Oppo K13x : రూ. 15వేల లోపు ధరలో ఒప్పో K13x ఫోన్ వచ్చేస్తోంది.. రీబ్రాండెడ్ వెర్షన్ కెమెరా, బ్యాటరీ వివరాలివే..!

Oppo K13x : ఒప్పో నుంచి సరికొత్త ఒప్పో K13x ఫోన్ లాంచ్ కానుంది. రీబ్రాండెడ్ వెర్షన్ ఫీచర్లు, ధర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Oppo K13x : రూ. 15వేల లోపు ధరలో ఒప్పో K13x ఫోన్ వచ్చేస్తోంది.. రీబ్రాండెడ్ వెర్షన్ కెమెరా, బ్యాటరీ వివరాలివే..!

Oppo K13x

Updated On : June 6, 2025 / 4:39 PM IST

Oppo K13x : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి కొత్త ఒప్పో K13x ఫోన్ వచ్చేస్తోంది. ఒప్పో K సిరీస్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను విస్తరించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ ల్యాండింగ్ పేజీ ద్వారా టీజ్ చేసింది. స్పెసిఫికేషన్లు, ఇతర కీలక వివరాలను ఇంకా రివీల్ చేయలేదు.

Read Also : Samsung Galaxy A55 5G : ఫీచర్ల కోసమైన ఈ శాంసంగ్ 5G ఫోన్ కొనాల్సిందే.. ట్రిపుల్ కెమెరా సెటప్ అదుర్స్.. ధర ఎంతంటే?

ఈ హ్యాండ్‌సెట్ గతంలో గూగుల్ ప్లే కన్సోల్, గూగుల్ సపోర్టు ఉన్న ఫోన్ల జాబితాలో CPH2753 మోడల్ నంబర్‌తో కనిపించింది. ఈ ఫోన్ ఒప్పో A5 5G రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు.

గత ఏడాది భారత మార్కెట్లో ఒప్పో K12x ఫోన్ స్థానంలో ఒప్పో K13x ఫోన్ రానుంది. ఒప్పో K13x ఫోన్ డిస్‌ప్లే , కెమెరా, అంచనా ధర వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఒప్పో K13x స్పెసిఫికేషన్లు (అంచనా) :
ఒప్పో K13x 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా. ఈ ఒప్పో ఫోన్ LPDDR4x ర్యామ్, UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌ను పొందవచ్చు.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రావచ్చు. ఫ్రంట్ సైడ్ 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉండవచ్చు.

బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన భారీ 6820mAh బ్యాటరీని పొందవచ్చు. ఫ్రీ ఇన్‌స్టాల్ ఆండ్రాయిడ్ 15 కస్టమ్ యూఐతో వచ్చే అవకాశం ఉంది. ఒప్పో K13x డిస్‌ప్లేలో ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా పొందవచ్చు. ఈ ఫోన్ బరువు 208 గ్రాములు ఉంటుంది.

Read Also : iQOO Z10 Lite : కొత్త ఐక్యూ ఫోన్ అదుర్స్.. ఐక్యూ Z10 లైట్ వెర్షన్ వస్తోందోచ్.. ధర, ఫీచర్లు ఇవేనా? ఫుల్ డిటెయిల్స్..!

ఒప్పో K13x ధర (అంచనా) :
ఒప్పో K13x 5G ఫోన్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 15వేలు లోపు ఉంటుందని అంచనా. ఒప్పో K12x ఫోన్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 12,999 కు లాంచ్ అయింది. ఒప్పో K13x ఫోన్ అసలైన ధర ఎంత అనేది లాంచ్ సమయంలో రివీల్ కానుంది.