×
Ad

8th Pay Commission : 8వ వేతన సంఘంపై మరో సెన్సేషన్.. ఇల్లు కట్టుకునేందుకు రూ.75 లక్షలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త డిమాండ్!

8th Pay Commission : 8వ వేతన సంఘం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆస్తి ధరలు భారీ మొత్తంలో పెరిగాయని ఉద్యోగులు చెబుతున్నారు.

8th Pay Commission ( Image credit to Original Source )

  • ఉద్యోగులు తక్కువ వడ్డీతో ఎక్కువ మొత్తంలో లోన్లు అందించాలని డిమాండ్
  • గరిష్ట HBA పరిమితిని రూ. 75 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదన
  • కనీస సర్వీసు కాలాన్ని 5 ఏళ్ల నుంచి రెండు ఏళ్లకు తగ్గించాలి
  • ఈ రుణంపై వడ్డీ రేటు గరిష్టంగా 5 శాతానికి పరిమితం చేయాలి

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. 8వ వేతన సంఘం నుంచి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన నగరాల్లో ప్రాప్టరీ ధరలు భారీగా పెరిగాయని ప్రస్తుత రుణ పరిమితితో ఇల్లు కొనడం చాలా కష్టమవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు.

అందుకే ఉద్యోగుల సంస్థలు గరిష్ట HBA పరిమితిని రూ. 75 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదించాయి. గృహ నిర్మాణానికి సంబంధించి భారీ మార్పులు చేపట్టాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు.

కొత్త 8వ పే కమిషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యోగులు తక్కువ వడ్డీతో ఎక్కువ మొత్తంలో లోన్లు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

ఉద్యోగి సంస్థల సూచనలేంటి? :
నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) ద్వారా నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్స్ సమాఖ్య (FNPO) ఈ డిమాండ్‌ చేసింది. NC-JCM ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. పే కమిషన్‌కు సిఫార్సులను సిద్ధం చేస్తుంది. ఈ రుణంపై వడ్డీ రేటును గరిష్టంగా 5 శాతానికి పరిమితం చేయాలని కూడా ఉద్యోగులు డిమాండ్ చేశారు.

ప్రస్తుత HBA పరిమితి ఎంత? :
7వ వేతన సంఘం తర్వాత ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారం.. గృహ నిర్మాణ అడ్వాన్స్‌కు గరిష్ట పరిమితి రూ. 2.5 మిలియన్లు లేదా ఉద్యోగి 34 నెలలకు ప్రాథమిక జీతం ఇందులో ఏది తక్కువైతే అది పరిగణనలోకి తీసుకుంటారు. ఈ రుణంపై దాదాపు 7.5 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో దీని పరిమితి చాలా తక్కువగా ఉందని ఉద్యోగి సంస్థలు చెబుతున్నాయి.

Read Also : PM-Kisan : పీఎం కిసాన్‌పై ఉత్కంఠ.. రూ. 22వ విడతకు ముందే లక్షలాది రైతుల పేర్లు తొలగింపు.. మీ పేరు తీసేయడానికి 5 కారణాలివే..!

పెద్ద నగరాల్లో ఇల్లు కొనడం కష్టం :
ఉద్యోగ సంఘాల ప్రకారం.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఆస్తి ధరలు ఇటీవలి సంవత్సరాలలో వేగంగా పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుత HBA పరిమితిలోపు ఇల్లు కొనడం లేదా నిర్మించడం కష్టతరంగా మారింది. ఈ పథకంలో మార్పులు అవసరమని భావిస్తున్నారు.

ఉద్యోగుల డిమాండ్లు ఇవే :

ఉద్యోగి ప్రతినిధులు కూడా (HBA) ఉద్యోగి నెలవారీ జీతం కన్నా 60 రెట్లు పెంచాలని సూచించారు. కనీస సర్వీసు కాలాన్ని 5 ఏళ్ల నుంచి రెండు ఏళ్లకు తగ్గించాలని పాత ఇళ్లను కొనుగోలు చేయడం లేదా ప్రధాన పునర్నిర్మాణాలకు రుణాలు అందించాలని కూడా ప్రతిపాదించారు.

హౌస్ బుల్డింగ్ అడ్వాన్స్ ఏంటి? :
హౌస్ బుల్డింగ్ అడ్వాన్స్ అనేది ప్రభుత్వం అందించే రాయితీ రుణం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇల్లు కొనడంలో లేదా కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఉద్యోగులకు ముఖ్యమైన సంక్షేమ ప్రయోజనంగా చెప్పొచ్చు.

8వ వేతన సంఘం పని ఏంటి? :
8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, భత్యాలను రివ్యూ చేస్తుంటుంది. ఉద్యోగి సంస్థలు ప్రస్తుతం కమిషన్‌కు డిమాండ్లు, సూచనలను సమర్పిస్తున్నాయి. కమిషన్ తన నివేదికను సమర్పించేందుకు దాదాపు 18 నెలలు పట్టవచ్చని భావిస్తున్నారు. ఆ తర్వాత HBA పరిమితిని పెంచాలా వద్దా అనే దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.