Smart TV Offers
Smart TV Offers : కొత్త టీవీ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన డిస్కౌంట్లు.. టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూసేవారు అయితే వెంటనే ఈ 65 అంగుళాల భారీ టీవీల్లో ఏదైనా కొనేసుకోండి. పెద్ద స్క్రీన్‌లో సినిమా థియేటర్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్రస్తుతం 65-అంగుళాల స్మార్ట్ టీవీలపై అద్భుతమైన ఆఫర్లు, అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తున్నాయి.
ప్రస్తుతం వాలెంటైన్స్ డే సేల్ నడుస్తోంది. ఈ సేల్ సమయంలో అనేక సరసమైన ధరలకు టాప్-బ్రాండ్ టీవీలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన టీవీని కొనేసుకోండి. ఏ టీవీ ధర ఎంత అనేది ఇప్పుడు పరిశీలిద్దాం..
శాంసంగ్ 65-అంగుళాల స్మార్ట్ టీవీ :
ఈ శాంసంగ్ టీవీ భారీ 65-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. మీరు ఇప్పుడు అమెజాన్‌లో 29 శాతం తగ్గింపుతో రూ. 60,990కి కొనుగోలు చేయవచ్చు. మీరు యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించి రూ. 1,250 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అనేక ఓటీటీ యాప్స్, మల్టీ కనెక్టివిటీ ఆప్షన్లకు యాక్సెస్ అందిస్తుంది. ఇంకా, అద్భుతమైన వీడియో, ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
హిస్సెన్స్ 65-అంగుళాల అల్ట్రా HD (4K) ఎల్ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ :
ఈ హైసెన్స్ బ్రాండ్ టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 46శాతం వరకు తగ్గింపుతో లభ్యమవుతోంది. డిస్కౌంట్ తర్వాత ధర రూ. 42,999కే లభిస్తోంది. అయితే, బ్యాంక్ ఆఫర్లు, ఈఎంఐ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే.. ఈ 4K ఎల్ఈడీ స్మార్ట్ టీవీ అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. మీ బెడ్‌రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
ఎల్‌జీ 65-అంగుళాల UA82 సిరీస్ 4K :
ఈ ఎల్‌జీ స్మార్ట్ టీవీ ప్రస్తుతం అమెజాన్‌లో అద్భుతమైన డీల్‌తో లభిస్తోంది. ఈ టీవీని రూ. 62,990కి కొనుగోలు చేయవచ్చు. మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్లపై రూ. 1,500 తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ టీవీ థియేటర్ మాదిరిగా 4K వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
సోనీ బ్రావియా 2 65-అంగుళాల అల్ట్రా HD :
సోనీ ప్రీమియం బ్రాండ్ టీవీ కూడా ఉంది. మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ టీవీ కొనుగోలుపై 45శాతం తగ్గింపు పొందవచ్చు. ధర రూ. 69,990కి తగ్గుతుంది. BOBCARD ఈఎంఐ, యశ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా ఈ టీవీపై అదనంగా రూ. 1,500 తగ్గింపు కూడా పొందవచ్చు.