Aadhaar Update : ఆధార్ అప్‌డేట్ చేసుకున్నారా? ఈ తేదీలోపు ఆన్‌లైన్‌లో ఫ్రీగా అప్‌డేట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Aadhaar Update : ఆధార్ కార్డు అప్‌డేట్ చేయలేదా? జూన్ 14వ తేదీలోగా మీ ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసం..

Aadhaar Update : ఆధార్ అప్‌డేట్ చేసుకున్నారా? ఈ తేదీలోపు ఆన్‌లైన్‌లో ఫ్రీగా అప్‌డేట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

Aadhaar Update

Updated On : May 24, 2025 / 11:34 AM IST

Aadhaar Update : మీ ఆధార్ అప్‌డేట్ చేసుకున్నారా? లేదంటే ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ (Aadhaar Update) వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే వీలుంది.

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జూన్ 14, 2025 వరకు మాత్రమే ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసే అవకాశాన్ని అందిస్తోంది. ఈ గడువు దాటితే రూ. 50 నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

వినియోగదారులు ఇళ్ల నుంచే (myAadhaar) పోర్టల్‌లో తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ రిజిస్టర్, అప్‌డేట్ నిబంధనలు 2016 ప్రకారం.. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆధార్‌లో ఐడెంటిటీ ప్రూఫ్ (PoI), అడ్రస్ ప్రూఫ్ (PoA)ను అప్‌డేట్ చేయడం తప్పనిసరి. ఆధార్ అప్‌డేట్ ఆన్‌లైన్‌లో ఎలా చేయవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆధార్ అప్‌‌డేట్ చేసే వివరాలివే :
ఆధార్ కార్డులో జనాభా వివరాలను మాత్రమే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లను సందర్శించాల్సిన అవసరం ఉండదు. పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, లింగం, లాంగ్వేజీ వంటి వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్ స్కాన్లు, పాస్‌ఫొటోలు వంటి బయోమెట్రిక్ వివరాలను ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ ద్వారా మాత్రమే అప్‌‌డేట్ చేయొచ్చు. వినియోగదారులు UIDAI వెబ్‌సైట్‌లో రీజియన్ పిన్ కోడ్‌ను ఎంటర్ చేసి సమీప ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లను తెలుసుకోవచ్చు.

ఆధార్ ఎలా అప్‌డేట్ చేయాలి? :
మీ ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసేందుకు ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.

  • UIDAI అధికారిక వెబ్‌సైట్‌ (https://myaadhaar.uidai.gov.in)ను విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో, బ్లూ కలర్ లాగిన్ ట్యాబ్‌ ట్యాప్ చేయాలి.
  • ఆధార్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయండి.
  • వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వస్తుంది.
  • OTP ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
  • కరంట్ అడ్రస్, ఐడెంటిటీ ప్రూఫ్ అప్‌డేట్ చేశారో లేదో చెక్ చేయండి.
  • అప్‌డేట్ కాకపోతే పేజీ రైట్ టాప్ కార్నర్‌లో ఉన్న “Document Upload” ఆప్షన్ క్లిక్ చేయండి.
  • మీరు అప్‌డేట్ చేసే వివరాలను డ్రాప్-డౌన్ మెనుపై క్లిక్ చేసి అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  • మీ డాక్యుమెంట్లను రివ్యూ చేసి Submit చేయండి.
  • మీ రిక్వెస్ట్ ట్రాక్ చేసేందుకు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN) వస్తుంది.