Hero Vida V2 Scooter : కిర్రాక్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన హీరో విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 165 కి.మీ దూసుకెళ్తుంది!
Hero Vida V2 Electric Scooter : హీరో విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర భారీగా తగ్గిందోచ్.. ఏకంగా రూ. 32వేలు తగ్గింపు అందిస్తోంది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 165 కిలోమీటర్లు వేగంగా దూసుకెళ్లగలదు.

Hero Electric Scooter
Hero Vida V2 Electric Scooter : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను భారీగా తగ్గించింది. కంపెనీ విడా V2 స్కూటర్ ధరను ఏకంగా రూ.32వేలు తగ్గించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర తగ్గడంతో TVS, iQube, బజాజ్ చేతక్ వంటి టూవీలర్ల కన్నా చాలా చౌకగా మారింది. హీరో విడా V2 లైట్, ప్లస్, ప్రో అనే 3 వేరియంట్లలో లభిస్తోంది. ఈ స్కూటర్ల ధరలు భారీగా తగ్గాయి. ఇందులో హీరో విడా V2 లైట్ ధర రూ.22వేలు తగ్గింది. హీరో విడా V2 ప్లస్ ధర రూ.32వేలు తగ్గింది. అలాగే, హీరో విడా V2 ప్రో స్కూటర్ ధరను రూ.14,700 తగ్గించింది.
హీరో విడా V2 స్కూటర్ ఫీచర్లు, పర్ఫార్మెన్స్ :
హీరో విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు, పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. విడా V2 లైట్ 2.2kWh బ్యాటరీని కలిగి ఉంది. అదే సమయంలో, ఈ స్కూటర్ పరిధి 94 కి.మీ. (IDC). టాప్ స్పీడ్ గంటకు 69 కి.మీ రేంజ్ అందిస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే.. 7-అంగుళాల TFT డిస్‌ప్లే, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, రీజెనరేటివ్ బ్రేకింగ్, కీలెస్ ఎంట్రీ, రెండు రైడింగ్ మోడ్‌లు (ఎకో, రైడ్) ఉన్నాయి. విడా V2 ప్లస్ 3.44kWh బ్యాటరీని కలిగి ఉంది. అదే సమయంలో, ఈ విడా V2 రేంజ్ 143 కి.మీ. (IDC).
టాప్ స్పీడ్ విషయానికి వస్తే.. గంటకు 85 కి.మీ వేగాన్ని అందిస్తుంది. అదనపు ఫీచర్లలో టర్న్-బై-టర్న్ నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, వెహికల్ టెలిమాటిక్స్ ఉన్నాయి. హీరో విడా V2 ప్రో 3.94 kWh బ్యాటరీతో వస్తుంది.
ఈ స్కూటర్ రేంజ్ 165 కి.మీ. (IDC). అదే సమయంలో, టాప్ స్పీడ్ గంటకు 90 కి.మీ అందిస్తుంది. హీరో విడా V2 కొత్త ధర, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి స్కూటర్ల కన్నా చౌకగా ఉంటుంది. హీరో విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 1.20 లక్షల నుంచి 1.35 లక్షల మధ్య ఉంటుంది. హీరో విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ మార్కెట్లో ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారింది.
హీరో విడా V2 వారంటీ వివరాలు :
హీరో విడా V2 ఈవీ స్కూటర్ 5 ఏళ్లు లేదా 50వేల కి.మీ రేంజ్ అందిస్తుంది. వాహన వారంటీ 3 ఏళ్లు లేదా 30వేల కి.మీ బ్యాటరీ వారంటీతో వస్తుంది. వినియోగదారులకు లాంగ్ టైమ్ గ్యారెంటీ అందిస్తుంది. హీరో విడా V2పై ఈ ధర తగ్గింపు అందిస్తోంది.
భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఇప్పుడు ఈ స్కూటర్ సరసమైనది మాత్రమే కాదు. ఫీచర్లు, పర్ఫార్మెన్స్‌తో ఇతర ఈవీ స్కూటర్ల పోటీదారులతో పోటీపడుతుంది. మీరు బడ్జెట్-ఫ్రెండ్లీ, ఫీచర్-రిచ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తుంటే విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఆప్షన్.