Vivo T4 Ultra : కొత్త వివో ఫోన్ కావాలా? అదిరిపోయే ఫీచర్లతో వివో T4 అల్ట్రా వచ్చేస్తోంది.. ధర ఎంత ఉండొచ్చంటే?
Vivo T4 Ultra : వివో అభిమానులకు అదిరే న్యూస్.. ఈ నెల 11న వివో T4 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.

Vivo T4 Ultra
Vivo T4 Ultra : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? ఈ నెల 11న భారత మార్కెట్లోకి వివో T4 అల్ట్రా 5G ఫోన్ లాంచ్ (Vivo T4 Ultra) కానుంది. ఈ హ్యాండ్‌సెట్ గత ఏడాది భారత మార్కెట్లో వివో T3 అల్ట్రా తర్వాత వస్తోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో మైక్రోసైట్ ఇప్పటికే లైవ్ అయింది.
Read Also : Credit Cards : ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉన్నాయా? క్యాన్సిల్ చేసే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!
ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్, బ్రౌన్ ఫినిష్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అదనంగా, కెమెరా, ప్రాసెసర్‌తో సహా హ్యాండ్‌సెట్ కీలక ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. వివో T4 అల్ట్రా కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే వంటి మరిన్ని ఫీచర్లను పొందవచ్చు.
వివో T4 అల్ట్రా 5G డిజైన్ :
వివో T3 అల్ట్రా మాదిరిగానే వివో T4 అల్ట్రా(Vivo T4 Ultra)లో కెమెరా మాడ్యూల్ ఉండొచ్చు. ఈ హ్యాండ్‌సెట్ బ్యాక్ ప్యానెల్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఓవల్ షేప్ కెమెరా ఐలాండ్, సర్కిల్ స్లాట్‌లో 2 కెమెరా సెన్సార్‌లను కలిగి ఉంటుంది.
సర్కిల్ కింద టెలిఫోటో షూటర్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో రింగ్ షేప్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ కూడా కలిగి ఉంది.
వివో T4 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు :
ఈ కేటగిరీలో వివో T4 అల్ట్రా ఫోన్ 10x టెలిఫోటో మాక్రో జూమ్ ఫస్ట్ హ్యాండ్‌సెట్. కంపెనీ ఇంకా ధర ఎంత అనేది వెల్లడించలేదు. అదనంగా, ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో OISతో 50MP సోనీ IMX921 సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 50MP పెరిస్కోప్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ TSMC 3వ జనరేషన్ 4nm-ఆధారిత డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్, 3.4GHz వద్ద ఉంటుంది.
Read Also : Flipkart Loans : గుడ్ న్యూస్.. మీకు అకౌంట్ ఉందా? ఇక ఫ్లిప్‌కార్ట్ నుంచి నేరుగా లోన్లు తీసుకోవచ్చు..!
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల pOLED క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, 5వేల నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఐ కేర్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంటుందని అంచనా. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్OS 15తో ఫ్రీ లోడ్ అయి ఉండవచ్చు.
వివో T4 అల్ట్రా ధర (అంచనా) :
భారత మార్కెట్లో వివో T4 అల్ట్రా ధర దాదాపు రూ. 34వేల వరకు ఉంటుందని అంచనా.