Apple Days Sale 2025 : ఆపిల్ డేస్ సేల్.. ఐఫోన్లు, మ్యాక్‌బుక్, ఆపిల్ వాచ్‌లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఈ బిగ్ డీల్స్ పొందాలంటే?

Apple Days Sale 2025 : విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్ సందర్భంగా ఐఫోన్‌లు, మ్యాక్‌బుక్‌లు, ఐప్యాడ్‌లు, వేరబుల్ డివైజ్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది.

Apple Days Sale 2025 : ఆపిల్ డేస్ సేల్.. ఐఫోన్లు, మ్యాక్‌బుక్, ఆపిల్ వాచ్‌లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఈ బిగ్ డీల్స్ పొందాలంటే?

Apple Days Sale 2025

Updated On : May 24, 2025 / 12:16 PM IST

Apple Days Sale 2025 : విజయ్ సేల్స్ ఆపిల్ డేస్ సేల్ మే 24 నుంచి ప్రారంభమైంది. జూన్ 1, 2025 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. ఈ సేల్‌లో లేటెస్ట్ ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్‌లు, ఆపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

Read Also : Samsung Galaxy Z Fold 6 : అమెజాన్‌ బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్.. ఇలా కొంటే తక్కువ ధరకే..!

ఆసక్తిగల వినియోగదారులు ICICI, Axis, Kotak Mahindra బ్యాంక్ కార్డులతో రూ. 10వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు.

ఆపిల్ డేస్ సేల్ : ఆఫర్లు, డిస్కౌంట్లు :
మీరు స్టోర్‌లో షాపింగ్ చేసినా లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసినా, విజయ్ సేల్స్ అనేక బ్యాంక్ డిస్కౌంట్లు మరియు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలతో పాటు ఆకర్షణీయమైన ధరకు పరికరాలను అందిస్తున్నట్లు పేర్కొంది.

ఐఫోన్ ఆఫర్లు : ధరలు, బ్యాంక్ డిస్కౌంట్లు :

  • ఐఫోన్ 16 (128GB స్టోరేజ్) రూ.66,990 మాత్రమే
  • ఐఫోన్ 16 ప్లస్ (128GB స్టోరేజ్) రూ.74,990
  • ఐఫోన్ 16 ప్రో (128GB) రూ.103,990
  • ఐఫోన్ 16 ప్రో మాక్స్ (256GB) రూ.1,27,650
  • ఐఫోన్ 16e (128GB) రూ. 47,990
  • ఐఫోన్ 15 రూ.58,490 నుంచి
  • ఐఫోన్ 15 ప్లస్ రూ.66,990 నుంచి
  • ఐఫోన్ 13 బడ్జెట్-ఫ్రెండ్లీ ధర రూ.43,790

ICICI, Axis, Kotak Mahindra బ్యాంక్ కార్డుల ద్వారా రూ.4వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. విజయ్ సేల్స్ స్టోర్లలో వినియోగదారులు రూ.7,500 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను కూడా పొందవచ్చు.

మ్యాక్‌బుక్ ఐప్యాడ్ డీల్స్.. విద్యార్థులకు ప్రత్యేకం :
కొత్త ఐప్యాడ్ అప్‌గ్రేడ్ కోసం చూస్తున్నారా? మీరు విద్యార్థి లేదా ప్రొఫెషనల్ అయితే, లిమిటెడ్ సేల్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

  • ఐప్యాడ్ 11వ జనరేషన్ రూ. 30,200కు లభిస్తుంది.
  • ఐప్యాడ్ ఎయిర్ రూ. 52,400కు లభిస్తుంది.
  • ఐప్యాడ్ ప్రో రూ.89,400కు లభిస్తుంది.
  • M4 చిప్‌తో మ్యాక్‌బుక్ ప్రో రూ.1,45,900కి లభిస్తుంది.
  • M4 ప్రో వేరియంట్ రూ. 1,72,400కు, M4 మ్యాక్స్ రూ. 2,78,900కు లభిస్తుంది.
  • M2, M4 చిప్‌లతో మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్ మే 25న స్పెషల్ ధరలకు పొందవచ్చు.

వేరబుల్, ఆడియో : ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ :

  • ఆపిల్ వాచ్ సిరీస్ 10 : రూ. 40,600 నుంచి
  • ఆపిల్ వాచ్ SE 2వ జనరేషన్ : రూ. 20,900 నుంచి
  • ఆపిల్ వాచ్ అల్ట్రా 2 : రూ.79,700 నుంచి
  • ఎయిర్ ప్యాడ్స్ 4 : రూ. 10,900 | ANCతో రూ. 15వేలు
  • ఎయిర్‌పాడ్స్ ప్రో 2 : రూ. 20,900, బీట్స్ రేంజ్ రూ. 5,500 నుంచి ప్రారంభం

బ్యాంక్ కార్డులతో అన్ని గాడ్జెట్లపై రూ. 3వేలు లేదా అంతకన్నా ఎక్కువ ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు పొందవచ్చు.

  • బోనస్ ఆఫర్లు, లాయల్టీ పాయింట్లు :
  • ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 10వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌
  • డెమో, ఓపెన్-బాక్స్ యూనిట్లపై ప్రత్యేక ధరలు
  • ప్రొటెక్ట్+ వారంటీ ప్లాన్‌లపై 20 శాతం వరకు తగ్గింపు
  • MyVS లాయల్టీ పాయింట్లు 0.75 శాతం వరకు

Read Also : Aadhaar Update : ఆధార్ అప్‌డేట్ చేసుకున్నారా? ఈ తేదీలోపు ఆన్‌లైన్‌లో ఫ్రీగా అప్‌డేట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

షాపింగ్ ఎక్కడ చేయాలి :
మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఏ మోడ్‌నైనా ఎంచుకోవచ్చు. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా అందుబాటులో ఉన్న 150+ రిటైల్ అవుట్‌లెట్‌లలో కొనుగోలు చేయొచ్చు.