Income Tax Rules : ఉద్యోగులకు బిగ్ షాక్! ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను రూల్స్.. చేతికి వచ్చే జీతం భారీగా కట్!
Income Tax Rules : ఏప్రిల్ నెలలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు అమల్లోకి వస్తాయి. మీ జీతం, పన్నులపై నేరుగా ప్రభావాన్ని చూపవచ్చు.
Income Tax Rules ( Image Credit : AI )
- వచ్చే నెల నుంచి మారనున్న పన్ను నిబంధనలు
- ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను కొత్త రూల్స్ అమల్లోకి
- ఉద్యోగులకు చేతికి అందే జీతం భారీగా తగ్గనుంది
- జీతాల విధానంలో మార్పులు ఎందుకంటే?
Income Tax Rules 2026 : ఉద్యోగులు, పన్నుచెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) మరో 2 రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి ఫైనాన్షియల్ క్యాలెండర్ మారనుంది. మీ జీతం లెక్కలు కూడా మారతాయి. ఈ తేదీ నుంచే ఆదాయపు పన్ను చట్టం, 2025లోని కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. దాంతో మీ నెలవారీ జీతం నిర్మాణం, చేతికి అందే జీతంపై నేరుగా ప్రభావం పడుతుంది.
మీరు పనిచేసే కంపెనీ మీ మొత్తం పేరోల్ (CTC)ను పెంచకపోయినా కూడా ఏప్రిల్ 1 నుంచి మీ పేస్లిప్లో చూపించే అలవెన్సులు, మినహాయింపులు మారవచ్చని ఆదాయపు పన్ను నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త నిబంధనలు మీ ఆర్థిక పరిస్థితిపై ఎలా ప్రభావం చూపుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
జీతాల విధానంలో మార్పు ఎందుకంటే? :
కొత్త నిబంధనల ప్రకారం.. అలవెన్సులు, రీయింబర్స్మెంట్లు, కంపెనీ ప్రయోజనాలను మూల్యాంకనం చేసే నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. గతంలో కంపెనీలు పన్నులను ఆదా చేసేందుకు జీతాలను వివిధ అలవెన్సులుగా విభజించేవి. కానీ, ఇప్పుడు చాలా ప్రయోజనాలకు స్థిరమైన పన్ను విధించనుంది. అంటే.. మీ జీతంలో ఎక్కువ భాగాన్ని పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణించవచ్చు.
చేతికి వచ్చే జీతం తగ్గుతుంది :
కొత్త కార్మిక చట్టం ప్రకారం.. ఉద్యోగి ప్రాథమిక జీతం ఇప్పుడు వారి మొత్తం CTCలో కనీసం 50 శాతంగా ఉండాలి. ప్రాథమిక జీతం పెరగడం వల్ల మీ PF, గ్రాట్యుటీ పేమెంట్లు పెరుగుతాయి. మీ భవిష్యత్ సేవింగ్స్ పెరిగినప్పటికీ మీ నెలసరి జీతం తగ్గే అవకాశం ఉంది.
ఇకపై కంపెనీ సౌకర్యాలు పన్ను పరిధిలోకి :
మీ కంపెనీ ప్రోత్సాహకాలను అందిస్తే.. ఇకపై వాటిపై కూడా మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆఫీసు కారు వ్యక్తిగత వినియోగం, డ్రైవర్ జీతం ఇకపై మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంలో చేరతాయి.
అంతేకాదు.. గృహవసతి, సేవలు లేదా విద్యుత్, వాటర్ బిల్లుల కోసం కంపెనీ నుంచి వచ్చే పేమెంట్లు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. పిల్లల పాఠశాల ఫీజులు (ఒక నిర్దిష్ట పరిమితికి మించి), కంపెనీ క్రెడిట్ కార్డులు, క్లబ్ సభ్యత్వాలు, వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రోత్సాహకాలు ఇకపై పన్ను పరిధిలోకి వస్తాయి.
పాత, కొత్త పన్నుల విధానం :
ఏప్రిల్ 1వ తేదీ నుంచి మీకు ఏ పన్ను విధానం బెస్ట్ అనేది డిసైడ్ చేసుకోవాలి. కొత్త పన్ను విధానం తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది. కానీ, HRA, 80C వంటి మినహాయింపులను ఇవ్వదు. జీతభత్యాల నిర్మాణం సౌకర్యవంతంగా ఉండటం బెటర్. అయితే, పాత పన్ను విధానంలో అలవెన్సులు ఉండి, మీరు LIC, PPF మొదలైన పెట్టుబడులు పెడుతుంటే పన్నులు ఆదా చేసుకునేందుకు పాత విధానమే బెటర్.
