New Big Rules April 1 : ఏప్రిల్ 1 నుంచి కొత్త పాన్ కార్డు రూల్స్.. ఇక తప్పించుకోలేరు.. కారు, బైక్, క్యాష్ పేమెంట్లు చేసే ముందు జాగ్రత్త!

New Big Rules April 1: కారు, ఇల్లు కొనడం, క్యాష్ ట్రాన్సాక్షన్లు, హోటల్ బిల్లులపై ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు నిబంధనలు మారనున్నాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

New Big Rules April 1 ( Image Credit : AI )

  • ఏప్రిల్ 1 నుంచి మారనున్న పాన్ కార్డు నిబంధనలు
  • కారు, బైక్, క్యాష్ డిపాజిట్, పాన్ కార్డు రూల్స్ మార్పు
  • ఆధార్ ఒక్కటే సరిపోదు.. ఇతర డాక్యుమెంట్లు తప్పనిసరి

New Big Rules April 1 : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. వచ్చే నెల నుంచి పాన్ కార్డు రూల్స్ మారబోతున్నాయి. కారు లేదా ఇల్లు కొనడం, క్యాష్ పేమెంట్లు, హోటల్ బిల్లులు సహా అన్నింటిపై నిబంధనలు మారనున్నాయి. ఆధార్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు కూడా ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంకు డిపాజిట్లు, కేవైసీ చెకింగ్, పన్ను దాఖలుతో సహా ప్రతి ఆర్థిక లావాదేవీకి పాన్ కార్డు తప్పనిసరి.

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం, కొత్త ఆదాయపు పన్ను నిబంధనల అమలుతో ఈ డాక్యుమెంట్ సంబంధిత అవసరాలు కూడా కఠినతరం కానున్నాయి. ఈ మార్పుల్లో ప్రధానంగా పాన్ కార్డు పొందడం నుంచి బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడం వరకు ప్రతిది మారనుంది. ఏప్రిల్ నుంచి పాన్ కార్డుల విషయంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. పాన్ కార్డ్ దరఖాస్తు నిబంధనలు :
పాన్ కార్డ్ అప్లికేషన్ ప్రక్రియలో మార్పు చేసింది. పాన్ కోసం అప్లయ్ చేసేటప్పుడు మీరు ఇకపై మీ ఆధార్ కార్డుతో పాటు ఇతర డాక్యుమెంట్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇకపై కేవలం ఆధార్ ఆధారంగా మాత్రమే పాన్ మంజూరు కాదు.

మీ ఆధార్ కార్డుతో పాటు మరో ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్‌డే లేదా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. సులభంగా చెప్పాలంటే అడ్రస్ ప్రూఫ్ కోసం మరో డాక్యుమెంట్ అవసరం కావచ్చు. ఈ కొత్త మార్పుతో ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుంది.

2. పాన్‌పై బ్యాంక్ లావాదేవీల పరిమితిలో మార్పు :
పాన్‌ కార్డుకు సంబంధించి బ్యాంక్ లావాదేవీల విషయంలోనే అతిపెద్ద మార్పు జరిగింది. ఇప్పుడు ఈ పరిమితి మారింది. గతంలో బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేస్తే రూ. 50వేలు డిపాజిట్ కోసం పాన్ చూపించాల్సి ఉండేది. ఇదే అవకాశంగా కొంతమంది టాక్స్ తప్పించుకోవడానికి కేవలం రూ. 49,000 లేదా రూ. 48,000 మాత్రమే డిపాజిట్ చేసేవారు.

Read Also : Income Tax Rules : ఉద్యోగులకు బిగ్ షాక్! ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను రూల్స్.. చేతికి వచ్చే జీతం భారీగా కట్!

కానీ, ఇప్పుడు పూర్తిగా రద్దు చేసింది ప్రభుత్వం. ఈ పరిమితిని వార్షిక ప్రాతిపదికన విధించారు. మీ బ్యాంక్ ఖాతాలో ఒక ఏడాదిలో రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే పాన్ చూపించడం తప్పనిసరి.

3. మోటారు వాహనాల పాన్ (PAN) నిబంధనలలో మార్పులు :
గతంలో, ప్రతి మోటారు వాహనం కొనుగోలుకు పాన్ కార్డు తప్పనిసరిగా ఉండేది. కానీ, ఈ నిబంధన ఇప్పుడు మారింది. ఇప్పుడు, మీరు రూ. 5 లక్షల కన్నా ఎక్కువ విలువైన వాహనాన్ని కొనుగోలు చేస్తే.. అది టూవీలర్ అయినా లేదా ఫోర్ వీలర్ అయినా మీరు పాన్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. కొనుగోలు ధర రూ. 5 లక్షలు దాటితే మాత్రమే పాన్ కార్డు సమర్పించడం తప్పనిసరి. ఈ నిబంధన కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

4. ఆస్తి రిజిస్ట్రేషన్‌లో మార్పులు :
మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకుంటే రిజిస్ట్రేషన్ వాల్యూ లేదా సర్కిల్ రేటు రూ. 10 లక్షలు దాటితే మీ పాన్ కార్డును తప్పనిసరిగా అందించాలి. ఇప్పుడు రూ. 20 లక్షలకు పెంచారు. ఈ నిబంధన కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

5. హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లులపై పాన్ :
గతంలో, రూ. 50,000 పైబడిన క్యాష్ పేమెంట్లకు పాన్ అవసరమయ్యేది. కానీ, ఇప్పుడు ఈ లిమిట్ రూ. లక్షకు పెంచారు. అదేవిధంగా, రూ. 50వేల పైబడిన బీమా ప్రీమియంలకు పాన్ అవసరం ఉండేది కానీ ఇప్పుడు ఈ విధానం మార్చారు.

6. రూ. 2 లక్షలకుపైగా లావాదేవీలకు పాన్ కార్డు :
పాన్‌కు సంబంధించిన ఇతర లావాదేవీల పరిమితులలో ఎలాంటి మార్పు ఉండదు. రూ. 2 లక్షలకు పైబడిన ఏ లావాదేవీకైనా పాన్ చూపించడం తప్పనిసరి.