iQOO Z10 Lite : కొత్త ఐక్యూ ఫోన్ అదుర్స్.. ఐక్యూ Z10 లైట్ వెర్షన్ వస్తోందోచ్.. ధర, ఫీచర్లు ఇవేనా? ఫుల్ డిటెయిల్స్..!

iQOO Z10 Lite : ఐక్యూ ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ నెల 18న ఐక్యూ Z10 లైట్ వెర్షన్ రాబోతుంది. ఏయే ఫీచర్లు ఉండొచ్చంటే?

iQOO Z10 Lite : కొత్త ఐక్యూ ఫోన్ అదుర్స్.. ఐక్యూ Z10 లైట్ వెర్షన్ వస్తోందోచ్.. ధర, ఫీచర్లు ఇవేనా? ఫుల్ డిటెయిల్స్..!

iQOO Z10 Lite

Updated On : June 6, 2025 / 3:47 PM IST

iQOO Z10 Lite : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి ఇప్పుడు ఐక్యూ Z10 లైట్‌ లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఈ ఐక్యూ ఫోన్ జూన్ మూడో వారంలో లాంచ్ రిలీజ్ కావచ్చు.

Read Also : Credit Cards : ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉన్నాయా? క్యాన్సిల్ చేసే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!

ఐక్యూ Z10, ఐక్యూ Z10x సిరీస్ తర్వాత కంపెనీ ఈ లైట్ వెర్షన్ తీసుకువస్తోంది. ఎంట్రీ లెవల్ కొనుగోలుదారులకు క్యాటరింగ్ చేసే బడ్జెట్ ఫోన్‌గా ఉండొచ్చు. ఐక్యూ ఇండియా సీఈఓ నిపున్ మార్య ఈ ఫోన్ టీజర్‌ను షేర్ చేశారు.

ఐక్యూ Z10 లైట్ ఫోన్ అతిపెద్ద బ్యాటరీ 5Gతో వస్తుందని అంచనా. ఈ ఐక్యూ ఫోన్ ఫస్ట్ లుక్‌లో పిల్-ఆకారపు కెమెరా ఉందని కంపెనీ ధృవీకరించింది. ఐక్యూ Z10 లైట్ భారత్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్లు, ధర వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

ఐక్యూ Z10 లైట్ లాంచ్ తేదీ :
భారత మార్కెట్లో జూన్ 18న ఐక్యూ Z10 లైట్ లాంచ్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. ఈ ఐక్యూ ఫోన్ బ్లూ కలర్ వేరియంట్‌లో లాంచ్ అవుతుందని అంచనా. అయితే, ఈ ఐక్యూ ఇతర వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.

ఐక్యూ Z10 లైట్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
లీక్‌ల ప్రకారం.. ఈ ఐక్యూ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల HD+ LCD ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఈ ఐక్యూ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందవచ్చు.

ఐక్యూ Z10 లైట్ ఫోన్ 4GB ర్యామ్, 128GB స్టోరేజీతో ఉండవచ్చు. 6,000mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్‌లతో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

ఈ ఐక్యూ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. లీక్‌ల ప్రకారం.. మీడియాటెక్ డైమన్షిటీ 6300 లేదా డైమన్షిటీ 9400 ద్వారా పవర్ పొందవచ్చని కూడా సూచిస్తున్నాయి.

Read Also : Vivo T4 Ultra : కొత్త వివో ఫోన్ కావాలా? అదిరిపోయే ఫీచర్లతో వివో T4 అల్ట్రా వచ్చేస్తోంది.. ధర ఎంత ఉండొచ్చంటే?

iQOO Z10 లైట్ ధర (అంచనా) :
ప్రస్తుతానికి కంపెనీ ఎలాంటి ధర వివరాలను వెల్లడించలేదు. ఈ ఫోన్ ధర దాదాపు రూ.12వేల మధ్య ఉంటుందని అంచనా. ఐక్యూ Z9 లైట్ 5G ఫోన్ రూ.10,499కి కొనుగోలు చేయొచ్చు.ఈ ఐక్యూ ఫోన్ అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.