EPFO Fund Transfer : ఉద్యోగులకు EPFO బిగ్ రిలీఫ్.. ఇకపై పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చాలా ఈజీ.. క్లెయిమ్ రిజెక్ట్ టెన్షన్ అక్కర్లేదు..!

EPFO Fund Transfer : ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్‌లో ఎదురయ్యే సమస్యకు ఈపీఎఫ్ఓ అద్భుతమైన పరిష్కారాన్ని అందించింది.

EPFO Fund Transfer : ఉద్యోగులకు EPFO బిగ్ రిలీఫ్.. ఇకపై పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చాలా ఈజీ.. క్లెయిమ్ రిజెక్ట్ టెన్షన్ అక్కర్లేదు..!

EPFO Fund Transfer

Updated On : May 23, 2025 / 5:57 PM IST

EPFO Fund Transfer : ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) బిగ్ రిలీఫ్ అందించింది. పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ మరింత సులభతరం చేసింది.

తరచుగా ఉద్యోగాలు మారేవారికి  ఈపీఎఫ్ఓ అద్భుతమైన పరిష్కారాన్ని అందించింది. ఇకపై ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారిన సమయంలో పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

Read Also : Nothing Phone 2 : అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2పై దుమ్మురేపే డిస్కౌంట్.. సరసమైన ధరకే ఇలా కొనేసుకోండి..!

ఒకే సర్వీసు పీరియడ్ రెండు కంపెనీల్లో ఉన్నప్పుడు పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ ఆటోమాటిక్‌గా రిజెక్ట్ అయ్యేవి. ఇలాంటి సమస్యకు ఈపీఎఫ్ఓ చెక్ పెట్టేసింది. ఇందులో భాగంగా కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈపీఎఫ్ఓ సర్క్యులర్‌ ప్రకారం.. పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియను ఎలాంటి ఆలస్యం లేకుండా చాలా ఈజీగా ఉంటుంది.

ఈపీఎఫ్ఓ క్లారిటీ :
ఒకే సర్వీసు పీరియడ్ ఉన్నప్పటికీ పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ రిజెక్ట్ కాదని ఈపీఎఫ్ఓ క్లారిటీ ఇచ్చింది. ఓవర్ ల్యాపింగ్ ఎప్పుడూ మోసం కాదని, ఏదైనా కారణాల వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురైనా పీఎఫ్ బదిలీ క్లెయిమ్ ఆటోమేటిక్‌గా రిజెక్ట్ చేయకుండా ఈజీగా ప్రాసెస్ చేయనున్నట్టు ఈపీఎఫ్ఓ పేర్కొంది.

ఓవర్‌ల్యాపింగ్ సర్వీస్ పీరియడ్స్ ఉన్నా ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్‌ రిజెక్ట్ చేయొద్దని రీజనల్ ఆఫీసులకు సూచనలు చేసింది. పాత పీఎఫ్ అకౌంట్‌ కలిగిన కంపెనీలు ఓవర్‌ల్యాప్ అయినా క్లెయిమ్‌లను తిరస్కరించరాదు. అనుమానాస్పదంగా ఉన్న సందర్భాలలో మాత్రమే రీజనల్ ఆఫీసులు దరఖాస్తుదారు, యజమాని నుంచి వివరణ తీసుకోవాల్సి ఉంటుంది.

సర్వీస్ ఓవర్‌ల్యాపింగ్ పీరియడ్ ఏంటి? :
ఒకే సమయంలో రెండు కంపెనీల్లో సర్వీసు పీరియడ్ ఉన్నప్పుడు ఈ ఓవర్ ల్యాపింగ్ సమస్య ఎదురువుతుంది. వాస్తవానికి ఇది మోసం కాదు.

సాంకేతిక లోపం లేదా పొరపాటు కారణంగా ఈపీఎఫ్ఓ ఇలాంటి క్లెయిమ్‌లను నేరుగా తిరస్కరించేది. చాలా సార్లు, ఒకే సర్వీస్ వ్యవధిలో వేర్వేరు కంపెనీలతో రెండు EPF అకౌంట్లను కలిగి ఉంటే ఇలా జరుగుతుంది.

సర్వీస్ ఓవర్‌ల్యాపింగ్ కారణాలివే :
పీఎఫ్ సర్వీసు ఓవర్‌ల్యాపింగ్ జరగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. గుర్తుతెలియని పీఎఫ్ అకౌంట్ UANలో పొరపాటున యాడ్ చేయడం, కంపెనీ రికార్డులలో తప్పుగా తేదీలు ఉండటం, అధికారిక రిజైన్ లేకుండా ఉద్యోగాన్ని మానేసి కొత్త ఉద్యోగంలో చేరడం, పాత కంపెనీ అబ్ స్కాండింగ్ అని చూపడం వంటి కారణాలతో క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది.

పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ ఏంటి? :
జాబ్ మారినప్పుడు పాత కంపెనీలో డిపాజిట్ అయిన పీఎఫ్ డబ్బును కొత్త కంపెనీ అకౌంటుకు ట్రాన్స్ ఫర్ చేయాలి. ఈ ప్రక్రియను పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ అంటారు. పాత పీఎఫ్ ఆఫీసులు పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌‌ఫర్ సజావుగా జరిగేలా సర్క్యులర్‌లో వివరించిన విధంగా వెరిఫికేషన్ చేయాలి.

Read Also : Vivo V30 : వివో లవర్స్ డోంట్ మిస్.. వివో V30 ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే.. ఇప్పుడే కొనేసుకోండి!

క్లెయిమ్‌ను అప్రూవల్ ఇచ్చే ముందు ఉద్యోగి వివరాలను పూర్తిగా వెరిఫై చేయాలి. అప్పుడు కొత్త పీఎఫ్ అకౌంట్ కలిగిన కంపెనీ ఆ క్లెయిమ్ రిజెక్ట్ చేయాల్సిన పని ఉండదని సర్క్యులర్‌లో ఈపీఎఫ్ఓ పేర్కొంది.