Samsung Galaxy S24 Ultra 5G : శాంసంగ్ ఫోన్లలో ఈ అల్ట్రా 5G రేంజ్ వేరబ్బా.. అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకే..

Samsung Galaxy S24 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో ఈ శాంసంగ్ అల్ట్రా 5G ఫోన్ డిస్కౌంట్ ధర రూ. 82వేల 500 వద్ద లభిస్తోంది.

Samsung Galaxy S24 Ultra 5G : శాంసంగ్ ఫోన్లలో ఈ అల్ట్రా 5G రేంజ్ వేరబ్బా.. అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకే..

Samsung Galaxy S24 Ultra 5G

Updated On : June 6, 2025 / 5:02 PM IST

Samsung Galaxy S24 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ కొనేందుకు (Samsung Galaxy S24 Ultra 5G) ఇదే బెస్ట్ టైమ్.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ గెలాక్సీ 5G ఫోన్ రూ.35,199 తగ్గింపుతో అమెజాన్‌లో రూ.82,500 కన్నా తక్కువ ధరకు లభిస్తోంది.

Read Also : Samsung Galaxy A55 5G : ఫీచర్ల కోసమైన ఈ శాంసంగ్ 5G ఫోన్ కొనాల్సిందే.. ట్రిపుల్ కెమెరా సెటప్ అదుర్స్.. ధర ఎంతంటే?

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ ప్రారంభంలో రూ.1,29,999గా ఉండేది. ఏఐ ఫీచర్లు, ఎస్ పెన్ సపోర్ట్, స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, అమోల్డ్ ప్యానెల్ వంటి క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అమెజాన్‌‌లో ఈ గెలాక్సీ S24 అల్ట్రా 5G డీల్ ఎలా పొందాలో చూద్దాం..

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ధర :
ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ధర రూ.84,800గా ఉంది. అసలు లాంచ్ ధర కన్నా రూ.35,199 తక్కువగా ఉంటుంది.

కస్టమర్లు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌ ద్వారా అదనంగా రూ.2,544 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ ఫోన్ ధర దాదాపు రూ.82,250కి తగ్గుతుంది. కొనుగోలుదారులు నెలకు రూ.4,111 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు.

కస్టమర్లు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు పొందవచ్చు. మీ ఫోన్‌ను గెలాక్సీ S24 అల్ట్రా అప్‌గ్రేడ్ చేస్తుంటే.. మోడల్, ఆపరేటింగ్ కండిషన్ బట్టి రూ.61,150 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. కొనుగోలుదారులు శాంసంగ్ కేర్ ప్లస్, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ వంటి యాడ్-ఆన్‌లను కూడా ఎంచుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ (Samsung Galaxy S24 Ultra 5G) 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.8-అంగుళాల QHD+ అమోల్డ్ ప్యానెల్‌ను పొందుతుంది. అదనపు ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా ఆర్మర్‌ను కలిగి ఉంది.

ఈ శాంసంగ్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. కొనుగోలుదారులు 12GB ర్యామ్, 1TB ఇంటర్నల్ స్టోరేజీ మధ్య ఎంచుకోవచ్చు. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ యూఐ 7ని కలిగి ఉంది.

Read Also : Oppo K13x : రూ. 15వేల లోపు ధరలో ఒప్పో K13x ఫోన్ వచ్చేస్తోంది.. రీబ్రాండెడ్ వెర్షన్ కెమెరా, బ్యాటరీ వివరాలివే..!

ఈ శాంసంగ్ ఫోన్ 200MP ప్రైమరీ షూటర్, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్ వంటి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.