Aadhaar Update 2026 : ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. పైసా ఖర్చు లేకుండా ఈ వివరాలు ఫ్రీగా మార్చుకోవచ్చు!
Aadhaar Update 2026 : ఆధార్ కార్డులో ఈమెయిల్ ఐడీని ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉందా? UIDAI అందిస్తున్న సదుపాయం, డిసెంబర్ 31 గడువు, Aadhaar యాప్‌లో అప్‌డేట్ చేసే విధానం గురించి తెలుసుకోండి.
- Sreehari A
- Published on- November 15, 2026 / 06:38 PM IST
Aadhaar Update 2026
- ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్..
- ఫ్రీ అప్‌డేట్‌కు డిసెంబర్ 31నే లాస్ట్ డేట్..
- ఆధార్‌లో ఈమెయిల్ మార్చుకోవాలా?
- వెంటనే ఇలా చేయండి
Aadhaar Update 2026 : ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికీ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాంకు పనుల నుంచి ప్రభుత్వ పథకాల వరకు చాలా అవసరాలకు ఆధార్ తప్పనిసరిగా మారింది. అందుకే, ఆధార్‌లో మన వివరాలు ఎప్పటికప్పుడు కరెక్ట్‌గా ఉండటం చాలా ముఖ్యం.
అయితే, ఆధార్‌లో ఏదైనా వివరాలు మార్చుకోవాలంటే సాధారణంగా నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఓ కీలకమైన వివరాన్ని మాత్రం ఫ్రీగా అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉందన్న వార్త ఆధార్ కార్డుదారులకు ఊరటనిస్తోంది.. ఇంతకీ ఏం చేయాలంటే?
ఆధార్‌కు లింక్ చేసిన ఈమెయిల్ ఐడీ :
ప్రస్తుతం ఉపయోగించని పాత మెయిల్ ఐడీని మార్చుకుని, కొత్త ఈమెయిల్ అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. యూఐడీఏఐ (UIDAI) అందిస్తున్న ఈ ఉచిత సదుపాయాన్ని డిసెంబర్ 31, 2026 వరకు వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ, గడువు, నిబంధనలను అధికారిక యాప్‌లో ఒకసారి చెక్ చేసుకున్నాకే పూర్తి చేయండి.
Read Also : Chicken Prices Today : చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు.. కిలో ఎంతంటే?
ఆధార్‌లో ఈమెయిల్ ఐడీని ఫ్రీగా మార్చొచ్చు :
ఈ ప్రాసెస్ కోసం ముందుగా అధికారిక ఆధార్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీతో లాగిన్ అవ్వాలి. యాప్‌లోని (Services) సెక్షన్ లోకి వెళ్లి (Free Email Update) ఆప్షన్ అందుబాటులో ఉంటే ఎంచుకోవాలి.
అక్కడ కనిపించే సూచనలను అనుసరిస్తూ.. ప్రస్తుతం అప్‌డేట్ చేయాలనుకుంటున్న కొత్త ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. ఆ మెయిల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలి. దీంతో మీ రిక్వెస్ట్ ప్రాసెస్‌కు వెళ్తుంది.
ఆలస్యం చేయొద్దు :
ఆధార్‌కు సరైన ఈమెయిల్ ఐడీ లింక్ అయి ఉండాలి. అప్పుడే ఏదైనా ముఖ్యమైన సమాచారం, నోటిఫికేషన్లు అందుకోవచ్చు.. అయితే, ఈమెయిల్ ద్వారా ప్రతి ఆధార్ ఓటీపీ వస్తుందని భావించకూడదు. అలాగే ఫ్రీ అప్‌డేట్ గడువు, ఛార్జీల వివరాల కోసం యూఐడీఏఐ అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలి. యాప్‌లో సదుపాయం కనిపిస్తే గడువులోగా పూర్తి చేయడం బెటర్..
