Reliance Jio : జియో యూజర్లకు పండగే.. 5 కొత్త ప్రీపెయిడ్ గేమింగ్ ప్లాన్లు ఇవే.. జియోగేమ్స్ క్లౌడ్ ఫ్రీగా పొందొచ్చు..!

Reliance Jio : జియో గేమింగ్ యూజర్ల కోసం 5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. జియోగేమ్స్ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది.

Reliance Jio : జియో యూజర్లకు పండగే.. 5 కొత్త ప్రీపెయిడ్ గేమింగ్ ప్లాన్లు ఇవే.. జియోగేమ్స్ క్లౌడ్ ఫ్రీగా పొందొచ్చు..!

Reliance Jio Recharge

Updated On : May 23, 2025 / 2:36 PM IST

Reliance Jio : రిలయన్స్ జియో గేమింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారత్‌లో మొబైల్ గేమింగ్ క్రేజ్ పెరుగుతోంది. రిలయన్స్ జియో తమ యూజర్లను ఆకట్టుకునేందుకు 5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

Read Also : Xiaomi YU7 electric : షావోమీ YU7 ఎలక్ట్రిక్ ఫస్ట్ SUV కారు అదుర్స్.. సింగిల్ ఛార్జ్‌తో 835 కి.మీ దూసుకెళ్లగలదు.. ఫుల్ డిటెయిల్స్..!

కంపెనీ గేమింగ్ ఫోకస్డ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు.. జియోగేమ్స్ క్లౌడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తోంది.

ఇకపై ఎలాంటి హై-ఎండ్ డివైజ్ కొనుగోలు చేయాల్సిన పనిలేదు. మీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేదా సెట్-టాప్ బాక్స్‌లో నేరుగా హై క్వాలిటీ గేమ్స్ ఆడుకోవచ్చు.

జియోగేమ్స్ క్లౌడ్ ఏంటి? :
జియోగేమ్స్ క్లౌడ్ అనేది క్లౌడ్ ఆధారిత గేమింగ్ ప్లాట్‌ఫామ్. గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోకుండానే స్ట్రీమింగ్ ద్వారా నేరుగా గేమ్స్ ఆడుకోవచ్చు. హై క్వాలిటీతో గేమ్‌లను PC, స్మార్ట్‌ఫోన్, జియో STB (సెట్ టాప్ బాక్స్)లో రన్ చేయవచ్చు.

ఈ సర్వీసు ప్రో పాస్ రూ. 398 ధరతో పొందవచ్చు. వ్యాలిడిటీ 28 రోజులు. కానీ, జియో కొత్త ప్లాన్లలో ఈ సబ్‌స్క్రిప్షన్ ఇప్పుడు ఫ్రీగా అందిస్తోంది.

జియో రూ.48 ప్లాన్ :
గేమింగ్‌ ఇష్టపడే జియో యూజర్లు (Reliance Jio) తక్కువ ఖర్చుతో ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు.
డేటా: 10MB

జియోగేమ్స్ క్లౌడ్ వ్యాలిడిటీ : 3 రోజులు
డేటా వోచర్ మాత్రమే.. మీ నంబర్‌లో ఇప్పటికే రీఛార్జ్ ప్లాన్ ఉంటే నేరుగా యాక్టివేట్ అవుతుంది.

జియో రూ.98 ప్లాన్ :
ఈ ప్లాన్‌తో 7 రోజుల పాటు క్లౌడ్ గేమింగ్‌, ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
డేటా: 10MB

జియోగేమ్స్ క్లౌడ్ వ్యాలిడిటీ : 7 రోజులు
డేటా వోచర్, యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్‌పై మాత్రమే రన్ అవుతుంది.

జియో రూ.298 ప్లాన్ :
మీరు నెల మొత్తం గేమ్ ఆడాలని ప్లాన్ చేస్తుంటే ఈ ప్యాక్ సరిపోతుంది.

డేటా : 3GB
జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ : 28 రోజుల వరకు
ఒక డేటా వోచర్, బేస్ ప్లాన్ తప్పనిసరి.

జియో రూ.495 ప్లాన్ :
ఈ ప్లాన్‌లో గేమింగ్ మాత్రమే కాకుండా వీడియో స్ట్రీమింగ్, లైవ్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి.

డేటా : రోజుకు1.5GB + 5GB బోనస్
కాలింగ్, SMS: అన్‌లిమిటెడ్ + రోజుకు 100 SMS
ఫ్రీ సబ్ స్క్రిప్షన్లు : జియోగేమ్స్ క్లౌడ్ : 28 రోజులు, జియోసినిమా (హాట్‌స్టార్ మొబైల్), ఫ్యాన్‌కోడ్ (28 రోజులు), జియోటీవీ, జియోఏఐక్లౌడ్.

జియో రూ.545 ప్లాన్ :
ఎక్కువ డేటా, ఫుల్ స్పీడ్ కోరుకునే యూజర్రలకు బెస్ట్ ఆప్షన్.
డేటా : 2GB/రోజు + 5GB బోనస్
5G డేటా : అన్‌లిమిటెడ్

Read Also : Google Pixel 9 Pro XL : అదిరిపోయే ఆఫర్.. రూ. 20వేలు తగ్గిన పిక్సెల్ 9 ప్రో XL ఫోన్.. ఇంకా తక్కువ ధరకే కావాలంటే?

జియోగేమ్స్ క్లౌడ్ (28 రోజులు), Hotstar Mobile, FanCode, JioTV, JioAICloud, కాలింగ్ + SMS బెనిఫిట్స్ పొందవచ్చు.