Samsung Galaxy Z Fold 6 : అమెజాన్‌ బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్.. ఇలా కొంటే తక్కువ ధరకే..!

Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. అమెజాన్‌లో అద్భుతమైన ఈ డీల్ అసలు మిస్ చేయొద్దు.

Samsung Galaxy Z Fold 6 : అమెజాన్‌ బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్.. ఇలా కొంటే తక్కువ ధరకే..!

Samsung Galaxy Z Fold 6

Updated On : May 24, 2025 / 10:56 AM IST

Samsung Galaxy Z Fold 6 : కొత్త ఫోల్డబుల్ ఫోన్ కావాలా? శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ భారీగా తగ్గింది. ఈ శాంసంగ్ మడతబెట్టే (Samsung Galaxy Z Fold 6) ఫోన్ అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. రూ. 32వేల కన్నా తగ్గింపుతో ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు.

Read Also : Vivo V30 : వివో లవర్స్ డోంట్ మిస్.. వివో V30 ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. ఇప్పుడే కొనేసుకోండి!

అమెజాన్‌లో అద్భుతమైన డీల్ :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ రూ.1,64,999 ధరకు లభిస్తుంది. అమెజాన్‌లో శాంసంగ్ ఫోన్ రూ.1,34,799 ధరకు లిస్ట్ అయింది. రూ.30,200 ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది.

ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.2వేలు తగ్గింపు, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.2,750 తగ్గింపు పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడింగ్ ద్వారా ఎక్కువ సేవ్ చేయొచ్చు.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6లో 7.6-అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 6.3-అంగుళాల కవర్ స్క్రీన్ ఉన్నాయి. రెండు డిస్‌ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్‌తో డైనమిక్ అమోల్డ్ 2X ప్యానెల్‌లు కలిగి ఉన్నాయి.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌, OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్ స్టైలిష్ డిజైన్, మల్టీ టాస్కింగ్ ఫీచర్లతో వస్తుంది.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ కలిగి ఉంది.

Read Also : EPFO Fund Transfer : ఉద్యోగులకు EPFO బిగ్ రిలీఫ్.. ఇకపై పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చాలా ఈజీ.. క్లెయిమ్ రిజెక్ట్ టెన్షన్ అక్కర్లేదు..!

25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4400mAh డ్యూయల్ బ్యాటరీని కలిగి ఉంది. ఏఐ ఆధారిత ఫీచర్లలో సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్, ఇన్‌స్టంట్ స్లో-మో, స్కెచ్ టు ఇమేజ్ వంటివి ఉన్నాయి.