ఢిల్లీ: రిపబ్లికే డే ను పురస్కరించుకుని విమానయాన సంస్థలు ఆఫర్లతో ముంచెత్తాయి. విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా రిపబ్లిక్ డేను పురస్కరించుకుని బంపర్ ఆఫర్ ఇచ్చింది. చౌకగా విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. జస్ట్ 979 రూపాయలకే విమానంలో వెళ్లొచ్చు. దేశీయంగా నడిచే విమానంలో
ఢిల్లీ: రిపబ్లికే డే ను పురస్కరించుకుని విమానయాన సంస్థలు ఆఫర్లతో ముంచెత్తాయి. విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా రిపబ్లిక్ డేను పురస్కరించుకుని బంపర్ ఆఫర్ ఇచ్చింది. చౌకగా విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. జస్ట్ 979 రూపాయలకే విమానంలో వెళ్లొచ్చు. దేశీయంగా నడిచే విమానంలో కనిష్ఠంగా అన్ని ఛార్జీలు కలిసి ఎకనామిక్ క్లాస్‌లో రూ.979గా టికెట్ ధర నిర్ణయించారు. బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.6వేల 965. జనవరి 26 నుంచి 28వ తేదీ వరకూ ఈ రాయితీ టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. 2019, సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ టికెట్ల వాలిడీటి ఉంటుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా నడిచే విమాన టికెట్లను ఈ మూడు రోజుల్లో తక్కువ ధరలకు విక్రయించనున్నామని ఎయిరిండియా అధికారులు చెప్పారు.
* రూ.979కే విమాన ప్రయాణం
* అంతర్జాతీయంగా ఎకానమీ క్లాస్‌లో రూ.55వేలకే అమెరికా ప్రయాణం
* బ్రిటన్, యూరప దేశాలకు రూ.32వేలు
* ఆస్ట్రేలియాకు ఎకానమీ క్లాస్‌లో రూ.50వేలకే ప్రయాణం
* రూ.11 వేలకే దక్షిణాసియా దేశాలకు ప్రయాణం
* 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు బుక్ చేసుకునే అవకాశం
బడ్జెట్ విమానయాన సంస‍్థ గోఎయిర్ కూడా తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేసింది. దేశంలోని 26 ప్రముఖ ప్రాంతాలకు రూ.999లకే టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. జనవరి 26వ తేదీతో ఈ ఆఫర్ ముగియనుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఫిబ్రవరి 9 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించవచ్చు.
* హైదరాబాద్, కోల్‌కతా, గోవా, బెంగళూరు, భువనేశ్వర్, బెంగళూరు, ముంబై, కొచ్చి, ఢిల్లీ, గౌహతి, గోవా, బాగ్దోగ్రా, ఛండీగఢ్, రాంచీ, జైపూర్, లక్నో, చెన్నై, నాగపూర్, పుణె, పాట్నా, శ్రీనగర్ రూట్లలో తక్కువ ధరకే ప్రయాణం
* బాగ్దోగ్రా-గౌహతి మధ్య కేవలం రూ.999 కే ప్రయాణం
* ముంబై-లేహ రూట్‌లో రూ.4,599 టికెట్ ధర
జెట్ ఎయిర్‌వేస్ సైతం 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రిపబ్లిక్ డే సేల్ ఆఫర్‌లో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లను సగం ధరకే విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడు రోజుల సేల్‌లో పరిమిత కాలం ఆఫర్‌గా అందిస్తున్న 50 శాతం వరకూ డిస్కౌంట్ ఇరువైపుల ప్రయాణానికి వర్తిస్తుందని తెలిపింది. ప్రీమియం, ఎకానమీ క్లాసుల్లో కూడా ఈ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. 2019, జనవరి 30వ తేదీ వరకూ ఈ ఆఫర్‌లో అందుబాటులో ఉంటుంది. మస్కట్, షార్జా తప్ప గల్ఫ్‌లోని అన్ని దేశాలతోపాటు బ్యాంకాక్, సింగపూర్, హాంకాంగ్, ఖాట్మాండు, కొలంబో, ఢాకా వెళ్లే ప్రయాణికులకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. తొలుత బుక్ చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం ఆధారంగా టికెట్ల కేటాయింపు జరగనుంది.