Summer AC Tips : మీ ఇంట్లో మధ్యాహ్నం ఏసీ కూలింగ్ అవ్వట్లలేదా? గ్యాస్ లీక్ కాదు.. ఈ సింపుల్ సెట్టింగ్ ఆన్ చేస్తే సరి..!
Summer AC Tips : ఒకవేళ ఏసీ నుంచి గ్యాస్ లీక్ కాకున్నా కూలింగ్ సమస్యలు ఉన్నా మీరు రిమోట్ కంట్రోల్‌లో సెట్టింగ్స్ అడ్జెస్ట్ చేసుకోవచ్చు. తద్వారా మధ్యాహ్నం పూట కూడా గది చాలా చల్లగా ఉంటుంది.
- Sreehari A
- Published on- May 17, 2026 / 06:54 PM IST
Summer AC Tips ( Image Credit : AI )
- ఈ సమ్మర్‌లో ఏసీ కూలింగ్ సమస్యలకు కారణాలివే
- మధ్యాహ్నం ఏసీ కూలింగ్ అవ్వడం లేదా?
- గ్యాస్ లీక్ లేకున్నా గది కూలింగ్ తొందరగా అవ్వకపోవచ్చు
- మీ ఏసీలో ఈ చిన్న రిమోట్ సెట్టింగ్స్ మారిస్తే సరిపోతుంది
Summer AC Tips : మీ ఇంట్లో ఏసీ కూలింగ్ అవ్వడం లేదా? అసలే ఎండాకాలం.. ఎండలు మండిపోతున్నాయి. అందులోనూ మే, జూన్ నెలల్లో మధ్యాహ్నం బాగా వాతావరణం హీట్ పెరుగుతుంది. తద్వారా మీ ఇంట్లో ఏసీపై అధిక భారం పడుతుంది.
గ్యాస్ లీక్ లేకపోయినా రూమ్ త్వరగా కూల్ అవ్వదు. అయితే, ఈ రోజుల్లో (Summer AC Tips) ఏసీలు 50 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా రూమ్ తొందరగా కూలింగ్ చేస్తున్నాయి. చాలా ఏసీ కంపెనీలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
ఒకవేళ మధ్యాహ్నం పూట మీ ఏసీ గదిని కూలింగ్ చేయకపోతే ఆందోళన అవసరం లేదు. రిమోట్‌లోని కొన్ని సెట్టింగ్‌లను మారిస్తే సరిపోతుంది. తద్వారా మీరు మధ్యాహ్నం పూట కూడా మీ రూమ్ తొందరగా కూలింగ్ అవుతుంది.
Read Also : Best Mileage Bikes : కొత్త బైక్ కొనాలా? రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ ఇచ్చే 5 సూపర్ బైకులు ఇవే!
రిమోట్‌లో ఈ సెట్టింగ్ ఆన్ చేయండి :
స్ప్లిట్ ఏసీ అయినా విండో ఏసీ అయినా ప్రతి ఏసీకి ఒక రిమోట్ కంట్రోల్ ఉంటుంది. ఏసీ రిమోట్‌లో వివిధ సెట్టింగ్స్ ఉంటాయి. వాటిని సరిగ్గా వాడితే పగటిపూట కూడా రూమ్ కూల్ ఉంటుంది.
సాధారణంగా, ఏసీని వాడేటప్పుడు చాలామంది ఆటో మోడ్‌ను వాడతారు. గది, బయటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఏసీ కూలింగ్ పెంచడం లేదా తగ్గిస్తుంది. అంతేకాదు.. రూమ్ కూలింగ్ అయితే ఏసీ కంప్రెసర్‌ను ఆటోమేటిక్‌గా స్టాప్ చేస్తుంది.
మీ ఏసీకి గ్యాస్ లీక్ లేకున్నా పగటిపూట మీ రూమ్ కూలింగ్ కాకున్నా ఏసీ రిమోట్‌కి వెళ్లి ఆటో మోడ్ రిమూవ్ చేసి కూల్ మోడ్‌ను ఎంచుకోండి. ఆటో, ఫ్యాన్, లేదా డ్రై మోడ్‌లను వాడొద్దు. కూల్ మోడ్‌కు మారడం వల్ల కంప్రెసర్ కూల్ అయి స్పీడ్ పెరుగుతుంది. చాలా ఏసీలలో టర్బో మోడ్ కూడా ఉంటుంది. ఇది ఆన్ చేసినప్పుడు గది క్షణాల్లోనే కూలింగ్ అవుతుంది.
తప్పక గుర్తుంచుకోండి :
మీ ఏసీ మోడ్ సెట్టింగ్‌లను మార్చడమే కాదు.. ఏసీ ఫిల్టర్‌ను కూడా రెగ్యులర్ క్లీన్ చేయాలి. పేరుకుపోయిన మురికి పోతుంది. సరైన ఎయిర్ ఫ్లో వచ్చేలా చేస్తుంది. మీ ఇంట్లో ఏసీ ఉన్న రూమ్ పూర్తిగా బయటి గాలి చొరబడకుండా క్లోజ్ చేయండి. రెగ్యులర్ సర్వీసింగ్ చేయించి డీప్ క్లీన్ చేయండి. ఇలా చేస్తే మీ ఏసీలో కూలింగ్ సమస్య తగ్గుతుంది.
