Free JioHotstar : జియో అదిరే ఆఫర్.. ఫ్రీ జియో హాట్‌స్టార్ ఆఫర్ మళ్లీ పొడిగింపు.. ఐపీఎల్ మ్యాచ్‌లు లైవ్ చూడొచ్చు..!
Free JioHotstar : ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్ యూజర్లకు జియో ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. మొబైల్ ఫోన్లలో ఐపీఎల్‌ను ఫ్రీగా చూడొచ్చు.

Free JioHotstar
Free JioHotstar : ఐపీఎల్ ప్రియులకు గుడ్ న్యూస్.. మార్చి 22న ప్రారంభమైన ఈ టోర్నమెంట్ మే 25 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రేక్షకుల దృష్టిని ఐపీఎల్ ఆకర్షిస్తుంది. భారీ సంఖ్యలో ఐపీఎల్ అభిమానులు టీవీలు, మొబైల్ నుంచి ఐపీఎల్ లైవ్ మ్యాచ్ వీక్షిస్తుంటారు.
ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ అయిన (JioHotstar) ద్వారా కూడా డిజిటల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్‌లకు వివిధ ఫ్రీ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. 2016లో జియో ఫ్రీ కాలింగ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. ఐపీఎల్ ఔత్సాహికుల కోసం కంపెనీ ఇప్పుడు ఎంపిక చేసిన ప్లాన్‌లతో ఫ్రీ జియోహాట్‌స్టార్ సభ్యత్వాన్ని అందిస్తోంది.
ఈ ప్రమోషనల్ ఆఫర్ రూ.299 లేదా అంతకంటే ఎక్కువ ధర గల ప్లాన్‌లకు అందుబాటులో ఉంది. ఇందులో కనీసం 1.5GB డేటా ఉంటుంది. మార్చి 31, 2025న ఈ ప్లాన్ గడువు పొడిగించగా.. ఇటీవలే ఏప్రిల్ 15 వరకు రెండోసారి.. మళ్లీ ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. ఈ ఆఫర్ కొత్త యూజర్లు, ఇప్పటికే ఉన్న జియో కస్టమర్లకు అందుబాటులో ఉంది. రూ.299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌పై ఉన్నవారు 90 రోజుల పాటు ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.
90 రోజులు ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ :
జియో రూ.349, రూ.899, రూ.999 ప్లాన్‌లతో 90 రోజుల పాటు ఫ్రీ జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. రూ.349 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. వినియోగదారులకు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ SMS కూడా అందిస్తుంది. అదే సమయంలో, రూ.899, రూ.999 ప్లాన్‌లను ఎంచుకునే వినియోగదారులు 84 రోజుల ఎక్స్‌టెండెడ్ వ్యాలిడిటీని పొందవచ్చు.
జనవరి 2025 నాటికి ట్రాయ్ డేటా ప్రకారం.. జియో 6లక్షల మందికి పైగా కొత్త కస్టమర్లను సంపాదించుకుంది. జియో మొత్తం మార్కెట్ వాటాను 40.46 శాతానికి పెంచేసింది. జియో మొత్తం వినియోగదారుల సంఖ్య 46.58 కోట్లకు చేరుకుంది. ఎయిర్‌టెల్ 33.61 శాతం మార్కెట్ వాటాతో 38.69 కోట్లకు పైగా యూజర్లతో రెండవ స్థానంలో ఉంది.
మరోవైపు, వోడాఫోన్ ఐడియా (Vi) మార్కెట్ వాటా తగ్గింది. ఇప్పుడు 17.89 శాతంగా ఉంది. కేవలం 20.59 కోట్ల మంది వినియోగదారులు మాత్రమే ఉన్నారు. అదే సమయంలో, BSNL మార్కెట్లో 7.95 శాతం వాటాతో చిన్న వాటాను కలిగి ఉంది. దాదాపు 9.15 కోట్ల మంది యూజర్లతో సర్వీసులను అందిస్తోంది.