×
Ad

Google Pixel 10 Pro : అమెజాన్‌లో అదిరిపోయే డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10ప్రోపై ఏకంగా రూ. 9వేలు తగ్గింపు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 10 Pro : గూగుల్ పిక్సెల్ 10 ప్రో భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలి? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Google Pixel 10 Pro (Image Credit To Original Source)

  • భారత్‌లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో రూ. 1,09,999 ప్రారంభ ధర
  • అమెజాన్‌లో ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ రూ.1,01,740కి అందుబాటులో
  • రూ.8,259 ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా

Google Pixel 10 Pro : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లతో సహా అనేక కేటగిరీలలో భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ సేల్ మీకోసమే..

గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ 10 ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రూ. 1,09,999కి లాంచ్ అయిన పిక్సెల్ 10 ప్రో ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 9వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్లతో లభిస్తోంది. అమెజాన్‌లో ఈ గూగుల్ పిక్సెల్ 10 ప్రో డీల్‌ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Google Pixel 10 Pro (Image Credit To Original Source)

గూగుల్ పిక్సెల్ 10 ప్రో అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 ప్రో రూ.1,09,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.1,01,740కి లిస్ట్ అయింది. రూ.8,259 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. వెయ్యి అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

Read Also : Union Budget 2026 : టాక్స్ పేయర్లకు అలర్ట్.. పన్ను విధానం, HRA నుంచి 80C వరకు.. 2025 కొత్త ఆదాయపు పన్ను చట్టంలో రాబోయే ప్రధాన మార్పులివే..!

గూగుల్ పిక్సెల్ 10 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10 ప్రో 6.3-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ 3,300 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇంకా, స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కవర్ ప్రొటెక్షన్‌తో వస్తుంది.

హుడ్ కింద.. ఈ స్మార్ట్‌ఫోన్ టెన్సర్ G5 చిప్‌సెట్, టైటాన్ M2 చిప్‌తో రన్ అవుతుంది. 16GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ 4,870mAh బ్యాటరీతో 30W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

కెమెరాల విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 10 ప్రోలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP వైడ్-యాంగిల్ లెన్స్, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్ విత్ మాక్రో ఫోకస్, 48 MP 5x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 42MP కెమెరా కూడా ఉంది.