CMF Phone 2 Pro : నథింగ్ లవర్స్ కోసం CMF ఫోన్ 2 ప్రో వచ్చేస్తోంది.. కెమెరా, డిజైన్, ఫీచర్లు, ధర ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్
CMF Phone 2 Pro : కొత్త ఫోన్ కొంటున్నారా? సీఎంఎఫ్ 2 ప్రో ఈ నెల 28న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కెమెరా, ఫీచర్లు, డిజైన్ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి లుక్కేయండి.

CMF Phone 2 Pro : నథింగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. నథింగ్ బ్రాండ్ నుంచి మరో కొత్త CMF ఫోన్ 2ప్రో వచ్చేస్తోంది. ఈ ప్రో మోడల్ లాంచ్ కోసం కంపెనీ సన్నాహాలు చేస్తోంది. రాబోయే ఈ సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో టెక్ ప్రపంచంలో ఇప్పటికే సంచలనంగా మారింది. బోల్డ్ డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లతో ప్రత్యేకంగా నిలిచిన CMF ఫోన్ 1 తర్వాత ఈ ఫోన్ రానుంది. సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ఈ నెలలో ఫోన్ లాంచ్ అవుతుందా? లేదా అనేది నథింగ్ అధికారికంగా ధృవీకరించలేదు.
Read Also : OnePlus 12 Price : పండగ చేస్కోండి.. అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 ధర భారీగా తగ్గిందోచ్.. ఇలా చేస్తే మీ సొంతమే!
లాంచ్ ఈవెంట్ సమయంలో సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోతో పాటు సీఎంఎఫ్ ఫోన్ 2, సీఎంఎఫ్ బడ్స్ 2, సీఎంఎఫ్ బడ్స్ 2a, సీఎంఎఫ్ బడ్స్ 2 ప్లస్‌లను కూడా రిలీజ్ చేయనుంది. నథింగ్ మినిమలిస్టిక్ డిజైన్, స్మార్ట్ యాక్సెసరీలు ఉండనున్నాయి. రాబోయే ఈవెంట్‌లో CMF ఫోన్ 2 ప్రో గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. డిజైన్, ఫీచర్లు, ధర వివరాలపై అంచనాలు ఇలా ఉన్నాయి.
CMF ఫోన్ 2 ప్రో లాంచ్ తేదీ (అంచనా) :
CMF ఫోన్ 2 ప్రో ఏప్రిల్ 28, 2025న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో డిజైన్ :
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో కూడా సీఎంఎఫ్ ఫోన్ 1 మాదిరిగానే కస్టమైజ్ కలర్ డిజైన్‌తో రానుంది. ఈ ఫోన్ లుక్ బ్యాక్ కవర్లతో వస్తుంది. ఈ ఫోన్‌లో ఎసెన్షియల్ కీ కూడా ఉండవచ్చు. యాప్ ఓపెన్ సెట్టింగ్ టోగుల్ షార్ట్ కట్ బటన్ కలిగి ఉంది. ఈ ఫోన్ ఆరెంజ్, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందవచ్చు. రాబోయే స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. ఈ సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 2X ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. లీక్‌ల ప్రకారం.. ఈ ఫోన్ 6.77-అంగుళాల ఫుల్ HD ప్లస్ అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
ఈ ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో రావచ్చు. CMF ఫోన్ 2 ప్రో 50W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ వైపు.. సీఎంఎఫ్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నథింగ్ OS 3.1 రన్ చేస్తుందని భావిస్తున్నారు. సెల్ఫీల విషయానికి వస్తే.. 32MP ఫ్రంట్ కెమెరాను కూడా ఉండవచ్చు.
భారత్‌లో CMF ఫోన్ 2 ప్రో ధర ఎంత? :
CMF ఫోన్ 2 ప్రో ధర రూ.22వేలు లోపు ఉంటుందని అంచనా. సీఎంఎఫ్ ఫోన్ 1 ధర రూ.14,999కు అందుబాటులో ఉంది.