Amazon Great Freedom Sale : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఆసుస్ వివోబుక్ 15పై ఏకంగా రూ.10వేలకుపైగా తగ్గింపు!

Amazon Great Freedom Sale : కొత్త ల్యాప్‌టాప్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్.. ఆసూస్ వివోబుక్ 15 అతి చౌకైన ధరకే లభిస్తోంది. అమెజాన్ సేల్ ద్వారా ఇలా కొన్నారంటే ఏకంగా రూ.10వేలకు పైగా డిస్కౌంట్ పొందవచ్చు.

Asus Vivobook 15 price drop

  • అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు
  • ఈ సేల్ సమయంలో భారీగా తగ్గిన ఆసుస్ వివోబుక్ 15 ధర
  • 13వ జనరేషన్ కోర్ i5 ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB SSD

Amazon Great Freedom Sale : కొత్త ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? రూ. 60వేల బడ్జెట్‌లో మంచి ల్యాప్‌టాప్ కావాలంటే ఇదే బెస్ట్ డీల్.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ఆసుస్ వివోబుక్ 15 భారీ తగ్గింపుతో లభిస్తోంది.

180 డిగ్రీల లే-ఫ్లాట్ హింజ్, ఫిజికల్ వెబ్‌క్యామ్ ప్రైవసీ షీల్డ్‌తో వస్తుంది. మీ బడ్జెట్ ధరలోనే ఆసుస్ వివోబుక్ 15 లభిస్తుంది. ఈ సేల్ (Amazon Great Freedom Sale) సమయంలో కొన్నారంటే ఏకంగా రూ. 10వేలకు పైగా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఈ అదిరే డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో ధర ఎంతంటే? :
ఆసుస్ వివోబుక్ 15 సాధారణ ధర సుమారు రూ. 70వేలు ఉండగా, ప్రస్తుతం ధర రూ. 63,990కి తగ్గింది. ఈ మోడల్‌లో కోర్ i5 13వ జనరేషన్ 13420H, 16GB ర్యామ్, 512GB SSD ఉన్నాయి. అదనంగా, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ. 3వేలు బ్యాంక్ ఆఫర్‌ పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్ నెలకు రూ. 2,250 నుంచి ఈఎంఐ ద్వారా పొందవచ్చు. మీ దగ్గర పాత ల్యాప్‌టాప్ ఉంటే ఎక్స్చేంజ్ కూడా ఎంచుకోవచ్చు. రూ. 21,300 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : TCS Share Price : చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా.. టాటా షేర్లు ఢమాల్! ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా టెన్షన్

ఆసుస్ వివోబుక్ 15 కొనాలా? వద్దా? :
రోజువారీ వినియోగానికి బాగుంటుంది. ప్రత్యేకంగా ఆఫీస్ వర్క్, బ్రౌజింగ్, ఆన్‌లైన్ క్లాసులు, ఈజీ మల్టీటాస్కింగ్ కోసం ల్యాప్‌టాప్ చూస్తుంటే ఆసుస్ వివోబుక్ 15 బెస్ట్ ఆప్షన్. కీబోర్డ్ చాలా కంపర్ట్ ఉంటుంది. ఫుల్ సైజ్ నంబర్ ప్యాడ్ చాలా బాగుంది. ఈ డివైజ్ 1.7 కిలోల బరువు ఉంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.

HDMI, USB-C, USB-A హెడ్‌ఫోన్ జాక్‌తో కనెక్టివిటీ కూడా అద్భుతంగా ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే చాలా సూపర్.. కానీ, ఇందులో లో లెవల్ కాన్ఫిగరేషన్‌ కారణంగా మల్టీటాస్కింగ్‌ కోసం హెవీ అప్లికేషన్‌లను రన్ చేస్తే డివైజ్ కొంచెం స్లో అవ్వొచ్చు.

కాన్ఫిగరేషన్‌ బట్టి సుమారు 5 నుంచి 7 గంటల వినియోగంతో బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. రోజువారీ వినియోగం, ఈజీగా క్యారీ చేయడం, మంచి కీబోర్డ్‌ వంటివి కావాలంటే అసూస్ వివోబుక్ 15 కొనేసుకోవచ్చు.