Union Budget 2026 : టాక్స్ పేయర్లకు అలర్ట్.. పన్ను విధానం, HRA నుంచి 80C వరకు.. 2025 కొత్త ఆదాయపు పన్ను చట్టంలో రాబోయే ప్రధాన మార్పులివే..!
Union Budget 2026 : బడ్జెట్ 2026 నేపథ్యంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ఉంటుంది. కేంద్రం ప్రభుత్వం అనేక మార్పులను తీసుకురానుంది.
Union Budget 2026 (Image Credit To Original Source)
- కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి
- సెక్షన్లకు బదులుగా షెడ్యూల్ వ్యవస్థలో పన్ను మినహాయింపులు అందుబాటులోకి
- కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు ఆదాయంపై రాయితీ
Union Budget 2026 : పన్నుచెల్లింపుదారులకు బిగ్ న్యూస్.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ 2026కి ముందే బడ్జెట్ లో ఎలాంటి ప్రకటనలు, మినహాయింపులు ఉంటాయా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ఏప్రిల్ 1, 2026 అమల్లోకి వస్తుంది. అయితే, పాత ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలు చేస్తుంది. కొత్త చట్టం ఆగస్టు 2025లో రాష్ట్రపతి ఆమోదం పొందినప్పటికీ పూర్తిస్థాయిలో ఇంకా అమల్లోకి రాలేదు.
2026 బడ్జెట్‌లో ఏమైనా పన్ను విధాన మార్పులు ప్రకటిస్తే.. ఈసారి ప్రభుత్వం కొత్త ఆదాయ పన్ను చట్టం 2025ను సవరించే అవకాశం కనిపిస్తోంది. రద్దు చేసిన 1961 పాత చట్టాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే.. పాత చట్టం దశాబ్దాలుగా అమల్లో ఉండగా ఈ ఆకస్మిక మార్పు ఎందుకు? ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
వాస్తవానికి ఆదాయ పన్ను చట్టం 1961 ఏప్రిల్ 1, 2026 నుంచి పూర్తిగా రద్దు కానుంది. ఇప్పుడు దీని స్థానంలో ఏప్రిల్ 2025 కొత్త పన్ను చట్టం అమలు అవుతుంది. ఈ కొత్త చట్టం 2025 ఆగస్టులో ఆమోదం పొందింది. కానీ, ఇంకా అమల్లో రాలేదు. అందుకే బడ్జెట్ 2026లో పాత చట్టాన్ని సవరించే పరిస్థితి లేదు.
1961 నుంచి 2025 వరకు షెడ్యూల్ వ్యవస్థలో మార్పులు :
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025లో పన్ను మినహాయింపులు, డిడెక్షన్లు వివిధ కేటగిరీల్లో అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా 80C, 80D, HRA, LTA వంటివి ఉండగా.. 2025 చట్టం షెడ్యూల్డ్ వ్యవస్థకు మార్చేసింది.
ఉదాహరణకు.. పన్ను ఆదా పెట్టుబడులు, NPS, మెడిక్లెయిమ్ వంటి డిడెక్షన్లు ఇప్పడు షెడ్యూల్ లిస్ట్ అయ్యాయి. ప్రత్యేక సెక్షన్ల ద్వారానే అమలు చేస్తోంది ప్రభుత్వం. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 115BAC 2025 చట్టం ప్రయోజనాలను రద్దు చేయదు. కేవలం భవిష్యత్తులో బడ్జెట్ సడలింపులను డీకోడ్ చేసేందుకు వీలుంటుంది అంతే..
జీతాలపై వచ్చే ఆదాయం :
1961 చట్టం ప్రకారం.. జీతానికి సంబంధించి అనేక ఉపశమనాలు లభించాయి. అందులో సెక్షన్ 10, 16, సెక్షన్ 17లో వేర్వేరుగా ఉన్నాయి. అయితే వీటిన్నింటిని 2025 చట్టంలో సెక్షన్ 19 కిందికి తీసుకొచ్చింది.
జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు సంబంధించి దాదాపు అన్ని డిడెక్షన్లు, మినహాయింపుల్లో ముఖ్యంగా స్టాండర్డ్ డిడెక్షన్, గ్రాట్యూటీ కమ్యూటెడ్ పెన్షన్, లీవ్ ఎన్ క్యాష్ మెంట్, రిట్రెంటచ్ మెంట్ కంపాన్సేషన్, స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజాలు ఉంటాయి.
HRA, LTA అలవెన్సుల్లో మినహాయింపులు :
ఇంటి అద్దె భత్యం (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) వంటి మినహాయింపులు అందుబాటులో ఉంటాయి. కానీ, ఇప్పుడు షెడ్యూల్ IIIలో లిస్టు అయ్యాయి. కానీ, నిబంధనలకు సంబంధించి సెక్షన్లకు బదులుగా షెడ్యూల్‌లు, నిబంధనల ద్వారా అమలు అవుతాయి. వ్యక్తిగత ఖర్చులకు సంబంధించిన ప్రత్యేక భత్యాలు కూడా ఈ షెడ్యూల్ వ్యవస్థ పరిధిలోకి వస్తాయి.
గృహ రుణ వడ్డీ, కొత్త పన్ను విధానం :
గృహ నిర్మాణ సంబంధిత పన్ను రాయితీలకు బడ్జెట్‌లో ఎక్కువగా ప్రధాన్యత ఉంటుంది. 2025 చట్టం ప్రకారం.. రాయితీలు ఎక్కువగా ఉండవు. గతంలో సెక్షన్ 24(b) కింద గృహ రుణాలలపై వడ్డీ మినహాయింపు అనేది ఇకపై సెక్షన్ 22లో ఉంటుంది. రూ. 2 లక్షల పరిమితి వంటివి అన్ని ఉంటాయి. ప్రస్తుతం సెక్షన్ 115BAC కింద ఉన్న కొత్త పన్ను విధానం 2025 చట్టానికి అనుగుణంగా ఉంటుంది.

Union Budget 2026 (Image Credit To Original Source)
రిబేట్ సిస్టమ్ కూడా మారిందా? :
కొత్త చట్టం ప్రకారం.. రిబేట్ సిస్టమ్ కూడా మార్చారు. కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు ఆదాయంపై రాయితీలను అందిస్తుంది. పాత విధానం రూ. 5 లక్షల వరకు ఆదాయంపై రాయితీలను అందిస్తుంది. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది.
పాత పన్ను విధానం vs కొత్త పన్ను విధానం :
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు పాత పన్ను విధానం, పాత చట్టంలోని సెక్షన్ 115BAC కింద రాయితీతో కూడిన కొత్త విధానం మధ్య ఎంపిక 2025 చట్టంలోని సెక్షన్ 202 కింద మారదు. దాదాపు ఒకే విధంగా ఉంటుంది.
షెడ్యూల్ III, XVలలో ఉన్న HRA, LTA, చాప్టర్ VI-A డిడెక్షన్లతో సహా చాలా మినహాయింపులపై తక్కువ స్లాబ్ రేట్లు ఉంటాయి. కొత్త విధానంలో పాత చట్టంలోని సెక్షన్ 87A (కొత్త చట్టంలోని సెక్షన్ 156) కింద రూ.12 లక్షల ఆదాయం వరకు పెరిగిన రాయితీని అందిస్తుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే.. పన్ను చెల్లింపుదారులకు పాత పన్ను విధానం మారింది అంతే.. అయితే, చాలా మినహాయింపులు, ప్రయోజనాలు అలాగే ఉంటాయి. ఇందులో ఒక తేడా ఏమిటంటే.. ఆదాయపు పన్ను అనేది ఇప్పుడు కొత్త నియమాలు, కొత్త షెడ్యూల్ కింద అమలు అవుతుంది.
