Amazfit Balance Ultra : వావ్.. ఛార్జింగ్ టెన్షన్‌కు గుడ్‌బై! 30 రోజుల బ్యాటరీతో సరికొత్త అమాజ్‌ఫిట్ స్మార్ట్‌వాచ్‌.. ధర వింటే నమ్మలేరు!

Amazfit Ultra Smartwatch : అద్భుతమైన ఫీచర్లతో అమాజ్‌ఫిట్ బ్యాలెన్స్ అల్ట్రా లాంచ్ అయింది. 30 రోజుల బ్యాటరీ లైఫ్, అమోల్డ్ డిస్ ప్లేతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.

Amazfit Balance Ultra

  • అమాజ్‌ఫిట్ స్మార్ట్‌వాచ్ బ్యాలెన్స్ అల్ట్రా లాంచ్
  • బాడీ గ్రేడ్ 5 టైటానియం, 3000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్
  • 1.5-అంగుళాల భారీ అమోల్డ్ డిస్‌ప్లే, 180కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు

Amazfit Ultra Smartwatch : కొత్త స్మార్ట్‌వాచ్ వచ్చేసింది. అమాజ్‌ఫిట్ కంపెనీ నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ బ్యాలెన్స్ అల్ట్రా లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌వాచ్‌లో కంపెనీ 1.5-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే అందిస్తుంది. 3000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 480×480 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది.

హై బ్రైట్ నెస్ కారణంగా డే టైమ్ కూడా డిస్‌ప్లే అద్భుతంగా కనిపిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌వాచ్ లాంగ్ బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది. సాధారణ వాడకంలో 30 రోజుల వరకు పనిచేస్తుంది. జీపీఎస్ మోడ్‌లో 50 గంటల వరకు పనిచేస్తుంది. ధర, ఇతర ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అమాజ్‌ఫిట్ ధర ఎంతంటే? :
చైనా మార్కెట్లో అమాజ్‌ఫిట్ బ్యాలెన్స్ అల్ట్రాను ప్రవేశపెట్టింది. ఐటీహోం ప్రకారం.. ఈ స్మార్ట్‌వాచ్ ధర 4,299 యువాన్లు (సుమారుగా రూ. 60వేలు) ఉంటుంది. జేడీ.కామ్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ప్రపంచ మార్కెట్లలో ఈ స్మార్ట్ వాచ్ ధర 600 డాలర్లు (సుమారుగా రూ. 56,500)గా ఉన్నట్లు సమాచారం. కంపెనీ అధికారిక గ్లోబల్ వెబ్‌సైట్‌లో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది.

అమాజ్‌ఫిట్ బ్యాలెన్స్ అల్ట్రా స్పెసిఫికేషన్లు :
అమాజ్‌ఫిట్ బ్యాలెన్స్ అల్ట్రా స్మార్ట్‌వాచ్‌లో 1.5-అంగుళాల భారీ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 3000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 480×480 పిక్సెల్స్ రిజల్యూషన్‌ అందిస్తుంది. హై బ్రైట్‌నెస్ కారణంగా, పగటి వెలుతురులో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ పేర్కొంది.

Read Also : Nothing B-Series : నథింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. నథింగ్ (b) సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది.. ఇండియాకు ఫస్ట్ టైమ్.. ఫుల్ డిటెయిల్స్..!

బాడీ గ్రేడ్ 5 టైటానియం మిశ్రమలోహంతో తయారైంది. సప్పైర్ క్రిస్టల్ గ్లాస్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ సైజు విషయానికి వస్తే 44.8mm, బరువు 57 గ్రాములు ఉంటుంది. కంపెనీ బ్లాక్, బ్లాక్ బ్రౌన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

అమాజ్‌ఫిట్ బ్యాలెన్స్ అల్ట్రా స్మార్ట్‌వాచ్ అనేక హెల్త్ ఫీచర్లతో వస్తుంది. 24×7 హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ మానిటరింగ్ సపోర్టు ఇస్తుంది. స్కిన్ టెంపరేచర్, స్ట్రెస్, స్లీప్ కూడా యనలైజ్ చేయగలదు. ఈ స్మార్ట్‌వాచ్‌ మహిళల హెల్త్ ట్రాకింగ్ ఫీచర్ కూడా అందిస్తుంది. ఈ వాచ్ 180కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, ఇంటర్నల్ జీపీఎస్ కూడా అందిస్తుంది.

బ్యాటరీ విషయానికి వస్తే.. అమాజ్‌ఫిట్ బ్యాలెన్స్ అల్ట్రాలో 780mAh బ్యాటరీ ఉంది. సింగిల్ ఛార్జ్‌పై 30 రోజుల వరకు రన్ అవుతుంది. ఎక్కువగా వాడితే 15 రోజుల బ్యాకప్‌ను అందిస్తుంది. జీపీఎస్ ట్రాకింగ్‌తో 50 గంటల వరకు వాడుకోవచ్చు. ఈ వాచ్ 10 ఏటీఎం వాటర్ రెసిస్టెంట్ కారణంగా కఠినమైన వాతావరణ పరిస్థితులలో కూడా అద్భుతంగా పనిచేయగలదు.