Split ACs Offers : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలపై బిగ్ డిస్కౌంట్లు.. ఈ వేసవిలో రూ.25వేల లోపు ధరకే కొత్త AC ఇంటికి తెచ్చుకోండి..!

Split ACs Offers : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో మీరు రూ. 25వేల లోపు స్ప్లిట్ ఏసీలను కొనుగోలు చేయవచ్చు. ఈ కొనుగోళ్లపై బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Split ACs Offers : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీలపై బిగ్ డిస్కౌంట్లు.. ఈ వేసవిలో రూ.25వేల లోపు ధరకే కొత్త AC ఇంటికి తెచ్చుకోండి..!

Split ACs Offers

Updated On : April 22, 2025 / 5:15 PM IST

Split ACs Offers : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? ఈ వేసవిలో తక్కువ ధరలో ఏసీ కొనేసుకోవచ్చు. మీరు రూ. 25వేల లోపు స్ప్లిట్ ఏసీ కొనాలని చూస్తుంటే ఇదే అద్భుతమైన అవకాశం. ప్రస్తుతం, ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వివిధ బ్రాండ్ల నుంచి ఎయిర్ కండిషనర్లను ఆకర్షణీయమైన ధరలకు అందిస్తున్నాయి.

Read Also : Free JioHotstar : జియో అదిరే ఆఫర్.. ఫ్రీ జియో హాట్‌స్టార్ ఆఫర్ మళ్లీ పొడిగింపు.. ఐపీఎల్ మ్యాచ్‌లు లైవ్ చూడొచ్చు..!

50 శాతం వరకు తగ్గింపుతో మీకు నచ్చిన ఏసీని కొనేసుకోవచ్చు. అదనంగా, మీ ఏసీ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్స్ సమయంలో మీరు బడ్జెట్-ఫ్రెండ్లీ స్ప్లిట్ ఏసీని కొనుగోలు చేయాలంటే కొన్ని అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

డైకిన్ స్ప్లిట్ ఏసీ :
అమెజాన్‌లో డైకిన్ నుంచి స్ప్లిట్ ఏసీ కేవలం రూ.26,490కి లభిస్తుంది. రూ.3వేల బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో ఈ ఏసీ ధర రూ.23,490కి తగ్గుతుంది. ప్రీమియం యూనిట్లలో ఈ బ్రాండ్ పాపులర్ కాగా, స్ప్లిట్ ఏసీ 0.8 టన్నుల కెపాసిటీని కలిగి ఉంది. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ కాపర్ కంప్రెసర్‌ను కలిగి ఉంది. 2.5 PM ఫిల్టర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఒక ఏడాది వారంటీతో పాటు కంప్రెసర్‌పై 5 ఏళ్ల వారంటీతో వస్తుంది.

మార్క్యూ స్ప్లిట్ ఏసీ :
ఫ్లిప్‌కార్ట్‌లో, మార్క్యూ స్ప్లిట్ ఏసీ ధర కేవలం రూ. 23,990 మాత్రమే. మీ కొనుగోలుపై 5 శాతం వరకు అన్‌‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఈ మోడల్ టర్బో కూల్ టెక్నాలజీతో పాటు 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఒక టన్ సామర్థ్యంతో పవర్ కెపాసిటీ కోసం 5-ఇన్-1 ఇన్వర్టర్ టెక్నాలజీని కలిగి ఉంది.

Read Also : ATM New Rules : మే 1 నుంచి ఏటీఎం కొత్త రూల్స్.. ఇకపై డబ్బులు తీసినా.. బ్యాలెన్స్ చెక్ చేసినా ఛార్జీలు చెల్లించాల్సిందే!

క్రూయిజ్ ఏసీ :
మీరు అమెజాన్‌లో క్రూయిజ్ నుంచి 1-టన్ స్ప్లిట్ ఏసీని కొనేసుకోవచ్చు. ఈ ఏసీ ధర రూ.26,490. ఈ మోడల్‌పై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. 7-దశల ఎయిర్ ఫిల్ట్రేషన్‌తో వస్తుంది. 4-ఇన్-1 కన్వర్టిబుల్ సిస్టమ్, పీఎం 2.5 ఫిల్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎయిర్ క్వాలిటీని అందించి మీ ఇంటి గదిని ఎప్పుడూ కూలింగ్‌‌గా ఉంచుతుంది.