Nothing Phone 2 : అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2పై దుమ్మురేపే డిస్కౌంట్.. సరసమైన ధరకే ఇలా కొనేసుకోండి..!
Nothing Phone 2 : అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. నథింగ్ ఫోన్ 2పై దుమ్మురేపే డిస్కౌంట్ అందిస్తోంది. అత్యంత సరసమైన ధరకే ఎలా పొందాలంటే?

Nothing Phone 2
Nothing Phone 2 : నథింగ్ ఫోన్ 2 ధర భారీగా తగ్గింది. నథింగ్ ఫోన్ 3 అతి త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ (Nothing Phone 2) రాక ముందే అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2 సరసమైన ధరకే లభ్యమవుతోంది. 2023లో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 2 స్పెషల్ ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది.
లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ అయినప్పటికీ అతి తక్కువ ధరలోనే కొనేసుకోవచ్చు. అమెజాన్ ఈ నథింగ్ ఫోన్ 2పై రూ. 15వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది.
నథింగ్ ఫోన్ 2 లాంచ్ ధర రూ.44,999 ఉండగా, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, క్లీన్ యూఐ, కర్వ్డ్ OLED డిస్‌ప్లేతో వస్తుంది. బ్యాక్ ప్యానెల్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ నథింగ్ 2 ఫోన్ రూ.29వేల కన్నా తక్కువ ధరకు ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
నథింగ్ ఫోన్ 2 ధర తగ్గింపు :
ప్రస్తుతం అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2 కేవలం రూ.30,998కే అందుబాటులో ఉంది. లాంచ్ ధరపై రూ.14,002 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.2వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
నథింగ్ ఫోన్ 2 ధర రూ.28,998కి తగ్గుతుంది. పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి రూ.28వేల వరకు ఎక్స్ఛేంజ్ పొందవచ్చు. నెలకు రూ.1,503 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.
నథింగ్ ఫోన్ 2 స్పెసిఫికేషన్లు :
6.7-అంగుళాల LTPO OLED FHD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, 12GB వరకు ర్యామ్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది.
Read Also : Lava Shark 5G : లావా షార్క్ 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ఈ బడ్జెట్ ఫోన్ అతి చౌకైన ధరకే.. డోంట్ మిస్..!
45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీ అమర్చారు. నథింగ్ ఫోన్ 2 బ్యాక్ సైడ్ 50MP (f/1.88) ప్రైమరీ సెన్సార్, 50MP (f/2.2) సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా, f/2.45 ఎపర్చర్‌తో సింగిల్ 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.