cheapest Plan : జియో చీపెస్ట్ ప్లాన్ ! 84 రోజులు ఫుల్ ఎంజాయ్.. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా అక్కర్లేనివారికి పండగే..!

టీసీఎల్ 4K ఎల్ఈడీ టీవీ :
టీసీఎల్ 55-అంగుళాల V6C టీవీ 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీ ధరలో 54శాతం తగ్గింపు పొందింది. అసలు ధర రూ. 71,850 కాగా క్రోమాలో రూ. 32,990కే లభిస్తోంది. కొనుగోలుతో పాటు రూ. 2,799 విలువైన ఫ్రీ సౌండ్‌బార్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో గూగుల్ అసిస్టెంట్ ఉంది. ఈ టీసీఎల్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది.

షావోమీ ఎల్ఈడీ టీవీ :
చైనీస్ బ్రాండ్‌కు చెందిన ఎక్స్-సిరీస్ స్మార్ట్ టీవీల ధర 29శాతం తగ్గింది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 48,999 నుంచి ఇప్పుడు రూ. 34,999కే అందుబాటులో ఉంది. ఈ టీవీ కొనుగోలుపై రూ. 2,100 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. రూ.2,799కే సౌండ్‌బార్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది. డాల్బీ విజన్ వంటి ఫీచర్లతో వస్తుంది.

ఎల్‌జీ 4K UHD టీవీ :
ఈ ఎల్జీ స్మార్ట్ టీవీ 34శాతం తగ్గింపుతో లభిస్తుంది. అసలు ధర రూ. 66,290 కాగా, ఇప్పుడు కేవలం రూ. 43,990కే అందుబాటులో ఉంది. ఈ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ వెబ్ఓఎస్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది. జెన్ఏఐ (GenAI) టెక్నాలజీతో వస్తుంది.

తోషిబా ఎల్ఈడీ టీవీ :
ఈ స్మార్ట్ టీవీ ధర 35శాతం తగ్గింది. అసలు ధర రూ. 52,250 కాగా, ఇప్పుడు రూ. 35,899కే లభిస్తుంది. అదనంగా, రూ. 1,900 బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది.