Apple iPhone 16e : అమెజాన్‌లో ఐఫోన్ 16eపై ఊహించని డిస్కౌంట్.. రూ. 60వేల ఫోన్ జస్ట్ ఎంతంటే? ఇంత తక్కువకు మళ్లీ జన్మలో రాదు..!

Apple iPhone 16e : అమెజాన్‌లో ఐఫోన్ 16e ప్రారంభ ధర రూ. 59వేల నుంచి భారీ తగ్గింపు ధరకే లభ్యమవుతుంది. ఈ అద్భుతమైన ఐఫోన్ డీల్ ఎలా పొందాలంటే?

Apple iPhone 16e

Apple iPhone 16e : ఆపిల్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ఆఫర్.. కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. ఇటీవలే లాంచ్ అయిన కొత్త ఐఫోన్ 16e భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ప్రత్యేకించి అమెజాన్‌ ఈ ఐఫోన్ 16eపై డిస్కౌంట్ అందిస్తోంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, ప్రీమియం డిజైన్, యాక్షన్ బటన్ కలిగిన కొత్త ఐఫోన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

Read Also : Reliance Jio : జియో యూజర్లకు పండగే.. నెలవారీ రీఛార్జ్ అక్కర్లేదు.. సింగిల్ టైమ్ రీఛార్జ్.. 336 రోజుల వ్యాలిడిటీ.. అన్ని నెట్‌వర్క్‌లకు ఫ్రీ కాల్స్..!

అమెజాన్‌లో ఐఫోన్ 16e మోడల్ బ్యాంక్ ఆఫర్లతో రూ. 7,110 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ భారత మార్కెట్లో రూ. 59,900కు లాంచ్ అయింది. ఐఫోన్ 16 సిరీస్‌లో అత్యంత సరసమైన వేరియంట్‌ ఇదే. ఆపిల్ ఇంటెలిజెన్స్, ఫేస్‌ ఐడీ, ఇతర ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. అమెజాన్‌లో ఐఫోన్ 16e ధర ఎంత తగ్గిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌లో ఐఫోన్ 16e ధర :
ప్రస్తుతం అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 16e ధర రూ.3,110 తగ్గింపుతో రూ.56,790కి అందుబాటులో ఉంది. కస్టమర్లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో ధరను రూ.4వేలు తగ్గించవచ్చు. ఐఫోన్ 16e ధర రూ.53వేల కన్నా తక్కువకు తగ్గుతుంది.

మీరు ఈఎంఐలో ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే నెలకు రూ.2,753 నుంచి EMI ఆప్షన్ ఎంచుకోవచ్చు. కస్టమర్లు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్‌తో కొత్త ఐఫోన్ 16e కోసం ఎక్స్ఛేంజ్ కావాలంటే ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను ఎంచుకోవచ్చు. మీ ఫోన్, మోడల్, వర్కింగ్ కండిషన్, వేరియంట్ ఆధారంగా రూ.22,800 వరకు సేవ్ చేయొచ్చు.

ఆపిల్ ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16e 6.1-అంగుళాల OLED 460ppi సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. 1200 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. HDR, ట్రూ టోన్, సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఈ ఐఫోన్ పవర్‌ఫుల్ A18 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. iOS 18.4పై రన్ అవుతుంది. ఈ ఫోన్ దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ68-సర్టిఫై అయింది.

Read Also : Split ACs Offers : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలపై బిగ్ డిస్కౌంట్లు.. ఈ వేసవిలో రూ.25వేల లోపు ధరకే కొత్త AC ఇంటికి తెచ్చుకోండి..!

ఈ ఐఫోన్ 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌కు సపోర్టు ఇస్తుంది. కెమెరాలో OISతో కూడిన 48MP వైడ్-యాంగిల్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్, 4K 60fps వద్ద డాల్బీ విజన్‌తో HDR వీడియో రికార్డింగ్, 30fps వద్ద 4K HDR వరకు సపోర్టుతో సినిమాటిక్ మోడ్ ఉన్నాయి. ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. 60fps వద్ద 4K వరకు రికార్డ్ చేయగలదు.