iPhone 16 Plus
iPhone 16 Plus : ఆపిల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మీరు కొత్త ఐఫోన్ కొనాలని చూస్తుంటే ఇంత కన్నా బెస్ట్ టైం ఉండదు. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ (iPhone 16 Plus) భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.
తద్వారా ఐఫోన్ 16 ప్లస్ ధరను రూ.11,900 కన్నా తగ్గుతుంది. మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే ఇప్పుడే చేసుకోండి. ఈ ఐఫోన్ డీల్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఐఫోన్ 16 ప్లస్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలంటే?
ఐఫోన్ 16 ప్లస్ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 ప్లస్ రూ. 89,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ధర రూ. 81,990కు అందిస్తోంది. ఈ ఐఫోన్‌పై నేరుగా రూ. 7,910 డిస్కౌంట్ అందిస్తోంది. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్, యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, కోటాక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : Samsung Galaxy S24 Ultra 5G : శాంసంగ్ ఫోన్లలో ఈ అల్ట్రా 5G రేంజ్ వేరబ్బా.. అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకే..
ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (iPhone 16 Plus) :
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ ఫోన్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఆపిల్ A18 చిప్‌పై రన్ అవుతుంది. అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. ఈ ఐఫోన్‌లో 48MP మెయిన్ సెన్సార్, బ్యాక్ సైడ్ 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఇంకా, ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ IP68 రేటింగ్‌తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. కంపెనీ ప్రకారం.. 27 గంటల వరకు ఐఫోన్ 16 ప్లస్ వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.